Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
బెల్లీ ఫ్యాట్ ను ఖచ్చితంగా కరిగించే 7 ఫ్రూట్స్
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఊబకాయులుగా మారుతుంటే, మరికొందరేమో పొట్ట పెంచేస్తున్నారు. తర్వాత ఈ పొట్టను, చిరు బొజ్జలను కరిగించే మార్గమేది? అని చింతిస్తుంటారు. పలుచని పొట్ట వుండాలి, నాజూకుగా వుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఫ్లాట్ బెల్లీతో అందంగా...నాజూగ్గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. బెల్లీ ఫాట్ కు వివిధ కారణాలున్నాయి, గ్యాస్ లేట్ నైట్ డిన్నర్, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం, వ్యాయామం చేయకపోవడం, రాత్రుల్లో లేటుగా తినడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం, వ్యాయామలేమి, క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారాలను తినడం, నిద్రలేమి.. ఇలా వివిధ రకాల కారణాలున్నాయి.
బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి కఠినమైన ఆహార నియమాలు, ప్రతిరోజూ వ్యాయామాలు చాలామందికి సాధ్యం కావు. కనుక చివరకు వారు కఠినమైన ఆహార నియమావళికే అలవాటు పడి ఉన్న ఆరోగ్యం కూడా కోల్పోతారు. ఏరకమైన శ్రమా లేకుండా పలుచని పొట్ట పొందాలనుకునేవారు మంచి ఆహారపు అలవాట్లును కలిగి ఉండాలి. రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ను చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇవి పొట్టలో గ్యాస్ ఏర్పడకుండా చేస్తాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ ఏర్పడకుండా నివారిస్తాయి. అలాగే శరీరంలో ఫ్యాట్ ఏర్పడకుండా చేస్తాయి. ఫ్లాట్ బెల్లీ తగ్గించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ..అవేంటో తెలుసుకుందాం..

వాటర్ మెలోన్ :
వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వాటర్ తో పాటు, అమినో యాసిడ్స్, విటమిన్ ఎ మరియు సి లు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఫ్యాట్ కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బరువు తగ్గించడానికి బెస్ట్ హోం రెమెడీ. డైలీ డైట్ లో వాటర్ మెలో చేర్చడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా కరిగిస్తుంది.

బొప్పాయి:
బొప్పాయిలో లోఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ జీర్ణశక్తిని పెంచుతుంది . ఫ్యాట్ ను కరిగిస్తుంది,దాంతో బరువు తగ్గించుకోవచ్చు. బొప్పాయి డైట్ 10 రోజుల్లో నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది.

పైనాపిల్ :
పైనాపిల్లో బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ పైనాపిల్లో క్యాలరీలు తక్కువ విటమిన్ సి ఎక్కువ. ఇది మెటబాలిజంను పెంచుతుంది. ఫ్యాట్ ను కరిగిస్తుంది.

అవొకాడో:
అవొకాడోలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవొకాడో తినడం వల్ల ఆకలిని దూరం చేస్తుంది. మోనో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అరటిపండ్లు:
అరటిపండ్లలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి, జీర్ణశక్తిని పెంచుతాయి మరియు బరువును తగ్గిస్తాయి. అరటిపండ్లను డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఫ్యాట్ ను కరిగిస్తుంది.

యాపిల్స్:
యాపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల పొట్ట ఫుల్ అయినట్లు అగుపిస్తుంది, దాంతో ఇతర ఆహారాల మీద కోర్కెలు కలగవు, ఆపిల్స్ ను ప్రతి రోజూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఫ్లాట్ టమ్మీ కరిగించుకోవచ్చు.

ద్రాక్ష:
ద్రాక్ష పొట్ట నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది. జీర్ణ శక్తిని ఆలస్యం చేస్తుంది. శరీరంలో ఎక్స్ ట్రా ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ ను 10 రోజులు తాగడం వల్ల 10 పౌండ్స్ బరువు తగ్గించుకోవచ్చు.



Click it and Unblock the Notifications