బరువు తగ్గించే సింపుల్ పొటాటో డైట్

By: Mallikarjuna
Subscribe to Boldsky

పైన టైటిల్ చదవగానే ఒకటికి రెండు సార్లు పరీక్షించుకుంటారు?ఎందుకంటే బంగాళదుంప, బరువు తగ్గిస్తుందా? ఈ రెండు పదాలు సరిపోల్చబడవు.

క్యాలరీలు ఎక్కువున్న బంగాళదుంప తినడం వల్ల బరువు పెరుగుతామని చాలామంది అపోహా పడుతారు. సహజంగా వంటల్లో బంగాళదుంపలు ఎక్కువగా వాడటం వల్ల బరువు పెరుగుతామని చాలా ఏళ్ళ నుండి నమ్ముతున్నారు. అలాంటప్పుడు, అకస్మాత్ గా బంగాళదుంపతో బరువు తగ్గుతారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

బరువు తగ్గించే సింపుల్ పొటాటో డైట్

సహజంగా, ఇతర అనేక పోషకాల వాస్తవాల్లాగే, ఈ పొటాటోలోని పోషకాలు కూడా కొంచెం గందరగోళం కలిగిస్తుంది.

బంగాళదుంప బరువు తగ్గిస్తుందనగానే..పొటాటో ఫ్రైలు, చిప్స్ తింటే బరువు తగ్గరు.

ప్రెష్ పొటాటో జ్యూస్ లోని టాప్ 10 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

ఖచ్చితంగా వీటి వల్ల బరువు పెరుగుతారు, ఎందుకంటే వీటిని నూనెల్లో వేయించడం వల్ల శరీరానికి అదనపు క్యాలరీలు చేరుతాయి. దాంతో ఆరోగ్యానికి హాని చేస్తాయి.

బరువు తగ్గించే సింపుల్ పొటాటో డైట్

అందువల్ల, బరువు తగ్గించుకోవాలంటే, బంగాళదుంపలను ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవాలి.

శరీరంలో అధిక కొవ్వు చేరడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు, కీళ్ళనొప్పులు మొదలుగు వ్యాధులకు కారణమవుతుందని మనలో చాలా మంది నమ్ముతారు.

బరువు తగ్గించే సింపుల్ పొటాటో డైట్

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, హార్మోనుల సమతుల్యతలు, వారసత్వం కారణంగా శరీరంలోఅధిక కొవ్వు పెరుగుతుంది. దాంతో బరువు పెరుగుతారు.

గర్భిణీలు బంగాళదుంపలు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

బరువు పెరగడానికి ఇటువంటి కారణాలు గుర్తించినట్లైతే జీవనశైలిలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి. అప్పుడే బరువు కంట్రోల్లో ఉంటుంది.

శరీరంలో అధిక కొవ్వు చేరడం వల్ల గుండె జబ్బులు, వంధ్యత్వం మరియు క్యాన్సర్ ప్రమాదాలున్నాయి.

మీరు ఇంట్లోనే సహజపద్దతిలో బరువు తగ్గించుకోవాలనుకుంటే, బంగాళదుంప రెమెడీ గురించి తెలుసుకోండి..

బరువు తగ్గించే సింపుల్ పొటాటో డైట్

కావల్సినవి:

ఉడికించిన బంగాళదుంపలు -2

పెరుగు 1కప్పు

ఉప్పు రుచికి సరిపడ

ఈ న్యాచురల్ రెమెడీని రోజూ తీసుకున్నట్లైతే ప్రభావవంతంగా పనిచేసి, వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఈ రెమెడీతో పాటు రోజూ తప్పకుండా 45 నిముషాలు వ్యాయమం చేస్తూ, కొవ్వుపదార్థాలను, నూనె పదార్థాలను తినడం తగ్గించాలి.

సరైన ఆహారనియమాలు, వ్యాయామం లేకుండా ఈ రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేయదు.

పొటాటో స్కిన్ తో తెల్లజుట్టుని నల్లగా మార్చే అమేజింగ్ సొల్యూషన్..!

బంగాళదుంపలో విటమిన్ సి , పొటాషియంలు ఎక్కువగా ఉండటం వల్ల, ఈ రెండూ జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. దాంతో కొవ్వు వేగంగా కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పెరుగులో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉన్నాయి. ప్రోటీన్లు కొవ్వుతో పోరాడి, ఆరోగ్యకరమైన కండరాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

బంగాళదుంప, పెరుగులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

బరువు తగ్గించే సింపుల్ పొటాటో డైట్

తయారీ:

బంగాళదుంపను మెత్తగా ఉడికించి, మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. తర్వాత అందులో పెరుగు కలపాలి.

కొద్దిగా ఉప్పుకూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.

బంగాళదుంప, పెరుగు మిశ్రమాన్ని రోజూ రాత్రి భోజనంలో, 2 నెలలు పాటు తీసుకుంటే ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు.

ఈ బంగాళదుంప మిశ్రమాన్ని తిన్న తర్వాత, వేరే ఏ ఆహారాలు తీసుకోకూడదు. ఈ విషయంలో డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది.

English summary

Simple Potato Diet To Lose Weight Quickly! in Telugu

If you want to lose weight the natural way, check out this potato diet!
Subscribe Newsletter