For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బక్కగా..పీలగా ఉండే వారు కండలు పెంచడానికి అద్భుతమైన ఆహరాలు

By Lekhaka
|

ప్రస్తుత రోజుల్లో యవ్వనంగా ఉండే వారు, మరిన్ని వర్క్ అవుట్స్(వ్యాయామాలు)చేసి, ఫర్ ఫెక్ట్ బాడీ షేప్ ను కలిగి ఉండాలని కోరుకుంటున్నారు! బాడీ బిల్డింగ్ వ్యాయామాల ద్వారా శరీరంలోని కండరాలు బలపడుతాయి. బాడీ బిల్డింగ్ వర్క్ అవుట్స్ చేసేవారు, వ్యాయామాల తర్వాత ఖచ్చితంగా తీసుకోవల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారాలను వారి వ్యాయామ కోర్సు మొత్తం తీసుకోవడం వల్ల బాడీ బిల్డ్ చేసుకోవడంతో పాటు, ఆరోగ్యంగా ఉండవచ్చు.

Best Vegetarian Body-Building Foods For Muscle Growth,

బాడీబిల్డ్ వ్యాయామాలు చేసే వారికోసం కొన్ని ప్రత్యేక ఆహారాలు క్రింది విధంగా లిస్ట్ ను తయారుచేశాం. వాటిని పరిశీలించి, మీరు రెగ్యులర్ గా తినాల్సిన ఆహారాల మీద అవగాహన చేసుకోండి . పోస్ట్ వర్క్ అవుట్స్ తర్వాత తీసుకొనే ఈ ఆహారాల్లో ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండి, మీకు అవసరం అయ్యే ఎనర్జీని అంధిస్తాయి. అయితే బాడీ బిల్డర్స్ తీసుకొనే ప్రతిదీ శరీర ఆరోగ్యానికి మంచిది కాదు, కొన్ని ఆహారాలను తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఫస్ట్ టైమ్ బాడీ బిల్డ్ చేసేవారు గుర్తుంచుకోవల్సిన విషయాలు

బాడీ బిల్డ్ వ్యాయామాలు చేసే వారు హెల్తీ డైట్ తీసుకోకపోతే, వారు ఎర్ బ్రోన్ డిసీజెస్ కు కారణం అవుతుంది. దాంతో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. బాడీ బిల్డ్ చేసే విషయంలో మీరు ఒక మంచి శరీరాకృతి పొందడమే మీ లక్ష్యం మరియు మీ ద్రుష్టి మొత్తం వర్క్ అవుట్స్ మీద మాత్రమే ఉంటే అవి ఏ మాత్రం సరిపోవు. బాడీబిల్డర్స్ కు హెల్తీ డైట్ చాలా అవసరం. బాడీ బిల్డ్ చేయడానికి వ్యాయామాలు ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువ వారు తీసుకొనే డైట్ మీద వారి ఆరోగ్యం, శరీరాకృతి మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ప్రతి బాడీ బిల్డర్ ఖచ్చితంగా తీసుకోవల్సిన కొన్ని ఆహారాల పట్టికను క్రింది విధంగా ఇచ్చాము. వాటిని పరిశీలించి మంచి ఆరోగ్యంతో పాటు, మంచి శరీరాకృతి పొందవచ్చు...

నట్స్ :

నట్స్ :

నట్స్ లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీ బిల్డింగ్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. నట్స్ లో బాదం , జీడిపప్పులో ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ అధికంగా ఉన్నాయి. వీటిలో క్యాలరీలు అధికంగా ఉన్నాయి. హెవీ వర్కౌట్ చేసిన తర్వాత ఒక కప్పు బాదం మిల్క్ తీసుకోవాలి. 30 గ్రాముల బాదం మిల్క్ లో 71 గ్రాముల హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి. జీడిపప్పులో 150 క్యాలరీలున్నాయి. ఇది ఒక బెస్ట్ బెజిటేరియన్ మజిల్ బిల్డింగ్ ఫుడ్ .

క్వీనా:

క్వీనా:

క్వినా బియ్యం మరియు పిండి మిశ్రమాలకు ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం. ఇందులో పుష్కలమైన అమైనో యాసిడ్స్ ఉండి, ఇది కండర నిర్మాణం కోసం పరిపూర్ణ ఆహారం ఉంది.క్వీనా అమేజింగ్ డైట్ ఫ్రెండ్లీ ఫుడ్ . ఇందులో హంగర్ ఫైటింగ్ ప్రోటీన్స్ తో నిండి ఉంటుంది .ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది . దాంతో ఎక్కువ తినకుండా బరువు పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు . ఇందులో ప్రోటీన్స్, అమినోయాసిడ్స్, ఫైబర్, బికాంప్లెక్స్ విటమిన్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండి మెటబాలిజం రేటును పెంచుతాయి.

బీన్స్ & లెగ్యూమ్స్:

బీన్స్ & లెగ్యూమ్స్:

మీరు కండర నిర్మాణాన్ని పెంచుకోదలచుకుంటే కాయధాన్యాలను తీసుకుంటుండాలి. కాయధాన్యాలలో మినిరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కు బాగా సహాయపడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి.

ధాన్యాలు:

ధాన్యాలు:

మీరు కండర నిర్మాణాన్ని పెంచుకోదలచుకుంటే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, నువ్వులు, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటి కాయధాన్యాలను తీసుకుంటుండాలి. కాయధాన్యాలలో మినిరల్స్, ఐరన్, అమినో ఫ్యాటీ యాసిడ్స్ , ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కు బాగా సహాయపడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి.

పండ్లు:

పండ్లు:

అరటి పండ్లు, కర్భూజ మరియు యాపిల్స్ లో మజిల్ బిల్డింగ్ కు సహాయపడే గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మినిరల్స్, విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి మజిల్ మాస్ కు గ్రేట్ గా సహాయపడుతుంది

టోఫు:

టోఫు:

సోయాబీన్ తో తయారు చేస్తారు, టోఫులో పుష్కలమైన అమైనో ఆమ్లాలు మరియు ఐసోఫ్లవోన్లు ఉండి ఇవి వర్క్ ఔట్స్ తర్వాత తిరిగి పూర్వస్థితికి చేరుకోవడానికి బాగా సహాయపడుతాయి.హైక్వాలిటీ ప్రోటీనులుండటం వల్ల కండరవ్రుద్దికి గ్రేట్ గా సహాయపడుతుంది.

చీజ్:

చీజ్:

చాలా మంది ఈ చీజ్ ను తినడానికి ఇష్టపడరు. అయితే ఇందులో మజిల్ బిల్డ్ చేసే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. జస్ట్ ఒక కప్పు కాటేజ్ చీజ్ లో 28గ్రాముల ప్రోటీనులు కలిగి ఉన్నాయి.

ఫార్మినేటెడ్ డ్రైరీ ప్రొడక్ట్స్ :

ఫార్మినేటెడ్ డ్రైరీ ప్రొడక్ట్స్ :

ఫార్మినేటెడ్ డైరీ ప్రొడక్ట్స్ పెరుగు, మజ్జిగా, కెఫ్రి వంటి వాటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోకి త్వరగా శోషింపబడుతుంది. హెల్తీ మజిల్ బిల్లిండ్ కు సహాయపడుతుంది. మజిల్ గ్రోత్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉన్నటువంటి పోషకాలు, న్యూట్రీషియలన్లు, మనిషికి కావల్సిన శక్తి సామర్థ్యాలను రెట్టింపుచేస్తుంది. ఇంకా ఆర్ బిసి కౌంట్ ను పెంచుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇంకా జీర్ణం నిధానంగా అయ్యి, ఆకలి పెంచదు. దాంతో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ నిర్ధిష్టంగా ఉంచుతుంది.ఆకుకూరలు, లెట్యూస్, బీట్స్, అవొకాడో, క్వాష్, వంటివి ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి కావాల్సిన క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, బి, సి, డి, ఇలు పుష్కలంగా అందుతుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మజిల్స్ ఏర్పడటానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

ప్రోటీన్ డ్రింక్స్:

ప్రోటీన్ డ్రింక్స్:

మజిల్స్ బిల్డ్ చేయడానికి మీరు చాలా సీరియస్ వెయిట్ ట్రైనింగ్ తీసుకొనేటప్పుడు, మీరు ఖచ్చితంగా ప్రోటీన్ డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. అయితే ప్రోటీన్ డ్రింక్స్ కు తేనె చేర్చి వెంటనే త్రాగేయాలి.మీరు వ్యాయామం చేసేటప్పుడు, ముఖ్యంగా వెయిట్ ట్రైనింగ్ , మరియు మీరు మీ శరీరం అధిక ఒత్తిడికి లోనవుతుంది. వర్కౌట్స్ చేసేటప్పడు ఎక్కువ ఒత్తిడిని మీ శరీరం మీద పెట్టాల్సి వస్తుంది. అందువల్ల వ్యాయామాలు చేసే వారికి ప్రోటీనులు చాలా అవసరం . ఒకసారి ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల ఇది శరీరంలో అమైనో ఆసిడ్స్ గా విడగొట్టబడుతుంది,అది శక్తిగా మారి ప్రతి రోజూ వ్యాయామం చేయడానికి అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

గ్రీన్ వెజిటేబుల్స్ లో తక్కువ క్యాలరీలున్న వెజిటేబుల్ ఇది . ఒక్క ఆస్పరాగస్ లో 4క్యాలరీలు కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ కు ఒక గొప్ప మూలం . ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది . దాంతో అధికంగా తినకుండా ఆపుచేస్తుంది. బరువు పెరగకుండా ఉండవచ్చు.

ఓట్స్ :

ఓట్స్ :

ప్రతి రోజూ ఓట్స్ తినడం చాలా ఆరోగ్యకరం. ముఖ్యంగా ఓట్స్ తో మీ దినచర్యను మొదలు పెడితే మరింత మంచిది. రోజూ ఒక కప్పు ఓట్స్ తినడం వల్ల శరీరంలో ఉత్ప్రేరకమైన ప్రక్రియను పెంచుతుంది . దాంతో జీవక్రియలక ఉపయోగపడే శక్తిని విడుదల చేయడానికి మరియు కొవ్వు నిల్వలను తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు బాడీబిల్డ్ కోరుకుంటున్నట్లైతే, మీరు తినే ఆహారంలో ఇది ఒక ఉత్తమ ఆహారం.

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ లో హెల్తీ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది .ఇది వైట్ రైస్ కు ప్రత్యామ్నాయ ఆహారం . అరకప్పు కప్పు బ్రౌన్ రైస్ లో 2గ్రాముల స్టార్చ్ ఉంటుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడుతుంది . బ్రౌన్ రైస్ లో డెన్సిటి ఫుడ్ . ఇది కొద్దిగా తినగానే హెవీగా పీలవుతారు, అదే విధంగా క్యాలరీలు తక్కువ . విటమిన్ బి సప్లై చేస్తుంది . దాంతో క్యాలరీలను బర్న్ చేస్తుంది.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా అనిపిస్తుంది. మజిల్ గ్రోత్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

 లోఫ్యాట్ మిల్క్ అండ్ మిల్క్ :

లోఫ్యాట్ మిల్క్ అండ్ మిల్క్ :

లోఫ్యాట్ మిల్క్ లో 20శాతం ప్రోటీన్ , 80శాతం ప్రోటీన్ ఉన్నాయి. ఇవిజీర్ణశక్తిని ఆలస్యం చేసి జీర్ణశక్తి రేటును బ్యాలెన్స్ చేస్తుంది.

English summary

Best Vegetarian Body-Building Foods For Muscle Growth

Best Vegetarian Body-Building Foods For Muscle Growth,The diet for muscle building should be followed in such a way that there is a surplus amount of calories even after the calories are burned through any exercise or workout session.
Desktop Bottom Promotion