For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెల్లీ ఫ్యాట్ ని ఎఫెక్టివ్ గా కరిగించి.. ఫ్లాట్ గా మార్చే న్యాచురల్ ఫుడ్స్

By Swathi
|

షర్ట్ వేసినా, టీ షర్ట్ వేసినా, డ్రెస్ వేసినా, చీర కట్టినా.. అసహ్యంగా కనిపిస్తుంది బెల్లీ ఫ్యాట్. మనలో చాలామందిని చాలా ఇబ్బందిపెట్టే సమస్య బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ వల్ల చాలామంది కాన్ఫిడెన్స్ కోల్పోతారు, అలాగే నలుగురిలో వెళ్లాలంటే.. గిల్టీగా ఫీలవుతారు.

ఈ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి చేసే చాలా ప్రయత్నాలు విఫలమవుతాయి. కాబట్టి డైట్ లో మార్పులు చేసుకోవాలి. కొన్ని సింపుల్ డైట్ టిప్స్ ఫాలో అయితే బెల్లీ ఫ్యాట్ కి దూరమవవచ్చు. అది కూడా ఇంట్లో రెగ్యులర్ ఉపయోగించే పదార్థాలే బెల్లీ ఫ్యాట్ రెమిడీస్.

పొట్ట ఫ్లాట్ గా, మీరు స్మార్ట్ గా కనిపిస్తూ.. కాన్ఫిడెన్స్ పొందవచ్చు. మరి మీ పొట్టను, నడుమును ఫ్లాట్ గా మార్చే.. సింపుల్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దామా..

సోంఫు

సోంఫు

అర టీస్పూన్ సోంపు తీసుకుని భోజనం తర్వాత నములుతూ ఉండాలి. లేదా ఒక కప్పు వేడినీటిలో అర టీస్పూన్ సోంఫు కలుపుకుని ఉదయాన్నే తీసుకోవాలి.

ఎగ్స్

ఎగ్స్

రెండు ఉడికించిన ఎగ్స్ తో.. మీ రోజుని ప్రారంభించండి. దీనివల్ల రోజంతా పరిమితికి మించి తినకుండా అడ్డుకోవచ్చు. ఎక్కువ సమయం పొట్ట నిండిన ఫీలింగ్ కలిగించడంతో పాటు.. పోషకాలు అందించి.. పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.

అరటిపండు

అరటిపండు

ప్రతిరోజూ స్నాక్ గా లేదా స్మూతీ రూపంలో అరటిపండును డైలీ డైట్ లో చేర్చుకోండి. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం.. బ్లోటింగ్ ని తగ్గిస్తుంది.

దోసకాయలు

దోసకాయలు

ప్రతిరోజూ దోసకాయలను స్నాక్ గా లేదా సాండ్విచ్ లేదా సలాడ్ లో తీసుకోవాలి. దోసకాల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల మీ బరువు మెయింటెయిన్ చేస్తాయి.

నీళ్లు

నీళ్లు

రోజుకి ఎనిమిది గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. మీ యూరిన్ ని చెక్ చేసుకుంటే.. మీరు సరిపడా నీళ్లు తాగుతున్నారో లేదో తెలుస్తుంది.

నిమ్మ

నిమ్మ

టీ, జ్యూస్ లకు బదులుగా.. ఒకగ్లాసు ఫ్రెష్ నిమ్మరసం తాగాలి. ఇది బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

చిటికెడు దాల్చిన చెక్క పొడిని ఉదయాన్నే తీసుకునే టీ లేదా కాఫీలో మిక్స్ చేసి తీసుకోండి. దాల్చిన చెక్క కార్మినేటివ్ లాంటిది. ఇది.. బ్లోటింగ్ సమస్యను నివారిస్తుంది. పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.

వెనిగర్

వెనిగర్

ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ వెనిగర్, కొద్దిగా తేనె కలిపి ఉదయాన్నే పరకడుపున తీసుకోవాలి. ఇది నడుము చుట్టుకొలతను నాజూగ్గా మార్చి పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.

English summary

8 Foods from Your Kitchen That Will Give You a Flatter Tummy

8 Foods from Your Kitchen That Will Give You a Flatter Tummy. Get ready to look flatter, sexier and more confident. All of these foods are easily available right in your kitchen.
Story first published: Tuesday, September 20, 2016, 11:42 [IST]
Desktop Bottom Promotion