వేగంగా బరువు తగ్గాలా?అయితే ఈ 12 లోక్యాలరీ ఫుడ్స్ తినాల్సిందే!

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

మరి కొద్ది రోజుల్లో బ్రాండ్ న్యూ ఇయర్ రాబోతుంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది చాలా విషయాల్లో వాగ్థానాలు చేసుకుని ఉంటారు కదా? యవత ఘనంగా సెలబ్రేట్ చేసుకునే అతి పెద్ద పండగ న్యూ ఇయర్, ఈ సందర్బంగా కొంత మంది వాగ్థానాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఉదాహరణకు ఈ కొత్త సంవత్సరంలో కొంత మంది బరువు తగ్గాలని నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త సంవత్సరంలో ఫిట్ గా స్ట్రాంగ్ గా కనబడాలని కోరుకుంటారు!

గడిచిన ఈ సంవత్సరంలో కొంచెం దగ్గరగా చూస్తే చాలా వరకూ ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, జిమ్ లలో చేరడం, డైట్ ప్లాన్ చేసుకోవాలి. బరువు తగ్గడానికి కొన్ని లక్ష్యాలను ఏర్పరుచుకోవడం వంటి విషయాలను మీరు మీ దగ్గరి వాళ్ళల్లో గమనిస్తుంటారు. కొంత మంది అతి తక్కువ నెలల్లోనే చాలా బరువు తగ్గడం చూస్తుంటాం!

మరి ఈ సంత్సరంలో మీరు కూడా న్యాచురల్ గా బరువు తగ్గడానికి తాజాగా లక్ష్యాలను ఏర్పరుచుకుంటున్నారు కదా? అయితే ఒక విషయం ఏంటంటే కొంత మంది ఈ సంవత్సరంలో బరువు తగ్గాలని స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుంటారు, కానీ కొన్ని నెలల తర్వాత మద్యలో వదిలేస్తుంటారు!

weight loss foods

త్వరగా బరువు తగ్గించుకోవడా, ఫిట్ గా మరియు హెల్తీగా మారడం అంత సులభం కాదన్న విషయం మనందరికి తెలిసిన విషయమే..!

ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ మరియు సెలబ్రెటీలు కూడా వారి ఫిట్ నెస్ గోల్స్ ను చేరుకోవడానికి ఎక్కువ సమయం, శ్రద్ద పెట్టడం చేస్తుంటారు. కాబట్టి, బరువు తగ్గాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకొన్నప్పుడు సమయం, శ్రద్ద, ఓపిక అవసరం.

బరువు తగ్గాలని మీరు తీసుకునే నిర్ణయంలో ఎలాంటి మార్పులకు తావివ్వకుండా, రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తుండాలి. బరువు తగ్గించుకునే క్రమంలో డైట్ మరియు వ్యాయామాలకు ఒక్కసారి అలవాటు పడితే న్యాచురల్ గా సులభం అవుతుంది. మంచి ఫలితాలను కూడా చూస్తారు !

ప్రస్తుతం బరువు తగ్గాలంటే డైట్ మరియు వ్యాయామం ఈ రెండింటి వెయిట్ లాస్ కాంబినేషన్ ను తప్పనిసరిగా అనుసరించాల్సిందే.

అయితే కేవలం డైటింగ్ లేదా వ్యాయామం మాత్రమే ఎఫెక్టివ్ గా హెల్తీగా బరువు తగ్గించవు.

ఎవరైతే బరువు తగ్గాలని కోరుకుంటున్నారో, వారు కొన్ని ఆహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, వెయిట్ లాస్ ప్లాన్ లో ఉన్నప్పుడు ఏవి తినాలి, ఏవి తినకూడదో తెలుసుకోవాలి.

బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారిలో మీరు ఒకరైతే ఇక్కడ మీకోసం కొన్ని లో క్యాలరీ ఫుడ్స్ ను పరిచయం చేస్తున్నాం, ఇవి బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. మరి అవేంటో తెలుసుకుందామా మరి..

1. గ్రేప్ ఫ్రూట్

1. గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం అద్భుతం. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్స్ తో పాటు విటమిన్ సి అధికం. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

2. క్యాబేజ్

2. క్యాబేజ్

క్యాబేజ్ లోక్యాలరీ వెజిటేబుల్ మాత్రమే కాదు, లో ఫ్యాట్ కంటెంట్ వెజిటేబుల్ కూడా. ఇందులో పొటాసియం మరియు ఫైబర్లు అధికం. ఈ రెండూ శరీరంలో ఫ్యాట్ సెల్స్ ను తగ్గిస్తుంది. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3. బ్రసల్ స్ప్రాట్స్

3. బ్రసల్ స్ప్రాట్స్

మొలకలను ఏదోఒకవిధంగా తీసుకోవాలి . ఒక సర్వింగ్ మొలకల్లో 4గ్రాముల ప్రోటీలను మన శరీరానికి అందుతాయి. ఇది క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది..మొలకల్లో పొటాసియం, విటమిన్ సి, అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిక్ రేటు పెంచుతాయి. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. వీటి సలాడ్స్ కు జోడించండం వల్ల రెగ్యులర్ బౌల్ మూమెంట్ మెరుగ్గా ఉంటుంది. వేగంగా బరువు తగ్గుతారు.

4. షుగర్ లెస్ టీ

4. షుగర్ లెస్ టీ

పంచదార మరియు పాలు రెండూ లేకుండా ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. క్యాలరీలు త్వరగా తగ్గడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. ఈ టీలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. పంచదార అవాయిడ్ చేయడం మంచిది.

5. పుట్టగొడుగులు

5. పుట్టగొడుగులు

మష్రుమ్స్ , న్యూట్రీషియన్స్ అధికం, వీటిని సూప్స్, సలాడ్స్ లో చేర్చుకోవచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువ, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ. పుట్టగొడుగుల్లో ప్రోటీన్లు మరియు విటమిన్ సి అధికం. ఇది వేగంగా బరువు తగ్గిస్తుంది. మజిల్స్ ను టోన్ చేస్తుంది. .

6. బ్లూ బెర్రీస్

6. బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీ టేస్టీ ఫ్రూట్, వీటిని స్నాక్స్ రూపంలో రోజూ తీసుకోవచ్చు. వీటిలో క్యాలరీలు చాలా తక్కువ. యాంటీఆక్సిడెంట్స్ త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

7. కాలీఫ్లవర్

7. కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ లేదా గోబి ఇది ఫుల్ న్యూట్రీషియన్ వెజిటేబుల్ , ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఇవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. కాలీఫ్లవర్ లో ఉండే ఫైబర్, మరియు విటమిన్ సిలు వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

8. సెలరీ

8. సెలరీ

ఒక కప్పు సెలరీని రోజువారి డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంలో మార్పు గమనిస్తారు, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో ఉండే మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్ మెటబాలిక్ రేటును పెంచి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎనర్జీ లెవల్స్ ను వేగంగా పెంచుతుంది.

9. టమోటోలు

9. టమోటోలు

టమోటోలు జ్యూసిగా ఉంటాయి. రోజులో ఎప్పుడైనా తినవచ్చు. టమోటోలలో చాల తక్కువ క్యాలరీలుంటాయి,. ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువే. టమోటోలలో ఉండే లైకోపిన్, విటమిన్ సిలు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

10. జుచ్చినే

10. జుచ్చినే

జుచ్చిని ఇది ఒక రకమైన ఫ్రూట్ మీ రెగ్యులర్ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల మెటబాలిక్ రేటు పెరుగుతుంది. ప్రేగు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

11. క్యారెట్

11. క్యారెట్

పచ్చి మరియు ఉడికించిన క్యారెట్ బరువు తగ్గడానికి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. క్యారెట్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది పొట్టను నింపుతుంది. దాంతో హైక్యాలరీ ఫుడ్ తక్కువగా తింటారు. ఇతర వెజిటేబుల్స్ తో పోల్చితే క్యారెట్లో క్యాలరీలు తక్కువ. కాబట్టి, శరీరంలో టాక్సిన్స్ ను ఫ్లస్ అవుట్ చేసి బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

12. ఆకుకూరలు

12. ఆకుకూరలు

ఆకుకూరల్లో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కండరాలను స్ట్రాంగ్ గా మార్చుతాయి, బరువును ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి, మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గించడాన్ని వేగవంతం చేస్తుంది.

English summary

Low-calorie Foods For Quick Weight Loss

Weight loss is not an easy process and it requires a lot of time and effort. However, there are some foods that can help speed up the weight loss process. Check out this list of low-calorie foods that can also aid in a quick weight loss process.