అధిక బరువు తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

ఓబేసిటి లేదా అధిక బరువు లేదా ఊబకాయం, పోషకాహార లోపం వల్లే ప్రపంచంలో చాలా మంది అధిక బరువుకు గురి అవుతున్నారు. అధిక బరువు వల్ల అందం పాడవ్వడం మాత్రమే కాదు, టైప్ 2 డయాబెటిస్ ,జాయింట్ పెయిన్, వ్యాధినిరోధకత తగ్గడం వంటి అనేక సమస్యలు పెరుగుతాయి.

ఈ ఆధునిక జీవన శైలి వల్ల శరీరంలో అనేక మార్పులు,ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువును తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని రెమెడీ ఉన్నాయి.

అధిక బరువు తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

అధిక బరువుతో ఇబ్బంది పడే వారు, రోజూ జిమ్ కు వెళ్ళడం కష్టమైన పనే , అయితే ఆయుర్వేదంతో అధికర బరువును తగ్గించుకోవచ్చు. శరీరానికి శ్రమం కల్పించడం వల్ల అధిక బరువు తగ్గించుకోవచ్చని చాలా మంది అనుకుంటారు. అయితే ఆయర్వేదం ప్రకారం సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా అధిక బరవు తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అందుకే ఆయుర్వేదం బాగా ప్రసిధ్ది చెందినది. ఆయుర్వేదం ప్రకారం కొన్ని మూలికలు, వేర్లు, వంటింటి వస్తువులు రోజూ వాడటం వల్ల జీర్ణక్రియను పెంచి, ఊబకాయం తగ్గిస్తుంది.

అధిక బరువు తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

ఊబకాయం తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ రెమెడీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. ఆమ్లా

1. ఆమ్లా

ఇది అద్భుతమైన పండు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచి, క్యాలరీలను కరిగిస్తుంది. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఉసిరికాయలో వృద్ధాప్యంకు వ్యతిరేకంగా పోరాడే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి చర్మానికి, జుట్టుకు కూడా ఉపయోగపడుతాయి. అందుకు రోజు ఉదయం అల్పాహారం తీసుకోవడానికి ముందు రెండు స్పూన్ల ఆమ్ల రసాన్ని తీసుకోవాలి.

నైట్ షిప్ట్ పనిచేసేవారు ఓబేసిటి తగ్గించుకోవడానికి తినాల్సిన హెల్తీ ఫుడ్స్..!

2. త్రిఫలం:

2. త్రిఫలం:

త్రిఫలం అంటే మూడు పండ్లను కలిపి చూర్ణం లేదా పొడి చేస్తారు. త్రిఫల రసాయనం ప్రసిద్ధి చెందిన ఒక ఆయుర్వేద సంప్రదాయ మెడిసిన్. త్రిఫల ఉసిరి, కరక్కాయ, తానికాయలు అనే మూడు మూలికల మిశ్రమంతో తయారుచేస్తారు.ఈ మూడింటి మిశ్రమంతో తయారుచేసే పదార్థం జీర్ణక్రియను పెంచి శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది ప్రేగు కదలికలను పెంచడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా ప్రత్యుత్పత్త, గుండె మరియు మూత్ర నాళ పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకోసం అరటీస్పూన్ త్రిఫలం తీసుకుని గోరువెచ్చని నీటిలో వేయాలి. బాగా మిక్స్ చేసి, ఉదయం పరగడుపున గోరువెచ్చగా తాగాలి.

3. పసుపు:

3. పసుపు:

పసుపును కుర్కుమిన్ లాంగో అని కూడా పిలుస్తారు. ఇండియన్ మార్కెట్లో ఇది చాలా విరివిగా లభిస్తుంది. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పుసుపులో విటమిన్ బి, సి, పొటాషియం, సోడియం, ఐరన్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లినోలెనిక్ యాసిడ్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ మొదలగునవి ఉన్నాయి. ఇంకా ఇందులో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువ. ఇది బరువు తగ్గడానికి జీవక్రియను మెరుగుపరుస్తుంది. రెండు, మూడు టీస్పూన్ల పసుపును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

4. అల్లం:

4. అల్లం:

అల్లంలో థర్మోజెనిక్ ప్రభావం అధికంగా ఉంది. దీన్ని రోజువారి ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియను పెంచి కొవ్వును వేగంగా కరిగిస్తుంది. బరువు తగ్గించుకోవడానికి అల్లం, నిమ్మరసం గ్రేట్ రెమెడీ. నిమ్మరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. ఇంకా వివిధ రకాల వ్యాధులతో పోరాడేందుకు ఇందులో ఉండే విటమిన్ సి కూడా సహాయం చేస్తుంది. ఒక గ్లాసు నీళ్లు వేడిచేసి అందులో అల్లం ముక్కలు వేసి ఉడికించాలి, తర్వాత దీన్ని వడపోసుకుని, అందులో నిమ్మరసం కలిపి రోజులో రెండు మూడు సార్లు తాగొచ్చు. ఉదయం పరగడపును తాగితే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

మీ నడుము చుట్టుకొలతను బట్టి మీకున్న హెల్త్ రిస్క్ లు ఏంటి ?

5. గోటుకోల(సరస్వతిఆకు)

5. గోటుకోల(సరస్వతిఆకు)

సరస్వతి ఆకు మంచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఈ ఆకును ఆయుర్వేదంలో ఎందుకు ఉపయోగిస్తారు, అందులో ఉండే మహత్యం ఏంటి? ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది రెండు ముఖ్యమైన ట్రియోడోథైరోనిన్ లేదా T3 మరియు థైరాక్సిన్ లేదా T4 థైరాయిడ్ హార్మోనుల ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోనుల్లో థరమోజెనిక్ ప్రభావం కలిగి ఉంటుంది. ఇది జీవక్రియల పనితీరును పెంచుతుంది. ఇది మార్కెట్లో సప్లిమెంట్ రూపంలో కూడా దొరుకుతుంది. బరువు తగ్గించుకోవడానికి రోజుకు మూడు సార్లు 30-60మిల్లీ గ్రాముల స్లిమెంట్ తీసుకోవచ్చు.

English summary

How To Treat Obesity With Ayurveda

Obesity is one of the major causes for other serious health issues. Know about a few ayurvedic remedies to treat obesity,
Please Wait while comments are loading...
Subscribe Newsletter