Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
18 నెలల్లో 108 కేజీలు.. !! అనంత్ అంబానీ స్టన్నింగ్ వెయిట్ లాస్ స్టోరీ.. !
ఇప్పుడు యూత్ లోనూ, న్యూస్ లోనూ, ఒబేసిటీ హిస్టరీలోనూ అనంత్ అంబానీయే హాట్ టాపిక్. 18 నెలల్లో 108 కేజీలు తగ్గడం మామూలు విషయం కాదు కదా.. ! అందుకే.. అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది అనంత్ అంబానీ వెయిట్ లాస్ స్టోరీ. అందులోనూ అనంత్ అంబానీ చాలా న్యాచురల్ గా.. బరువు తగ్గడం అందరినీ మరింత ఆశ్చర్యపరిచే విషయం.
పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్
అనంత్ అంబానీని గతంలో చూసినవాళ్లెవరూ ఇప్పుడు గుర్తుపట్టలేరు. ఎందుకంటే.. భారీ పర్సనాలిటీ నుంచి.. ఎంత నాజూగ్గా మారాడంటే.. అదోదే మ్యాజిక్ చేశారా అన్నట్టు ఉంది. దీనివెనక ట్రీట్మెంట్ ఉందని చాలామంది భావిస్తున్నారు. కానీ... అనంత్ అంబానీ మాత్రం చాలా న్యాచురల్ గా వెయిట్ తగ్గారు.
బాలీవుడ్ సెలబ్రెటీస్, ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ కూడా.. ఆశ్చర్యపోతున్నారు. గతంలో వాళ్లు కూడా అనంత్ కి ఏమాత్రం హెల్త్ చేయలేకపోయారు. కానీ.. అనంత్ పట్టుదలతో.. చాలా ఓర్పుగా.. తన అనుకున్న విధంగా.. డైట్, ఎక్సర్ సైజ్ ఫాలో అయి.. తన బొద్దు శరీరాన్ని.. నాజూగ్గా మార్చేసుకున్నాడు. అది కూడా తన వయసు 21 సంవత్సరాలు. ఇలాంటి ఏజ్ లో ఇంత కమిట్ మెంట్ తో వర్కవుట్ చేయడం నిజంగా హ్యాట్సాఫ్ చేయాల్సిన విషయమే.
పరుగెత్తడం వల్ల 20 మేజర్ ఆరోగ్య ప్రయోజనాలు
ఇప్పుడు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవాళ్లకు, ఒబేసిటీతో బాధపడేవాళ్లకు అనంత్ అంబానీ.. ఇన్సిపిరేషన్ గా నిలుస్తాడు. నితా, ముఖేష్ అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ.. 18 నెలల్లో 108 కేజీలు తగ్గడం వెనక ఉన్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒబేసిటీ
అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి క్రోనిక్ ఆస్తమాతో బాధపడుతున్నాడు. దానివల్ల అతను ఉపయోగించిన మందులు అతను భారీగా వెయిట్ పెరగడానికి కారణమవయ్యాయి. దీంతో ఒబేసిటీ బారిన పడ్డాడు.

21 కిలోమీటర్ల వాక్
మనం కిలోమీటర్ నడిచేసరికి డీలాపడిపోతాం. కానీ.. అనంత్ అంబానీ రోజూ ఒకటి కాదు రెండు కాదు.. 21 కిలోమీటర్లు నడకసాగించాడు. బరువు తగ్గాలనే పట్టుదలతో.. అనంత్ క్రమం తప్పకుండా.. రెగ్యులర్ గా 21 కిలోమీటర్లు వాకింగ్ చేశాడు.

యోగా
ఫిట్ అండ్ హెల్తీగా ఉండటానికి యోగా మంచిదని.. ఎంతో కాలం నుంచి చెబుతూ ఉన్నారు. అది నిజమని నిరూపించారు అనంత్ అంబానీ. అతని వెయిట్ లాస్ యోగా కూడా కారణం. యోగా చేయడం వల్ల.. ఆహారంతో ఉండే సంబంధాన్ని మార్చేస్తుంది. దీనివల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

వెయిట్ ట్రెయినింగ్
బరువు తగ్గడం అంటే అంత సులువైన పని కాదు. ముందుగా మజిల్ వెయిట్ తగ్గించాలి. దీనికోసం వెయిట్ ట్రెయినింగ్ కంపల్సరీ. అందుకే అనంత్ అంబానీ.. రెగ్యులర్ గా వెయిట్ ట్రెయినింగ్ తీసుకున్నాడు. 18 నెలల్లో 108 కేజీలు తగ్గాడు.

వ్యాయామం
స్క్వేట్స్, స్ట్రెచెస్ వంటి రకరకాల వ్యాయామాలు చేశాడు అనంత్ అంబానీ.

కార్డియో
హార్ట్ రేట్ పెరిగితే.. ఫ్యాట్ తక్కువ టైంలో కరిగిపోతుందని మీకు ఎవరైనా చెప్పారా ? నిజమే ఇలా చేస్తే ఫ్యాట్ చాలా త్వరగా కరిగిపోతుందని.. హై ఇంటెన్సిటీ కార్డియో ఎక్సర్ సైజ్ రోజుకి కనీసం గంటపాటు చేశాడు అనంత్. అందుకే.. చాలా తక్కువ టైంలో ఎక్కువ బరువు తగ్గాడు.

డైట్
బరువు తగ్గాలనే పట్టుదల ఉన్నప్పుడు డైట్ ప్లాన్ చాలా ముఖ్యమైనది. చాలా హెల్తీ డైట్ తీసుకున్నాడు అనంత్. తక్కువ ఆహారం, జీరో షుగర్ డైట్ ఫాలో అయ్యాడు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అయిన బ్రెడ్, పాస్తా, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ కి అనంత్ దూరంగా ఉన్నాడు. కేవలం ప్రొటీన్ ఫుడ్స్ కి ప్రాధాన్యమిచ్చాడు.

రోజుకి 4 నుంచి 5 గంటలు
రోజుకి 4 నుంచి 5 గంటలపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేశాడు. అది కూడా 500 రోజులు చాలా డెడికేషన్ తో వ్యాయామం చేయడం వల్ల అనంత్ ఒబేసిటీని జయించగలిగాడు.

అలాగే పుష్ అప్స్, సూర్యనమస్కార్
అనంత్ అంబానీ.. తన శరీరంలో పైభాగాన్ని తగ్గించుకోవడానికి పుష్ అప్స్ ఎక్సర్ సైజ్ చేశాడు. అలాగే సూర్యనమస్కారం కూడా చేశాడు.

శుభాకాంక్షలు
అనంత్ చాలా పట్టుదలతో.. 18 నెలల్లో 108 కేజీలు తగ్గడంపై అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో.. అనంత్ ఫోటోలు చూసిన బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ ప్రశంశల వర్షం కురిపించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ అనంత్ ని కలిసి కంగ్రాట్స్ చెప్పాడు. అలాగే సచిన్, దోనీ కూడా విష్ చేశారు.

పట్టుదల
18 నెలల్లో బరువు తగ్గాలనే టార్గెట్ పెట్టుకున్నాడు అనంత్. ఈ టార్గెట్ రీచ్ అవడమే తన లక్ష్యంగా శ్రమించాడు. తన 21వ బర్త్ డేకి స్లిమ్ అవ్వాలి అనుకున్నాడు.. అనుకున్న సమయానికి సాధించాడు.



Click it and Unblock the Notifications