For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి అల్లం ఎలా సహాయపడుతుంది ?

అల్లం ప్రతి వంటింట్లో ఉపయోగించే వస్తువు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు.. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. అయితే అనారోగ్య సమస్యలే కాదు.. అధిక ఫ్యాట్ ని కరిగించడంలో కూడా.. అల్లం మిరాకిలస్ గా పనిచేస్తుంది.

By Swathi
|

మీరు నేచురల్ బరువు తగ్గించుకోవాలని కోరుకుంటే, హెల్తీ లైఫ్ స్టైల్, లోఫ్యాట్ డైట్, రెగ్యులర్ గా వ్యాయామంతో పాటు, అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అల్లం బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

How To Lose Weight With Ginger

నడుము, తొడలు, పిరుదుల చుట్టూ.. ఫ్యాట్ పేరుకున్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. లావుగా మారిన విషయం ఈ భాగాల్లో పేరుకున్న ఫ్యాట్ ని చూస్తేనే అర్థమవుతుంది. ప్యాంట్స్ పట్టనప్పుడు మీ నడుము, తొడలు లావయ్యాయన్న విషయం అర్థం అవుతుంది.

ఇలా భారీగా పెరిగిన ఫ్యాట్ కరిగించుకోవడానికి ఎఫెక్టివ్ అండ్ క్విక్ రెమిడీస్ కోసం వేట మొదలుపెట్టేస్తారు. అయితే.. ఇలాంటప్పుడు అల్లం చక్కటి పరిష్కరం. ఇది మాత్రమే వేగంగా.. ఫ్యాట్ ని కరిగిస్తుంది. అల్లం ప్రతి వంటింట్లో ఉపయోగించే వస్తువు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు.. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. అయితే అనారోగ్య సమస్యలే కాదు.. అధిక ఫ్యాట్ ని కరిగించడంలో కూడా.. అల్లం మిరాకిలస్ గా పనిచేస్తుంది.

టిప్ 1

టిప్ 1

భోజనానికి, రాత్రి డిన్నర్ కి ముందు ఇలా చేయండి. చిన్న అల్లం ముక్క తీసుకుని తురుముకోవాలి. కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలపాలి. దాంట్లో అరకప్పు నీళ్లు కలిపి బాగా మిక్స్ చేసి.. తాగాలి.

టిప్ 2

టిప్ 2

భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా అల్లం తురుము కలుపుకుని తాగితే.. బరువు తగ్గుతారు. ఇదీ జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.

టిప్ 3

టిప్ 3

వెజిటబుల్స్ ఫ్రై చేయడానికి ముందు అల్లం తురుము ను ఒక టీస్పూన్ ఆయిల్ లో ఫ్రై చేయాలి. దీన్ని స్పైసీ ఫుడ్స్ లో కలపాలి. ఇది మీ ఆహారాలకు టేస్ట్ ని అందించడమే కాదు.. హెల్తీ కూడా. బరువు తగ్గడానికి ఇదో సింపుల్ టిప్.

టిప్ 4

టిప్ 4

రోజులో రెండో సగం స్నాక్స్ తినాలి అనిపిస్తుంది. అప్పుడు చిన్న అల్లం ముక్కను నములుతూ ఉండాలి. లేదా నోట్లో కొన్ని నిమిషాలు పెట్టుకోవాలి. ఇది తినాలన్న ఆలోచనను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి.

టిప్ 5

టిప్ 5

అల్లం టీని రోజుకి మూడు సార్లు తాగాలి. కొద్ది అల్లం ముక్కను ఒక పెద్ద కప్పు నీటిలో 15 నిమిషాలు సన్నని మంటపై వేడి చేయాలి. ఒక చుక్క తేనె కలిపి ఆ నీటిని తీసుకోవాలి. ఇది బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

How To Lose Weight With Ginger

How To Lose Weight With Ginger. Losing weight with ginger is a good idea as it contains many other healing effects. Read on to know how to use ginger for weight loss….
Story first published: Saturday, December 24, 2016, 14:25 [IST]
Desktop Bottom Promotion