TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
కొబ్బరినూనెతో కాఫీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా?
కాఫీ అనగానే ఎన్ని ప్రయోజనాలు కనిపిస్తాయో అంతకు మించిన దుష్ప్రభావాల గురించిన చర్చలు కూడా జరుగుతుంటాయి. కానీ అదే కాఫీలో కొబ్బరి నూనెను జోడించినట్లయితే మీ ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా ? ఈ వ్యాసంలో, కొబ్బరి నూనెను, కాఫీకి జతచేసి తీసుకోవడం గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని అంశాలను పొందుపరచడం జరిగింది. అసలు కాఫీకి కొబ్బరి నూనెను చేర్చి తీసుకోవడం ఎంతవరకు సమంజసం ?
మీరు కాఫీని రోజువారీ అలవాట్లలో భాగంగా కలిగి ఉంటే, మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేయవచ్చు. రోజువారీ కెఫీన్ మోతాదులు పెద్దవారికి సైతం 400 mg ఉండాలి, అనగా ఇది 4 కప్పుల కాఫీకి సమానం. ఏదిఏమైనా కాఫీ అధికం తాగటం వలన వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని మరచిపోకండి.
కాఫీ తీసుకోవడం మూలంగా కలిగే ప్రయోజనాలు :
కాఫీని రోజువారీ అలవాటుగా కలిగి ఉండటం మూలాన, ఎనర్జీ లెవల్స్ పెరగడం, బరువు క్రమబద్దీకరణ, బుద్దిమాంద్యం ఎదుర్కోవడం, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గడం, ఆల్కహాల్ సంబంధం లేని కాలేయం కొవ్వు సమస్యలు తగ్గడం, మరియు లివర్ సిర్రోసిస్ ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, అల్జీమర్స్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధులకు చికిత్సగా పనిచేయడం, గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం మరియు డయాబెటిక్ భాదితులలో రక్తoలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
కానీ, మితిమీరిన కాఫీ వాడకం, హానికరమైన ప్రభావాలను కూడా కలిగిస్తుంది. మీరు మోతాదును మించిన కాఫీని త్రాగితే అది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. రోజులో 4 కప్పుల కాఫీ కన్నా అధికంగా తీసుకునే వారు ముందస్తు మరణం సమస్యను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదని అధ్యయనాలు చెప్తున్నాయి కూడా. ఇలా అధికంగా కాఫీ తీసుకోవడం, గుండెపోటు అవకాశాలను పెంచుతుందని చెప్పబడింది. హృదయ స్పందన రేటును పెంచే, రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది,
చివరికి కెఫిన్ అధిక మోతాదులు, మరణానికి దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనితో పాటుగా, అధిక కెఫిన్ తీసుకోవడం నిద్రలేమి, తలనొప్పి, అజీర్ణం, శరీరం స్వాధీనం కోల్పోవడం, హార్ట్ సెన్సిటివిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా మహిళల్లో వేడి రక్త స్రావం, మరియు రాత్రి వేళల్లో తీవ్రమైన చెమట సమస్యలకు కారణమవుతుంది మరియు ఎముక పగుళ్లకు కూడా దారితీయడం వంటి, వాసోమోటార్ లక్షణాలకు కారణమవుతుంది. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళలలో ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది.
కాఫీలో కొబ్బరి నూనెను కలిపి తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని ఎంత వరకు ప్రభావితం చేస్తుంది?
మీరు కాఫీని తీసుకునే అలవాటును కలిగిఉంటే, మీ కాఫీకి కొబ్బరినూనెను జోడించడం మీ ఆరోగ్యానికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా కాఫీ ప్రయోజనాలను పెంచడంలో దోహదం చేస్తుంది! దీని అద్భుతమైన ప్రయోజనాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.
1. జీవక్రియల రేటును పెంచుతుంది :
మీ శరీరం యొక్క జీవక్రియల రేటును పెంచడంలో కొబ్బరి నూనె ఎంతగానో సహాయపడుతుందని చెప్పబడింది. స్వల్పకాలంలోనే మీ శరీరంలోని జీవక్రియల రేటును పెంచే తత్వాలు కలిగినట్లుగా కెఫీన్ ఇప్పటికే పేరు గాంచింది మరియు ఇది కొవ్వులని కరిగించి మీ శరీర శక్తి సామర్థ్యాలను ప్రేరేపిస్తుంది. కొబ్బరి నూనె శరీరంలో కొవ్వు రూపంలో నిల్వ ఉన్నప్పటికీ, మన శరీరానికి తక్షణ శక్తి వనరుగా ఉపయోగపడుతుంది. 12 వారాల అధ్యయనంలో, 20 నుండి 40 ఏళ్ళ వయస్సు ఉండి, ఉదర ఊబకాయంతో బాధపడుతున్న 40 మంది స్త్రీలలో పరిశోధనలు నిర్వహించబడ్డాయి.
ఈ పరిశోధనలో పాల్గొన్న వారికి 30 ml కొబ్బరి నూనె లేదా సోయాబీన్ నూనెతో పాటుగా డైటరీ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగినది. కొబ్బరి నూనెతో పాటుగా డైటరీ సప్లిమెంట్స్ తీసుకున్న వారిలో, వారి బి.ఎమ్.ఐ (బాడీ మాస్ ఇండెక్స్) లో గణనీయమైన ఆరోగ్యకరమార్పులను చూడడంతోపాటుగా, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరిగి, బరువులో క్షీణతని పొందినట్లు పరిశోధకులు కనుగొన్నారు. సోయాబీన్ నూనె తీసుకున్న మహిళల్లో ఈ సానుకూల ఫలితాలు అంతగా కనిపించలేదు. అందువల్ల కొబ్బరి నూనెతో కాఫీ తీసుకునే వారిలో శరీర జీవక్రియల రేటు ఊహించని స్థాయిలో పెరగడం జరుగుతుందని చెప్పబడింది.
2. రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయం చేస్తుంది :
మధుమేహులలో రక్తంలో చక్కర స్థాయిలను క్రమబద్దీకరించడంలో కొబ్బరి నూనెతో కూడిన కాఫీ ఉత్తమమైన ప్రయోజనాలును అందిస్తుంది. కాఫీ పరిమిత మోతాదులో తీసుకోవడం వలన మధుమేహం కలిగే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిల ఆధారితంగా, శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కొబ్బరి నూనె ఇన్సులిన్ నిక్షేపాలతో కలవడం మూలంగా, మరింత సమర్థవంతమైన పద్ధతిలో మీ కణాలకు సహాయం చేయడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కొబ్బరి నూనెతో కూడిన కాఫీ ఉపయోగకరంగా ఉంటుంది.
3. జీర్ణాశయాన్ని, జీర్ణ క్రియలను మెరుగుపరచడం ద్వారా జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది:
శరీరంలో చక్కెరల శోషణను తగ్గించడం, మరియు మలబద్ధకాన్ని నిరోధించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడటానికి కాఫీ ప్రసిద్ది చెందింది. కానీ అది కడుపు నొప్పిని మరింత తీవ్రతరం చేయగలదు మరియు శరీరంలో ద్రవాల స్థాయిలను కోల్పోయేలా చేస్తుంది కాబట్టి మోస్తరు మొత్తంలో తీసుకోవలసి ఉంటుంది. కొబ్బరి నూనె కూడా మీ జీర్ణవ్యవస్థను ఇదేవిధంగా ప్రేరేపిస్తుంది,
ఇది సహజ సిద్దమైన లాక్సేటివ్ (విసర్జన కారకం) వలె పనిచేసి, మీ జీర్ణాశయ కదలికను మెరుగుపరుస్తుంది. క్రమంగా మీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు పోషకాలను శోషించే క్రమంలో మీ శరీర సామర్ధ్యాన్ని పెంచుతుంది. కొబ్బరి నూనెతో కూడిన కాఫీ తీసుకోవడం ద్వారా గట్ సమస్యలు తొలగిపోవడంతో పాటు మంట వాపు సమస్యలను కూడా తగ్గిస్తుంది.
4. రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది :
కెఫీన్ మన శరీర రోగనిరోధక వ్యవస్థను పెంచుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది; కాఫీలో పాలీఫెనోల్ అనామ్లజనకాలు ఉన్నాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి, అంతేకాకుండా వివిధ రకాలైన క్యాన్సర్లు, నరాల వ్యాధులు మరియు బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో కూడా సహాయపడగలవు. కొబ్బరి నూనె విషయానికి వస్తే , ఇది 50% లారిక్ యాసిడ్ కలిగి ఉంటుంది, ఇది రొమ్ముపాలలో కనిపించే ఆరోగ్యకరమైన కొవ్వుతో సమానంగా ఉంటుంది. ఈ ఆమ్లం యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగకారక బాక్టీరియాను చంపడానికి మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది.
5. కాగ్నిటివ్ ఫంక్షన్ పెంచుతుంది :
కాఫీ ఒక తేలికపాటి ఉద్దీపనగా వ్యవహరించబడుతుంది., ఇది ప్రజలు తమ రోజును శక్తివంతంగా ప్రారంభించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రజల ఏకాగ్రతను మరియు మానసిక స్థితిని పెంపొందించడం ద్వారా వారి అభిజ్ఞా ప్రవర్తనను లేదా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
కొబ్బరి నూనెను మన శరీరం తీసుకునే సందర్భంలో, శక్తిగా మారడం లేదా కీటోన్స్ వలె రూపాంతరం చెందడం జరుగుతుంది. కీటోన్లు మన మెమరీ మరియు మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి.
తయారు చేసే విధానం :
మీ కాఫీ కప్పులో, కొబ్బరినూనెను 2 టేబుల్ స్పూన్లను జోడించండి మరియు దానిపై వేడి కాఫీ పోసి బాగా కలియబెట్టి స్వీకరించండి.కొందరు కాఫీలో ఎటువంటి పాలు లేకుండా, బులెట్ కాఫీ వంటివి ప్రయత్నిస్తుంటారు. దీనిలో కొబ్బరినూనె, కాఫీపొడితో పాటు కొద్ది మోతాదులో పాలకు బదులుగా బట్టర్ జోడించవలసి ఉంటుంది. కాఫీతో కొబ్బరినూనెను తీసుకోవడం వలన దుష్ప్రభావాలు కలిగే సమస్యలు ఉన్నాయా:
కాఫీలో కొబ్బరినూనెను జోడించడం ద్వారా దుష్ప్రభావాలు పెద్దగా కనపడకపోయినా కూడా, ఏమాత్రం మీ శరీరంలో అసాధారణ మార్పులు చోటు చేసుకున్నా, లేదా రక్తపోటు స్థాయిలలో మార్పులను గ్రహించినా వెంటనే ఆపివేయడం లేదా తగ్గించడం ఉత్తమం.
కొన్ని ఆహార ప్రణాళికలు కొన్ని శరీరతత్వాలకు నప్పవని గ్రహించండి. ఏదిఏమైనా మీ ఫామిలీ డాక్టరుని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కాఫీతో కొబ్బరినూనె తీసుకోవడం మంచిదే, కానీ పరిమితిని మించి తీసుకోవడం ఎన్నటికీ శ్రేయస్కరం కాదు. అధిక మోతాదులో తీసుకోవడం, ఒక్కోసారి కొన్ని దుష్ప్రభావాలకు కూడా దారితీయవచ్చు. ప్రధానంగా రక్తపోటు, గుండె వేగం పెరగడం, హార్ట్ సెన్సిటివిటీ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు అని కొందరు వైద్యులు ద్రువీకరిస్తున్నారు కూడా.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.