తెలిసిపోయింది! ఇదిగో ఈవిధంగా 2కె 17 మిస్ వరల్డ్ మానుషి చిల్లార్ తన అందాన్ని,ఆకృతిని సులభంగా కాపాడుకుంటుంది!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మానుషి ఛిల్లార్ 17 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత మిస్ వరల్డ్ కిరీటం అందుకొని మనందరినీ గర్వంతో ఉప్పొంగేలా చేసింది! మన దేశస్థులందరికీ ఇది ఒళ్ళు గగుర్పొడిచే ఆనందకర క్షణం, పైగా ఆమె ఎంత అందంగా ఉంది కదా!

ఆమె అవయవ సౌష్టవాన్ని ప్రతి అమ్మాయి ఇప్పటికప్పుడు కోరుకుంటున్నారు! చింతించకండి అమ్మాయిల్లారా, మీకు మేము ఉన్నాం!

Manushi Chhillar's Diet & Fitness Plan

ఇక్కడ ఈ అందమైన యువతి యొక్క డైట్ రహస్యాలను పొందుపరిచాం మరియు దీన్ని ఫాలో అయితే చాలు మీరు కూడా అలాంటి అంగసౌష్టవాన్ని పొందుతారు.

నిజం, మేము కూడా అసూయతో రగిలిపోతున్నాం కానీ ఇదేం పెద్ద కష్టమైన పనేం కాదు.

ఇదిగో ఇక్కడ మీకు సులభంగా ఉండే నమూనా మెనూ ఇచ్చాం చూడండి!

Manushi Chhillar's Diet & Fitness Plan

పొద్దున ; మీరు రెండు-మూడు గ్లాసుల నీరు (గోరువెచ్చని, నిమ్మరసం మీ ఇష్టం).

అల్పాహారం ; అల్పాహారానికి మీరు ఓట్ మీల్ లేదా గోదుమ ఫ్లేక్స్ తో పాటు పెరుగు మరియు తాజా పండ్లు మరియు విత్తనాలు లేదా రెండు లేదా మూడు గుడ్ల తెల్లసొనతో అవకాడో, క్యారట్లు, బీట్ రూట్లు మరియు చిలకడదుంపలు.

మధ్యాహ్నానికి ముందు ; కొబ్బరిబోండాం నీళ్ళు, తర్వాత పండ్లు

భోజనం ; మధ్యాహ్నం మీరు కినోవా/అన్నం/చపాతీతో ఒక కప్పుడు కూరలు మరియు ముక్కలు చేసిన చికెన్ / పప్పు ధాన్యాలు

సాయంత్రం ; ఉప్పులేని నట్’స్ తర్వాత అరటిపండు, ఫిగ్ లేదా తక్కువ క్యాలరీలున్న ఫ్రూట్ స్మూతీ.

రాత్రి భోజనం ;చికెన్/చేప (గ్రిల్డ్ /వేయించినది) మరియు పోపు పెట్టిన కూరలు- బ్రొకోలీ/క్యారట్లు/చిక్కుడు/మష్రూమ్స్/బీటురూటు మొదలైనవి.

Manushi Chhillar's Diet & Fitness Plan

మానుషి ఛిల్లార్

బయట ప్రయాణిస్తున్నప్పుడు, మీరు ఆరోగ్యకరంగా అన్నీ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు గ్రిల్డ్ చికెన్ లేదా చేప, క్రీమ్ ఎక్కువున్న సాస్ లేకుండా ఆర్డర్ ఇవ్వాలి. ప్రధాన భోజనానికి బదులు మీరు ఎపెటైజర్ ను ఎంచుకోవచ్చు.

ఎప్పుడూ మీ భోజనంలో సలాడ్ ను ఆర్డర్ ఇవ్వండి, కానీ తక్కువ ఫ్యాట్ డ్రస్సింగ్ ఉన్న వాటిని మాత్రమే.

Manushi Chhillar's Diet & Fitness Plan

మేము ఆమె వ్యాయామ దినచర్య కూడా అందించాం, చూడండి.

యోగాను క్రమం తప్పకుండా అభ్యాసం చేయండి ; యోగా సరైన శరీర ఆకృతిని నిలబెట్టుకోడానికి మరియు కండరాలను మంచి ఆకారంలో ఉంచడానికి సాయం చేస్తుంది. ఫ్లెక్సిబిలిటీను , పొట్ట ప్రాంతంలో బలాన్ని పెంచుతుంది.

మెలికల వ్యాయామం ; పొట్టను మెలిపెట్టి చేసే వ్యాయామం మీ మొత్తం శరీరాన్ని సాగేటట్లు, బలంగా మార్చి, విషపదార్థాలను తొలగించేట్లు చేస్తుంది.

స్క్వాట్లు ; ఇవి కేవలం కాళ్ళకి మాత్రమే కాదు, మొత్తం శరీరానికి చాలారకాలుగా లాభం చేకూరుస్తుంది. తొడలను, కింది కండరాలను టోన్ చేసి బలంగా నిలబెడుతుంది. మొత్తం శరీరం, కండరాలను బలపరుస్తుంది.

English summary

Manushi Chhillar's Diet & Fitness Plan

Manushi Chhillar's svelte figure is what every girl will be dying to achieve right now! Don't worry, folks, we have got you covered! Here, we have decoded the diet secrets of this young beauty and following this is all that you need to do to get that enviable figure!
Subscribe Newsletter