For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాలరీలు కరిగించి ..అధిక బరువును తగ్గించే హై ఫైబర్ ఫుడ్స్ ..!!

|

మనలో చాలా మంది బరువు తగ్గించే డైట్ ను అనుసరిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే న్యూట్రీషినల్ ఫుడ్స్ ఎంపిక చేసుకుంటుంటారు. మీరు ఫర్ ఫెక్ట్ శరీర ఆకరంను కలిగి ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది. కానీ, మీరు తీసుకొనే న్యూట్రీషియన్స్ సరిగా తీసుకోకపోతే మీరు చూడటానికి అందంగా కనబడరు. ఎందుకంటే, శరీర ఆరోగ్యమే, అందానికి పునాది. అందువల్ల అధిక ఫైబర్స్ కలిగిన ఆహారాలు మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మనకు చాలా అవసరం.

మన రెగ్యులర్ డైట్ లో ఎంత మేరకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను చేర్చుకుంటామో అంతకు పదింతలు ప్రయోజనం పొందవచ్చు. అందవల్లనే మీ రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ఫుడ్స్ చేర్చుకోవడం చాలా అవసరం. ఈ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఒకే సమయంలో అనే ప్రయోజనాలను అందిస్తుంది. మీ బరువును కంట్రోల్లో ఉంచుకోవడం, గుండెను సురక్షితంగా ఉంచుకోవడం, క్రొవ్వును కరిగించడంలో మరియు హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ పొందడానికి ఇది ఒక గొప్ప మూలం. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ ను చేర్చుకోవాలి.

మీ దిన చర్యను ప్రారంభించడానికి ఒక ఉత్తమ మార్గం, అత్యధికంగా ఫైబర్ కలిగిన ఒక కప్పు ఓట్స్ తో మొదలుపెట్టండి. భోజన సమయంలో కొన్ని వెజిటేబుల్స్ మరియు సలాడ్స్ ను తీసుకోవడం ఉత్తమం. ఎప్పుడూ బ్రౌన్ రైస్ మరియు మిల్లెట్ వంటి అన్ రిఫైండ్ ధాన్యాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ తృణధాన్యాల మీ ఆహారంలో డైటరీ ఫైబర్ ను జోడిస్తుంది. ఇవే కాకుండా మరికొన్ని ఫైబర్ కలిగి ఆహారాలు కూడా ఉన్నాయి వాటిని మీ రెగ్యురల్ డైట్ లో చేర్చుకొని, ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోండి.

ఓట్స్:

ఓట్స్:

బరువు తగ్గించడంలో ఓట్స్ గ్రేట్ గా సహాయపడుతుంది. వోట్స్ లో ఉన్న ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించుట మరియు మీ జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది.ఇది కూడా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించటానికి సహాయపడుతుంది. అంతేకాక రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచటానికి బీటా-గ్లూకాన్ కలిగి ఉంటుంది.

వీట్ బ్రెడ్:

వీట్ బ్రెడ్:

ఏ ఇతర తెలుపు బ్రెడ్ కంటే సంపూర్ణ గోధుమ రొట్టె మీ ఆరోగ్యానికి పది రెట్లు మెరుగైనది. తెలుపు రొట్టె కన్నా సంపూర్ణ గోధుమ రొట్టెలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. సంపూర్ణ గోధుమ రొట్టె ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

మీరు అనేక వంటకాల్లో బ్రోకలీని తప్పనిసరిగా వాడాలి. ఇది ఫైబర్ యొక్క ఒక గొప్ప మూలం మరియు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.ఒక కప్పు ఉడికించిన బ్రోకలీలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ :

అనేక మంది బ్రౌన్ బియ్యంనకు బదులుగా తెల్ల బియ్యం తినటం చూసి ఉంటారు. కానీ మీరు బ్రౌన్ బియ్యం తినటానికి కొన్ని అద్భుతమైన కారణాలు ఉన్నాయి. ఒక కప్పు బ్రౌన్ బియ్యం లో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

బార్లీ :

బార్లీ :

బరువు తగ్గించడంలో బార్లీ అమేజింగ్ డ్రింక్ . అవును,కేవలం బార్లీ బీర్ మరియు విస్కీల ఒక ముడి పదార్ధం కాదు. కానీ దీనిలో ఫైబర్ యొక్క ఒక గొప్ప మూలం ఉంది. గుండె వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రసిద్ధి చెందింది. ఇది బీటా గ్లూకాన్ యొక్క ఒక మంచి మూలంను కలిగి ఉంది. మీరు మీ అల్పాహారంలో బార్లీ తీసుకుంటే మీకు రోజు తక్కువ ఆకలి ఉన్న అనుభూతి కలుగుతుంది.

బాదం:

బాదం:

ఒక కప్పు బాదం పాలు మరియు బాదంపప్పులతో కూడిన కేరట్ లేదా రవ్వ హల్వా వంటి వాటిని ప్రతి ఒక్కరూ తినే ఒక రుచికరమైన వంటకాలుగా ఉన్నాయి. ఈ వంటకాలకు బాదం రుచిని జోడించడమే కాకుండా ఫైబర్ మరియు ప్రోటీన్ యొక్క గొప్ప మూలం కలిగి ఉంది.

యాపిల్:

యాపిల్:

మీరు ఈ సామెత వినే ఉంటారు. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు. ఇది కేవలం ఒక సామెత మాత్రమే కాదు. నిజానికి దీనిలో ఫైబర్ మరియు ప్రయోజనకరమైన ఫైటోకెమికల్స్ ను కలిగి ఉంది. ఒక సాధారణ పరిమాణం గల యాపిల్ లో 4.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

లెంటిల్స్ :

లెంటిల్స్ :

బరువు తగ్గించడంలో లెంటిల్స్ ఉపయోపడుతాయి. లెంటిల్స్ నే కాయధాన్యాలుగా పిలుస్తారు. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పోరాడవచ్చు.

బేరిపండ్లు:

బేరిపండ్లు:

ఇది చాలా ఆరోగ్యకరమైనది మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పండును సలాడ్ గా తయారు చేసి తింటూ ఉంటారు. మీరు దీనిని తొక్క తీయకుండా తింటే చాలా ఆరోగ్యకరమని చెప్పవచ్చు. ఒక సాధారణ పరిమాణం గల తొక్క తీయని పెరి పండులో 5.5 గ్రాములకు పైగా ఫైబర్ ఉంటుంది.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

పచ్చి క్యారెట్స్, వేయించిన క్యారెట్స్, ఉడికించిన క్యారెట్స్.. ఏవి తీసుకున్నా వీటి ద్వారా ఫైబర్ అందుతుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మలబద్ధకం నివారించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

అవొకాడో:

అవొకాడో:

కాడో పండు ఈ పండు ఫైబర్ యొక్క చాలా మంచి వనరుగా చెప్పవచ్చు. మొత్తం పండులో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ పండులో క్రీమీ ఫ్లెష్ ఉండుట వల్ల కొలెస్టరాల్ తగ్గించటానికి సహాయం మరియు గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాక మంచి కొవ్వులు కలిగి ఉంటుంది.

English summary

How Fibre Rich Foods Aids In Weight Loss

Fibre is a plant-based roughage that aids in weight loss. Hence, if you want to lose weight, you must eat a considerable amount of fibre the correct way. Fibre not only helps you to shed weight, it also helps you to maintain your weight.
Story first published: Monday, August 8, 2016, 23:22 [IST]
Desktop Bottom Promotion