ఈ న్యూ ఇయర్ లో ఈ 8 సాధారణ డైట్ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి

Subscribe to Boldsky

న్యూ ఇయర్ కు సంతోషంగా ఆహ్వానం పలకడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసినదే. న్యూ ఇయర్ అనగానే ఎన్నో ప్లాన్స్ ఆలాగే రిజల్యూషన్స్ మన మెదడుని ఆక్రమించి ఉంటాయి. కొత్త సంవత్సరమనేది సంతోషకరమైన సానుకూల మార్పులకు నాంది కావాలనే అభిలాష ప్రతిఒక్కరిలో కనిపిస్తుంది. తద్వారా, ఏడాది పొడుగునా ఆనందోత్సాహాలతో గడపాలని అందరూ ఆశిస్తారు. నిజమే కదా?

ఉద్యోగ సోపానాన్ని విజయవంతంగా ఎక్కడం, ప్రియతములతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచుకోవడానికై ప్రయత్నాలు అలాగే మానసిక, శారీరక ఆరోగ్య సంరక్షణ చర్యల వంటికి సంబంధించిన ప్లాన్స్ అనేవి సంవత్సర ప్రారంభంలో ఎక్కువమంది దృష్టి పెట్టే కొన్ని సాధారణ రిజల్యూషన్స్.

ఆరోగ్యమే మహాభాగ్యమనే నానుడిని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎందుకంటే, ఆరోగ్యంగా ఉండటంవల్లనే కెరీర్ లో ఉత్తమ స్థానంలో ఉండటం సాధ్యపడుతుంది అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి కూడా. ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్నా వీటికి ఇబ్బంది ఎదురయినట్లే లెక్క.

Common Diet Mistakes To Avoid

ఉదాహరణకు, నిరంతర అనారోగ్యంతో మీరు సతమతమవుతున్నట్టయితే మీరు మీ పనిని ఏకాగ్రతతో నిర్వహించలేరు. అందువల్ల, టాస్క్స్ ను సరైన విధంగా పూర్తిచేయడంలో విఫలమవుతారు.

అలాగే, మీ స్నేహితులతో సమయాన్ని గడపలేరు. అందువలన, మీ స్నేహితులని కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకునే అవకాశాన్ని మిస్ అవుతారు.

కాబట్టి, మీ లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. అందువలన, ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యాన్ని ఇవ్వండి.

ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగిన వ్యక్తి కూడా దురదృష్టవశాత్తూ కొన్నిసార్లు వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, ఆరోగ్యకరమైన అలవాట్లని పాటించకుండా ఉంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం మరింత ఎక్కువన్న విషయం మరచిపోకండి.

సరైన ఆహారాన్ని తీసుకోవడం, అలాగే ఒత్తిడిని నియంత్రించడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

వీటితో పాటు, మద్యపానం, ధూమపానం వంటి అనారోగ్యకర అలవాట్లను దూరం పెడుతూనే, కాలుష్యం నుంచి వీలైనంత వరకూ దూరంగా ఉండాలి. ఇవన్నీ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే మార్గాలు.

ఈ ఆర్టికల్ లో మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే కొన్ని డైట్ మిస్టేక్స్ ను తెలియచేసాము.

వీటిని తెలుసుకుని, న్యూ ఇయర్ లో వీటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి.

మిస్టేక్#1 కొన్ని ఆహారపదార్థాలను దూరంగా ఉంచడం:

మిస్టేక్#1 కొన్ని ఆహారపదార్థాలను దూరంగా ఉంచడం:

ఈ మధ్యకాలంలో కొన్ని రకాల డైట్ పద్దతులకనుగుణంగా కొన్ని ఆహారపదార్థాలను పూర్తిగా దూరంగా ఉంచుతున్నారు. అటువంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ తో పాటు పాల ఉత్పత్తులున్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోకపోవడం వలన పోషకాహారలోపం తలెత్తుతుంది. తద్వారా, అనేకరకాలైన ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఇబ్బంది వాటిల్లదు.

మిస్టేక్#2 అసాధారణ లక్ష్యాలు:

మిస్టేక్#2 అసాధారణ లక్ష్యాలు:

చాలా మంది తమ బరువుకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. వేగంగా బరువు తగ్గాలని లేదా పెరగాలని భావించి అనారోగ్యానికి గురవుతారు.

ఉదాహరణకు, పదిహేను రోజుల్లో పది కిలోల బరువు తగ్గేందుకై విపరీతంగా కడుపు మాడ్చుకొని బరువు తగ్గకపోగా అమితమైన నిరాశకు గురవుతారు. కాబట్టి, లక్ష్యాల సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని ఏర్పరచుకోవడం ముఖ్యం. అతి ముఖ్యంగా, బరువుకు సంబంధించిన లక్ష్యాలు సాధ్యపడే విధంగా ఉండాలి.

 మిస్టేక్#3 డైట్ పిల్స్ ను తీసుకోవడం

మిస్టేక్#3 డైట్ పిల్స్ ను తీసుకోవడం

అతి వేగంగా బరువును తగ్గించుకోవటం కోసం డైట్ పిల్స్ పై ఆధారపడడానికి ఆసక్తి చూపిస్తున్నవారి సంఖ్య అధికమైంది. ఇటువంటి పిల్స్ అనేవి ఆరోగ్యానికి హానీకరమన్న విషయం ఎన్నో సార్లు రుజువైనా అతివేగంగా బరువు తగ్గాలన్న దురాశతో వీటిపై ఆధారపడి ఆరోగ్యానికే ముప్పు తెచ్చుకుంటున్నారు. బరువు తగ్గటమనేది సహజంగా జరగాలి. ఈ విషయాన్ని గుర్తించి ఆరోగ్యకరమైన నిర్ణయాన్ని తీసుకోండి.

మిస్టేక్#4 ఫలితాలను గుర్తించండి

మిస్టేక్#4 ఫలితాలను గుర్తించండి

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ సరైన ఆహారాన్ని తీసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అయితే, మీరు అసాధారణ లక్ష్యాలను ఏర్పరచుకోవడం వలన మీరు పొందిన ఫలితాలను మీరు గుర్తించలేకపోతున్నారు. ముందుగా, మీరు సాధించిన ఫలితాలను గుర్తించి మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. లేదంటే, నిరుత్సాహానికి గురై మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశాన్ని జారవిడుచుకుంటారు.

మిస్టేక్#5 ఫుడ్ రూల్స్ ని ఎక్కువగా పాటించడం

మిస్టేక్#5 ఫుడ్ రూల్స్ ని ఎక్కువగా పాటించడం

డైటింగ్ అనేది ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ ని తీసుకోకపోవడం వంటి ఆహార నియమ నిబద్ధతలతో కూడినది. అయినప్పటికీ, ఈ నియమాలను ఎక్కువ ఏర్పరచుకున్నా మీరు కొన్నిసార్లు నియమాలను ఉల్లంఘించే అవకాశం ఉంది. అందువల్ల, సరైన ఫలితాలను పొందలేరు. కాబట్టి, నిదానంగా ప్రారంభించి అవసరమైన మేరకే నియమాలను ఏర్పరచుకుని వాటిని పాటిస్తూ ప్రయోజనం పొందండి.

మిస్టేక్#6 అసహనంగా ఉండటం

మిస్టేక్#6 అసహనంగా ఉండటం

డైటింగ్ వలన కలిగిన ప్రయోజనాలను మీరు గుర్తించాలి. తద్వారా, డైటింగ్ లో అవసరమైన మార్పులు చేసుకుంటూ మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అదే సమయంలో, మీరు ఆశించిన ఫలితాలను పొందేందుకు కాస్తంత సహనం కూడా పాటించాలి. మెటబాలిజం అనేది మెరుగవుతున్నప్పుడు మీకు ఫలితాలు కనిపిస్తాయి. అందాకా వేచి చూడాలి.

మిస్టేక్#7 ఫ్యాట్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలి

మిస్టేక్#7 ఫ్యాట్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలి

కొత్తగా డైటింగ్ కు అలవాటు పడుతున్నవారు ఫ్యాటీ ఫుడ్స్ ను అవాయిడ్ చేయడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చని నమ్ముతారు.

అయితే, కొబ్బరి, నెయ్యి, అవొకాడోలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని మరచిపోవద్దు. వీటిని మితంగా తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మిస్టేక్#8 ఆహారాన్ని స్కిప్ చేయడం

మిస్టేక్#8 ఆహారాన్ని స్కిప్ చేయడం

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోవడంపై శ్రద్ధ వహించరు. బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోకపోతే త్వరగా బరువు తగ్గుతారని నమ్ముతారు. అయితే, ఈ నమ్మకం కేవలం అపోహ మాత్రమే. ఈ విధంగా చేయడం వలన మెటబాలిక్ రేట్ అనేది మందగిస్తుంది. అలాగే పోషకాహార లోపం ఏర్పడుతుంది. అందువలన, ఆహారాన్ని స్కిప్ చేసే అలవాటును దూరం చేసుకోండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Common Diet Mistakes To Avoid

    A new year must be started on a healthy note and positive changes must be made to improve your health. There are many diet tips that people follow in order to lose or gain weight; not all of them are healthy! Here are a few diet mistakes to be avoided this new years.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more