For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈస్టర్ సండే నాడు తీసుకోవలసిన 10 ఆరోగ్యకరమైన జాగ్రత్తలు

  |

  ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే నుండి తరువాతి సోమవారం వరకు గల రోజులను ఈస్టర్ డేస్ గా గుర్తిస్తారు.ఈ ఈస్టర్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఎంతో భక్తి తో సెలెబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈస్టర్ సండే రోజున ఏసుక్రీస్తు తిరిగి తన పార్ధివదేహం నుండి లేచిన రోజుగా సెలెబ్రేట్ చేసుకుంటారు. కావున ఈరోజు పాటించవలసిన ఆరోగ్యకరమైన పద్దతులగురించిన సమాచారం గురించి ఈవ్యాసంలో తెలుపబడింది. కావున ఈ వ్యాసం ఖచ్చితంగా ఈస్టర్ సెలెబ్రేట్ చేసుకునే ప్రతిఒక్కరికీ నచ్చుతుందని ఖచ్చితంగా చెప్పగలము.

  ఖరీదైన కాదనలేని చాక్లెట్స్,కేకులతో ఆరోజంతా పండుగ వాతావరణం ఎంతో ఆహ్లాదకరముగా ఉంటుంది అనడం కాదనలేని సత్యం. ఆఖరికి ఆహారప్రణాళికలు పాటించేవారు సైతం ఈరోజు ప్రత్యేకించి ఈఆహారాలను కాదనకుండా స్వీకరిస్తారు అంటే, ఈస్టర్ వీరి జీవితంలో ఎంతగొప్ప ప్రాధాన్యత సంతరించుకుందో వేరే చెప్పనవసరంలేదు.

  Telugu health tips

  ఈస్టర్ సండే రోజున ఖచ్చితంగా తీసుకొను ఆహారపదార్ధం ఈస్టర్ ఎగ్. అసలు ఈస్టర్ ఎగ్ అంటే ఏమిటి?

  ఈ ఈస్టర్ ఎగ్స్ కు ఉన్న మరో పేరు పాస్కల్ ఎగ్, ఇది గుడ్డు ఆకారంలో అందంగా అలంకరించబడి చాక్లెట్స్ తో నింపబడి ఉంటుంది. దీనిని ఒక కృత్రిమ గుడ్డుగా భావించవచ్చు. ఈ ఈస్టర్ ఎగ్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, తమ ప్రియమైన వారికి బహుమతులుగా ఇచ్చుటకు ఎక్కువ ఇష్టం కనబరుస్తూ ఉంటారు.

  ఈస్టర్ గుడ్డు చేయడానికి 3సెకన్ల మించిన సమయం కూడా పట్టదు, ఇది చాక్లెట్ తో నింపి ఉండి 200గ్రాములు కనీస బరువు ఉండేలా చేస్తారు. ఇది ఎంత రుచికరంగా ఉంటుందో అదేవిధంగా కాలరీలను కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. కావున ఆరోగ్యకరమైన ఆహారప్రణాళికలు పాటించేవారు ఈవిషయoలో కాస్త జాగరూతులై వ్యవహరించడం మంచిది. ఈస్టర్ ఎగ్ కాదనలేని దైవపదార్ధం, కావున ఆరోగ్యానికి ఎటువంటి సమస్య తలెత్తకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎటువంటి చింతలేకుండా ఈస్టర్ ఎగ్ ను తీసుకోవచ్చును.

  1. అదుపులో ఉండడం నేర్చుకోండి:

  మీరు ఒక మంచి ఆహారప్రణాళికను ఫాలో అవుతూ ఉండి, ఈస్టర్ రోజున నోటిని అదుపులో ఉంచలేక ఎక్కువ ఈస్టర్ ఎగ్స్ తీసుకోవడం వలన కాలరీల సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది. కావున, తక్కువ మోతాదుతో వీలైతే కొంచం లెక్కన ఎక్కువ సార్లు గంటల వ్యవధిని ఇస్తూ తీసుకోవడం మంచిది. ఇది ఒక మామూలు ట్రిక్ అయినా కూడా అత్యద్భుతంగా పని చేస్తుంది.

  2. నాణ్యతాపరమైన నియంత్రణ (quality control)

  చాకొలెట్స్ తీసుకోవడంలో ఏవిపడితే అవి తీసుకోకుండా ఇంట్లో తయారుచేసినవి లేక ఉత్తమ కంపెనీ నుండి తయారు కాబడిన వాటినే ఎంపిక చేసుకుని తీసుకోవడం మంచిది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ తీసుకోవడం ముఖ్యం, ఈ డార్క్ చాక్లెట్స్ లో ఎక్కువ మోతాదులో కోకోవా ఉంటుంది. ఈ కోకోవాలో అధిక మోతాదులో జింక్,కాపర్,పొటాషియం, బీటాకెరోటిన్ మరియు అత్యధికమోతాదులో అమినో ఆమ్లాల నిష్పత్తి ఉంటుంది. తద్వారా రక్తపోటు సంబంధిత సమస్యలు లేకుండా చూస్తుంది. కావున కోకోవా ఎక్కువ ఉండే డార్క్ చాక్లెట్స్ తీసుకోవడం మేలు.

  3. ఆరోగ్యకరమైన స్నాక్స్ అలవాటు ఉందా:

  కొందరికి 3,4గంటలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్నాక్స్ లేదా చిరుతిండిగా తీసుకునే అలవాటు ఉంటుంది. ఒకరకంగా ఇది మంచి అలవాటే. తద్వారా శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన నిష్పత్తిలో ప్రోటీన్లు, మినరల్స్ అంది శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. తద్వారా రక్తంలో చక్కెరనిల్వలను చక్కగా నియంత్రించవచ్చు. చాక్లెట్స్ లో అధికంగా చక్కెరనిల్వలు, కాలరీలు, కార్భోహైడ్రేట్స్ ఉండడం మూలాన సమయానుసారంగా తక్కువ మోతాదులో తీసుకునే అలవాటు ఉండడం వలన సమస్యలు లేకుండా చూడవచ్చు.

  4. హైడ్రేట్ గా ఉండండి

  నీటిని తరచుగా తీసుకోవడం మూలంగా అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నీటిని నేరుగానే కాకుండా పండ్లరసాల రూపం లో కూడా తీసుకొనవచ్చు. తద్వారా శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుకొనవచ్చును. డీహైడ్రేట్ కు గురవుతున్న శరీరానికి పడని ఆహార పదార్ధాలు ఆరోగ్యానికే చేటు తెస్తాయి. ముఖ్యంగా ఆహారానికి ముందు నీటిని తీసుకునే అలవాటు ఉన్నవారు, ఆహారంలో 75 శాతం కేలరీలను సులువుగా కోల్పోతున్నారు అని తేలింది. కావున ఆహారానికి ముందు నీటిని తీసుకోవడం ఉత్తమం.

  5. మిమ్మల్ని మీరు వంచించుకోకండి

  ఈస్టర్ ఎగ్, బన్ తీసుకోవడం పండుగ పూట మంచిదే కానీ, ఒక క్రమబద్దమైన ఆహార ప్రణాళికను ఫాలో అవుతున్న ఎడల ఈస్టర్ ఎగ్, బన్ తీసుకును విధానంలో కూడా ఆ ప్రణాళికకు ఎటువంటి మార్పులు లేకుండా చూడగలగాలి. అన్నిరోజులూ పాటిస్తున్నాం కదా , ఈ ఒక్క రోజు ఏముందిలే అని భావిస్తే అది మీ ఆరోగ్య ఆహార ప్రణాళికను తప్పుదోవ పట్టించినట్లే అవుతుంది. అలా మిమ్ములను మీరు వంచించుకోవద్దు. మితంగా 3, 4 సార్లు తీసుకునేలా ప్రణాళికను ఏర్పరచుకోండి.

  6. ఉత్సాహంగా ఉoడుటకు పయత్నిచండి

  రోజు వారీ వ్యాయామాలు చేయడం మూలంగా మీరోజు వారీ విధానంలో స్తబ్ధత లేకుండా ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది. అలాగని ఒక్క రోజు విరామం ఇవ్వడం వంటివి పెట్టుకోవద్దు. వ్యాయామానికి కనీసం అరగంటైనా కేటాయించడం ఉత్తమం.

  7. అదనపు చాక్లెట్ ను పారవేయండి పర్లేదు

  దీని అర్ధం ఆహారాన్ని వృధా చేయమని కాదు, అలాగని ఎక్కువ చాక్లెట్ తీసుకున్న ఎడల మీ శరీరం పై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈస్టర్ డే నాడు చాక్లెట్స్ , కేక్స్ తో ఇల్లు నిండి పోవడం సహజం. అలాగని వాటన్నిటితో కడుపు నింపేయ్యాలి అనుకుంటే ఎలా. వీలైతే ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం, పంచి పెట్టడం లేదా , పారవేయడం కూడా చేయవచ్చు.

  8. ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి :

  చాక్లెట్స్ తీసుకోవడం మంచిదే అలాగని ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి, కావున తక్కువ మోతాదులో అయినా స్నాక్స్ రూపo లో వాటితో కలిపి తీస్కోవడం మేలు. ఇలాంటి స్నాక్స్ లో అరటి పండు స్మూతీ, బెర్రీస్ , పెరుగు , ఆక్రూట్స్, బాదం , వెన్న, ఇంట్లో తయారుచేసిన శాండివిచ్ లలో కలిపి తీసుకొనవచ్చు.

  9. ఖాళీ కడుపుతో ఈస్టర్ ఎగ్ డేంజర్:

  ఎక్కువ కాలరీలు , కార్బో హైడ్రేట్స్ కలిగిన ఈస్టర్ ఎగ్ ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియలపై ప్రభావం పడి , కొవ్వు పెరగడానికి కారణం అవుతుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ కడుపుతో చాక్లెట్స్ తీసుకోవడం మంచిది కాదు.

  English summary

  10 Healthy Habits For Easter Sunday

  Easter egg is mostly popularly eaten on a Easter Sunday. During this time, it becomes quite difficult to avoid the obligatory chocolate binge, hot cross buns and every sweet treat that you come across. You can try out these healthy habits for Easter Sunday like quality control, portion control, snacking regularly, hydration, etc.
  Story first published: Saturday, March 31, 2018, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more