For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేటెస్ట్ టెక్నిక్..: శరీరంలోని ఏడు భాగాల్లో మసాజ్ తో వెయిట్ లాస్..!!

By Swathi
|

ఫిట్ బాడీ షేప్ కావాలని ఎవరు కోరుకోరు ? ఫిట్ పర్సనాలిటీ కోసం.. గంటల తరబడి జిమ్ లో గడుపుతారు. కానీ.. ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అలా కాకుండా.. శరీరంలో కొన్ని ప్రాంతాల్లో మసాజ్ చేయడం వల్ల మీరు సర్ ప్రైజ్ అవుతారు. కొన్ని పాయింట్స్ లో కొన్నినిమిషాల పాటు.. మసాజ్ చేస్తే.. మెటబాలిజం పెరిగి.. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఆక్యుపంక్చర్ విధానం ద్వారా కొన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎఫెక్టివ్ గా తగ్గించవచ్చు. మసాజ్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి అవయవం యాక్టివ్ అవుతుంది. ప్రత్యేకంగా శరీరంలోని ఏడు భాగాల్లో ఒత్తిడి అంటే నొక్కడం వల్ల.. చాలా తేలికగా, వేగంగా బరువు తగ్గవచ్చు. కేవలం చేయాల్సిందల్లా ఒక్కటే మసాజ్.

ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్

శరీరంలోని ప్రతి అవయవం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. అందుకే.. ఒక ప్రాంతంలో చేసే మసాజ్ వల్ల.. జీర్ణశక్తి, అల్సర్, నొప్పి, ఆకలి, ఒత్తిడి ఇలా రకరకాల సమస్యలు దూరవుతాయి. అంతేకాదు.. ఈ భాగాల్లో కొన్ని నిమిషాల పాటు చేసే మసాజ్.. బరువు తగ్గడంలో మిరాకిల్ చేస్తుంది. మరి ఆ పార్ట్స్ ఏంటో మీరే చూడండి.

శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో మసాజ్ చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మెటబాలిజం వేగవంతం అవుతుంది. ఎక్స్ ట్రా ఫ్యాట్ ని బయటకు పంపుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల క్యాలరీలను ఈజీగా కరిగించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే శరీరంలోని ఏ భాగంలో ప్రెజర్ తీసుకురావాలో తెలుసుకుని.. బరువు తగ్గడానికి డిఫరెంట్ టెక్నిక్ ఫాలో అయిపోండి.

ఫేస్

ఫేస్

ముఖంపై ఈ ప్రాంతంలో ప్రెస్ చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఆకలి తగ్గుతుంది. ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా తినడానికి కారణమవుతాయి కాబట్టి ముందు వీటిని తగ్గించుకోవాలి. కాబట్టి ఈ ప్రాంతంలో రోజుకి 5 నిమిషాలు మసాజ్ చేయండి. రోజుకి రెండుసార్లు చేయడం వల్ల మీరే వండర్ అయ్యే ఫలితాలు పొందుతారు.

చేయి

చేయి

చేతిపై ఈ ప్రాంతంలో రోజుకి రెండు గానీ, మూడుసార్లు గానీ ఒక నిమిషం మసాజ్ చేయడం వల్ల అధిక శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. అలాగే.. ప్రేగుల పనితీరు మెరుగుపరుచుకోవచ్చు. ఇక్కడి నుంచి శరీరం మొత్తానికి ఎనర్జీ ప్రసరిస్తుంది.

మోకాలు

మోకాలు

శరీరంలోని మోకాలి భాగంలో మసాజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి అత్యతం ప్రయోజనం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు ఇన్ల్ఫమేటరీ ప్రక్రియను తగ్గిస్తుంది. ఇక్కడ మసాజ్ చేసేటప్పుడు ఎడమ మోకాలిని కుడి అరచేతితో కవర్ చేయాలి. అలాగే కుడి మోకాలిని ఎడమ అరచేతితో కవర్ చేయాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒక్కో కాలిని 9సార్లు మసాజ్ చేయాలి. 10 నిమిషాల్లో మసాజ్ పూర్తిచేయాలి. ఈ మసాజ్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.. కానీ ఏం కాదు. కాస్త ఓర్చుకోవాలి.

చెవి దగ్గర

చెవి దగ్గర

బొటనవేలు ఉపయోగించి ఈ ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల.. మంచి ఫలితాలు పొందవచ్చు. రోజుకి మూడు నిమిషాలు, మూడు సార్లు ఇక్కడ మసాజ్ చేయాలి. దీనివల్ల మెటబాలిజం పెరుగుతుంది. అధిక క్యాలరీలు తగ్గిస్తుంది.

కడుపు పై

కడుపు పై

బొడ్డుకి మూడు సెంటీమీటర్ల కింది భాగంలో.. మసాజ్ చేయాలి. చేతివేళ్లను కిందకి, పైకి కదిలిస్తూ మసాజ్ చేయాలి. రోజుకి రెండు సార్లు 2 నిమిషాలు ప్రెస్ చేయడం వల్ల జీర్ణక్రియ పెరిగి.. బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కాలికి

కాలికి

మడిమకు రెండు ఇంచుల పైభాగం వెనకవైపు మసాజ్ చేయాలి. ఇక్కడ మసాజ్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. బొటనవేలితే.. ఒక నిమిషం నొక్కాలి. నిదానంగా వదిలేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

అబ్డామినల్ సారో పాయింట్

అబ్డామినల్ సారో పాయింట్

ఈ భాగంలో మసాజ్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వేళ్లను కాస్త వంచి.. ఇక్కడ 5 నిమిషాలు నొక్కాలి. రోజూ ఇలా చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. అజీర్తి, అల్సర్, రిబ్ పెయిన్ వంటి సమస్యలు నివారించుకోవచ్చు.

English summary

Lose Weight Faster By Pressing These Seven Points On Your Body

Lose Weight Faster By Pressing These Seven Points On Your Body. Now you can easily burn those extra calories and get rid of extra pounds by applying pressure on these seven points.
Story first published: Friday, April 29, 2016, 17:06 [IST]
Desktop Bottom Promotion