For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి కష్టంగా అనిపించి & మన జీవక్రియను తగ్గించే 10 ఆహారపదార్ధాలు!

By Gandiva Prasad Naraparaju
|

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నించే వారిలో ఒకరైతే, దాని గురించి మీరు కొంత పరిశోధన చేసే ఉంటారు, అవునా?

మీరు ఎంత వేగంగా, ఎంత బరువు తగ్గారు అనేదానిపై ఆధారపడి మీ జీవక్రియ రేటు తగ్గుతుందని మీరు ఖచ్చితంగా వినే ఉంటారు లేదా చదివే ఉంటారు.

prevent weight loss

అయితే, ఈమధ్య చాలామంది అజ్ఞానులు "జీవక్రియ" గురించి తెలుసుకుంటున్నారు, మేము బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన, ప్రభావవంతమైన మార్గాల గురించి అవగాహనా పొందడానికి మేము మరింత కృషి చేస్తున్నాము.

ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్

జీవక్రియ ను తగ్గించే ఆహార పదార్ధాలు

కొన్ని సంవత్సరాల క్రితం కావొచ్చు, కఠినమైన ఆహరం అనేది ఒక వ్యామోహం, త్వరగా బరువు తగ్గే క్రమంలో ఆకలితో మాడిపోవడం లాంటిది.

ఈ రకమైన ఆహరం జోలికి వెళ్ళేవారు, ఆహరం అరుదుగా తీసుకోవాలి, వారికి వ్యాయామం చేసే శక్తి కూడా ఉండదు, కాబట్టి అనారోగ్యకరమైన బరువుతో పాటు కండరాల మాస్ ను కూడా కోల్పోతారు!

పౌష్టికాహారం లోపం, తక్కువ రోగనిరోధక శక్తి, తక్కువ జీవక్రియ వంటి అనారోగ్య ప్రభావిత ఆహారాన్ని అనేకమంది అనుసరిస్తున్నారు.

కాబట్టి, ఆరోగ్యకర ఆహరం లేదా వ్యాయామాలు చేయకుండా ఆకలితో ఉంటె, మీ సిస్టం దెబ్బతిని, దీర్ఘకాలంలో దాని ప్రభావానికి లోనవుతారు.

ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోకపోయినా, వ్యాయామం చేయకపోయినా త్వరగా కొన్ని కిలోల బరువు తగ్గడానికి సహాయపడవచ్చు; అయితే, ఆ ప్రభావం కొద్దిసేపు మాత్రమె ఉండి, ఇది మీ జీవక్రియను నిదానంగా తగ్గిస్తుంది కూడా.

మీ జీవక్రియ తగ్గిపోతే, గణనీయమైన స్థాయిలో కొవ్వును కరిగించడానికి మీ శరీరం సామర్ధ్యాన్ని కోల్పోతుంది, ఆతరువాత మీరు ఎంత ప్రయత్నించినా, మీరు బరువు తగ్గడం సాధ్యపడదు!

ఆరోగ్యకరంగా బరువు తగ్గే అంశాలలో ప్రధానమైనవి ఆరోగ్యకరమైన, తక్కువ క్యాలరీలు కల ఆహరం తీసుకోవడం వంటివి, ఇవి మీ జీవక్రియ రేటును పెంపొందించి, మంచి వ్యయమ నియమాలను కలుపుతాయి.

కాబట్టి, మన జీవక్రియ రేటును తగ్గించి, బరువు తగ్గడానికి అడ్డుపడే ఆహారపదార్ధాల జాబితా ఇక్కడ ఉంది. ఒకసారి దృష్టి పెట్టండి.

1.శీతల పానీయాలు

1.శీతల పానీయాలు

ప్రతిరోజూ శీతల పానీయాలనే ఆహరం గా తీసుకునే వారిలో మీరుకూడా ఒకరైతే, మీ జీవక్రియ రేటు తగ్గిపోతుంది, శీతల పానీయాలలో ఉండే షుగర్, కర్బొనేటెడ్ పదార్ధాలు మీ జీవక్రియ రేటుపై ప్రభావం చూపించి, బరువు తగ్గడాన్ని అడ్డుకుంటాయి. శీతల పానీయాలను "ఆహరం" తో సమానంగా తీసుకోవడం కూడా చాలా ప్రమాదకరం.

2.ఫ్రిజ్ లో ఉంచిన పదార్ధాలు

2.ఫ్రిజ్ లో ఉంచిన పదార్ధాలు

తాజా వస్తువులు కొనడానికి, తయారుచేయడానికి సమయం లేనివారు ఫ్రిజ్ లో ఉంచిన కూరగాయలను, పండ్లను, ఈరోజుల్లో అందుబాటులో ఉండే ఫ్రోజెన్ భోజనాన్ని కూడా కొనుక్కుని, తరువాత వేడిచేసుకుని, సమయాన్ని ఆదా చేస్తున్నారు. ఫ్రోజెన్ మీల్స్ లో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. అవి మీ జీవక్రియ రేటును విపరీతంగా తగ్గిస్తాయి.

3.ఆల్కాహాల్

3.ఆల్కాహాల్

అపుడపుడు ఆల్కాహాల్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం అని రుజువుచేయబడింది, శారీరిక, మానసిక రెండిటి ఆరోగ్యానికి ప్రమాదకరం, దీనివల్ల అవయవాలు పాడయిపోయి, వ్యసనంగా మారుతుంది. కాబట్టి, ప్రతిరోజూ ఆల్కాహాల్ తీసుకుంటే మీ ఆరోగ్యం పాడయిపోతుంది. ఇందులో ఉండే టాగ్జిన్ల వల్ల మీ జీవక్రియ రేటు తగ్గడంతో పాటు బరువు తగ్గుదలని కూడా నిరోధిస్తుంది.

4.ప్రోటీన్ తక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు

4.ప్రోటీన్ తక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు

ప్రత్యేకంగా మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నపుడు, మీ శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి, ఇది మీ జీవక్రియను పెంపొందించి, మీ కండరాలు సరిగా పనిచేసేట్టు చేస్తుంది. కాబట్టి, మీరు ఆకుకూరలు, పాలు, మేక మాంసం, కోడిగుడ్లు మొదలైనవి సరిపడినంత తీసుకోకపోతే కూడా మీ జీవక్రియ తగ్గిపోతుంది.

5.సాత్విక ఆహరం

5.సాత్విక ఆహరం

అనేక పరిశోధనా అధ్యయనాల ప్రకారం, మీ ఆహారంలో లవంగాలు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను మీ ఆహారంలో కలపడం వల్ల, సహజంగా మీ జీవక్రియను పెంచి, బరువు తగ్గే విధానాన్ని పెంపోదిస్తుంది. కాబట్టి, సాత్విక ఆహారానికి ప్రాధాన్యతను ఇచ్చేవారు, సుగంధ ద్రవ్యాలు లేకుండా కూడా జీర్ణక్రియ రేటును తగ్గించుకోవచ్చు.

అమేజింగ్: తేనెతో బరువు తగ్గించుకునే సింపుల్ టిప్స్ ..!

6.గోధుమ

6.గోధుమ

వైట్ రైస్ కంటే గోధుమ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడినప్పటికీ, గోధుమ ప్రధాన ఆహరం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీ జీవక్రియ దెబ్బతిని, బరువు తగ్గడాన్ని నిరోధిస్తుంది, గోదుమలో గ్లుటేన్ ఉంటుంది, ఇది మీ జీవక్రియను తగ్గించడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా బాధ్యత వహించే ప్రధాన వస్తువులో ఒకటి.

7.తీపి పదార్ధాలు

7.తీపి పదార్ధాలు

స్వీట్లు, చాకొలెట్లు, మిల్క్ షేక్ లు మొదలైన వాటిలో షుగర్ అధిక స్థాయిలో ఉండి ఎక్కువగా తీసుకొనడం వల్ల అవి జీవక్రియను తగ్గిస్తాయి కూడా. మీ రక్తంలో షుగర్ ఎక్కువగా ఉంటె అది జీవక్రియ రేటును తగ్గించి బరువు తగ్గడాన్ని నిరోధి౦చడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావొచ్చు.

8.వైట్ రైస్

8.వైట్ రైస్

భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో వైట్ రైస్ ప్రధానమైన ఆహార పదార్ధం, చాలామంది దీన్ని ప్రతిరోజూ తీసుకుంటారు. అయితే, ఇది అంత ఆరోగ్యకరమైన ఎంపిక కాదు ఎందుకంటే వైట్ రైస్ రేఫిన్ స్టార్చ్ ని కలిగి ఉండడం వల్ల, అది జీవక్రియ రేటును తగ్గిస్తుంది, బరువు పెరగడానికి కూడా కారణం కావొచ్చు. బ్రౌన్ రైస్ కి మారడం అనేది ఆరోగ్యకరమైన ఎంపిక.

9.వెజిటబుల్ ఆయిల్

9.వెజిటబుల్ ఆయిల్

ఎక్కువమంది గృహిణులు రోజువారీ ఆహార పదార్ధాలు తయారుచేయడానికి వెజిటబుల్ ఆయిల్ ముఖ్యంగా రిఫైండ్ వెజిటబుల్ ఆయిల్ ని వాడతారు. ఈ రకమైన నూనెలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడమే కాకుండా మీ జీవక్రియను తగ్గించి, అనారోగ్యానికి గురిచేసే కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి.

10.గొడ్డుమాంసం

10.గొడ్డుమాంసం

ప్రతిరోజూ గొడ్డుమాంసం తింటే, అది ఎంత రుచిగా ఉన్నది అనేది విషయం కాదు, అది మీ ఆరోగ్యానికి, ప్రత్యేకంగా మీ జీవక్రియకు ప్రమాదకరం, ఎందుకంటే గొడ్డుమాంసం లో కొవ్వు అధికంగా ఉండడం వల్ల అది గణనీయమైన రీతిలో జీవక్రియ రేటుని తగ్గిస్తుంది.

?rel=0&wmode=transparent" frameborder="0">

Sonam Kapoor Wedding Album: Sonam

Sonam Kapoor Wedding Album: Sonam

English summary

Foods That Are Bad For Metabolism & Weight Loss

Weight loss can happen only when your metabolism works at a healthy rate. There are certain foods which can lower your metabolic rate and prevent weight loss. Have a look at some of these foods, here.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more