TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
బాడీలో వాటర్ తగ్గించి, స్లిమ్ గా కనబడాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి
చాలామంది బరువు తగ్గేందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. వివిధ ఆహారాలు నియమాలు, వ్యాయామాలు పాటించినా కొన్ని సందర్భాల్లో ఎలాంటి ఫలితం కూడా కనిపించదు. దీంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే మీరు చాలా సులభంగా బరువు తగ్గొచ్చు.
ముఖ్యంగా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంటే చాలు తమకేది వద్దనుకునే జనం చాలానే ఉన్నారు. బరువు పెరిగేందుకు చాలా కారణాలుంటాయి. మధుమేహం, ఊబకాయం, కొరోనరీ డిజార్డర్స్, జాయింట్ పెయిన్, కొలెస్టరాల్ మొదలైనవి వంటివి మీరు బరువు పెరిగేందుకు కారణం కావొచ్చు.
అయితే ముందుగా అసలు శరీరంలో అధిక బరువుకు కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఒకవేళ మీరు వాటర్ వెయిట్ తో బాధపడుతుంటే మీరు ఈ సూత్రాలు పాటిస్తే ఈజీగా బరువు తగ్చొచ్చు. వీటిని రెగ్యులర్‌గా చేస్తే బరువు తగ్గడంలో తేడాను మీరే గమనించవచ్చు.
వాటర్ వెయిట్ అంటే ఏమిటి ?
మన శరీరంలో మోతాదుకంటే ఎక్కువ ప్లూయిడ్స్ ఉండడాన్నే వాటర్ వెయిట్ అంటారు. దీనివల్ల మీరు లావుగా ఉన్నట్లు అనిపిస్తారు. అలాగే మీరు వేసు బట్టలు బాగా బిగుతుగా అయినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా మీ చేతి వేళ్లకు ఉండే ఉంగరాలు కూడా బాగా టైట్ అయినట్లు అనిపిస్తుంది. దీనికంతటికీ వాటర్ వెయిట్ కారణం అని చెప్పొచ్చు.
సోడియం తీసుకునే విషయంలో జాగ్రత్త ఉండండి
మీరు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం కూడా చేస్తున్నా బరువు మాత్రం తగ్గడం లేదా? అయితే మీరు తీసుకునే ఆహారంలో సోడియం ఎంత మోతాదులో ఉండో చెక్ చేసుకోండి. వీలైనంత వరకు ఉప్పు ఎక్కువ మోతాదులో ఉండే ఫుడ్స్ కు దూరంగా ఉండండి. ఉప్పు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం.
కార్బ్-రిచ్ ఫుడ్స్ ( కార్బోహైడ్రేట్లు )
కార్బోహైడ్రేట్లు అనేవి ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే అవి తగినన్ని ఉండే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా ఉండే వైట్ బ్రెడ్, పాస్తా, పిజ్జా మొదలైన వాటిలో అన్ హెల్తీ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని దాదాపుగా తక్కువగా తీసుకోవాలి.
అతి సులభంగా, తేలికగా బరవు తగ్గించే 10టిప్స్ & ట్రిక్స్
వ్యాయామం ఎక్కువగా చేయడం
బరువు తగ్గడానికి వ్యాయామం చాలా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే క్రాస్ ఫిట్ లేదా వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు చేయడం ఉత్తమం. ఈ వ్యాయమాలు కండరాల్లోని నీరు నిల్వ ఉండకుండా చేస్తాయి. అందువల్ల వీలైనంత వరకు ఈ వ్యాయామాలు చేయండి.
తాగునీరు
శరీరంలో అదనపు బరువును తగ్గించుకోవడానికి వాటర్ బాగా పనిచేస్తుంది. రోజుకు 3 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తాగేవారిలో శరీరం మెటబాలిజం రేటును పెంచుకోవవాడానికి సహాయపడుతుంది. వ్యాయామం చేసి, చెమటోడ్చి క్యాలరీలను తగ్గించుకోవడం కంటే ఇలా సింపుల్‌గా వాటర్‌డైట్‌ను ఫాలో అయితే కొన్ని పౌండ్ల క్యాలరీలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. మీ శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలన్ని తొలగిపోయి మీరు ఆరోగ్యంగా మారుతారు. బరువు తగ్గుతారు.
పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలు
పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినడం అనేది శరీరంలోని నీటి నిల్వలను తగ్గించడానికి మరొక సులభమైన మార్గం. అరటి, ఆకుకూరల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ పదార్ధాలు శరీరంలోని ఉండే అధిక వాటర్ ను తగ్గించగలవు.
డీటాక్స్ డైట్
వారంలో కనీసం ఒక రోజు అయినా డిటాక్స్ డైట్ చేయడం. అలాగే హెల్తీ జ్యూస్, గ్రీన్ టీ తీసుకుంటూ సాయిల్డ్ ఫుడ్స్ తక్కువ తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు నీటి నిల్వలను బయటకు పంపొచ్చు. ఈ పద్ధతి వల్ల మీ శరీరంలో ఉండే విషయ విష, వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్తాయి. సహయపడుతుంది.
మసాజ్
మీరు వాటర్ వెయిట్ తో ఎక్కువగా బాధపడుతుంటే రెగ్యులర్ మసాజ్ మీకు ఎంతో సహాయం చేస్తుంది. ఇది మీ శరీరంలోని అదనపు ద్రవాలను బయటకు పంపేందుకు తోడ్పడుతుంది. అలాగే మసాజ్ మీలో ఒత్తిడిని తగ్గిస్తుంది. వీలైనంత వరకు మసాజ్ చేయించుకుంటూ ఉండండి.
హార్మోన్ల ఫ్లక్ట్యుయేషన్
హార్మోన్లలోని హెచ్చుతగ్గులు కూడా వాటర్ వెయిట్ కు కారణం కావొచ్చు. అందువల్ల మీరు ఏ హార్మోన్ల లోపంతో బాధపడుతున్నారో తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మహిళలు పీరియడ్స్ సమయంలో, గర్భధారణ సమయంలో వాటర్ వెయిట్ కు గురవుతారు.
డైట్ ను బ్యాలెన్స్ గా తీసుకోవాలి
సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల కూడా వాటర్ వెయిట్ తగ్గొచ్చు. సాధారణంగా ప్రతి వ్యక్తిలో వాటర్ వెయిట్ అనేది చాలా తక్కువ టైమ్ ఉంటుంది. దీని గురించి మీర ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన జాగ్ర్తత్తలు పాటిస్తే మీరూ వెంటనే వాటర్ వెయిట్ నుంచి బయటపడొచ్చు.