For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టలోని కొవ్వును ఎఫెక్టివ్ గా కరిగించే బనానా డ్రింక్

By Lekhaka
|

రెండు నెలల్లో ఉన్న మీ స్నేహితురాలి పెళ్ళికి మీ అందమైన నాభి కన్పించేలా లెహెంగా వేసుకోవాలనుకుంటున్నారా?

కానీ షాపింగ్ కి వెళ్ళి కొత్త బట్టలు ప్రయత్నించినప్పుడు కానీ తెలీదు, మీ పొట్ట కొంచెం ముందుకు పొడుచుకు వచ్చిందని !

మనలో చాలామందికి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఉంటాయి, కదూ? పొట్టలో కొవ్వు చేరటం చాలా సాధారణం మరియు దాన్ని వదిలించుకోవడం కూడా అంతే కష్టం !


ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పొట్ట రావడం పురుషుల కన్నా స్త్రీలలో అధికం. ఎందుకంటే హార్మోనల్ సమస్య వల్ల తొందరగా దీనికి ఆడవాళ్ళు గురైనా, పురుషులకు కూడా పొట్ట వస్తుంది.

ఇందాక అనుకున్నట్టు, అధికపొట్ట వలన ఆ వ్యక్తి అందవికారంగా కన్పిస్తాడు. అంతేకాక అనారోగ్యానికి కారణం కూడా.

బొడ్డు చుట్టూ అధికకొవ్వు పేరుకుంటే, దాని వల్ల స్థూలకాయం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, నడుంనొప్పి, మోకాలి నెప్పి, హృద్రోగాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.


ఆరోగ్యమైన కొవ్వు కొంతవరకు మంచిదే కానీ, ఎక్కువైతేనే మీది బానపొట్టలా కన్పించి, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.

కొవ్వును కరిగించుకోవాల్సిన ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోడానికి ఇక్కడ చదవండి.

చెడ్డ ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యత, గర్భం, ప్రసవం, అధికంగా తాగటం వంటి కారణాల వలన పొట్టలో కొవ్వు పెరుగుతుంది.

చాలామంది లిపోసక్షన్ మరియు ఇతర కాస్మెటిక్ సర్జరీలను ఆశ్రయిస్తారు కానీ అవి అధిక ఖర్చు, దుష్ప్రభావాలతో కూడి ఉంటాయి.

అధికపొట్టను సహజంగా తగ్గించే అరటిపండు పానీయం ఇదిగో.


కావాల్సిన వస్తువులు ;

మధ్యతరహా అరటిపండు -1

అవిసె గింజలు- ఒక చెంచాడు

అల్లం పౌడర్- 2 చెంచాలు

తక్కువ ఫ్యాట్ పెరుగు- సగం కప్పు

ఈ ఇంటిపానీయం అధికపొట్టను కరిగించి చాలామందికి అద్భుతంలా పనిచేసింది. క్రమం తప్పకుండా, సరిగ్గా వాడితే ఫలితం ఉంటుంది.

ఈ చిట్కాను పాటిస్తూ, సరియైన ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ, 45నిమిషాలు ప్రతిరోజూ వ్యాయామాలు కూడా చేయాలి.

పొట్టకి సంబంధించిన వ్యాయామాలు చేయటం మంచిది.

అరటిపండు, అవిసెగింజలు, అల్లంల మిశ్రమం అనేక పోషకాలను ఒకేసారి అందించి లోపలినుంచే అధిక కొవ్వుతో పోరాడే శక్తినిస్తుంది.

పెరుగులోని ప్రొటీన్, అవిసె గింజలు మీ పొట్టలోపల పేరుకున్న కొవ్వు కణాలను కరిగిస్తుంది.

అరటిపండులోని పొటాషియం మీ కణశ్వాసక్రియను పెంచి, కడుపులో కొవ్వును కరిగించేందుకు సాయపడుతుంది. అల్లం కూడా మీ శ్వాసక్రియ రేటును పెంచుతుంది.


తయారీ విధానం ;

• అన్ని దినుసులను సూచించిన విధంగా మిక్సర్ లో వేయండి.

• రసం వచ్చేవరకు తిప్పండి.

• ఈ పానీయాన్ని ప్రతిరోజూ పొద్దున్నే ఉపాహారం ముందుగా, వ్యాయమం అయిన వెంటనే తీసుకోండి.

• కావాలంటే వైద్యునితో సంప్రదించి బ్రేక్ ఫాస్ట్ బదులు ఇదే తాగండి.

English summary

Banana Remedy For Belly Fat

Banana Remedy For Belly Fat,Here is an amazing way to lose your tummy fat, with a simple banana drink.
Story first published: Thursday, January 25, 2018, 12:00 [IST]