For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి గుమ్మడికాయ :గుమ్మడికాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు బరువు తగ్గడానికి సూచించబడిన 5 అద్భుతమైన గుమ్మడికాయ రెసిపీలు

బరువు తగ్గడానికి గుమ్మడికాయ :గుమ్మడికాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు బరువు తగ్గడానికి సూచించబడిన 5 అద్భుతమైన గుమ్మడికాయ రెసిపీలు

|

మన భారతదేశంలో గుమ్మడి కాయ తెలీని వారు ఉన్నారు అంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆచార సంప్రదాయాల నుండి, వంటకాల వరకు అన్నిటిలో తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది గుమ్మడికాయ. కూరలు, సబ్జి, సూప్స్, కబాబ్స్ వంటి వాటితో పాటు, గుమ్మడికాయను హల్వా, పాయసం వంటి స్వీట్స్ తయారీలో కూడా వినియోగిస్తారు. గుమ్మడికాయలో వెలుపలి బాగం మందంగా ఉండి, లోపలి భాగం గుజ్జు మరియు విత్తనాలతో కూడుకుని ఉంటుంది. దీనిని హిందీలో కడ్డు అని పిలుస్తారు.


గుమ్మడికాయలో ఆరోగ్య లక్షణాలతో పాటు, సౌందర్య ప్రయోజనాలు కూడా నిండుకుని ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా గుమ్మడికాయ ఎంతగానో సహాయం చేస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, కెనడా మరియు మెక్సికోలతో పాటు, భారతదేశం కూడా అతిపెద్ద అంతర్జాతీయ గుమ్మడికాయ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఉంది. కొన్ని ప్రాంతాలలో చేసే కార్నివాల్స్, హాలోవీన్ వంటి వాటిలో గుమ్మడికాయకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మరి కొన్ని చోట్లయితే అత్యంత పెద్ద గుమ్మడికాయను పండించిన వారికి బహుమతులను కూడా ఇస్తుంటారు.

Pumpkin For Weight Loss: Health Benefits And 5 Yummy Kaddu Recipes To Lose Weight Fast

అత్యధిక పోషకవిలువలు కలిగిన గుమ్మడికాయలు, కొలెస్ట్రాల్, సోడియం మరియు కొవ్వులలో తక్కువగా ఉంటాయి. క్రమంగా శరీరానికి సరైన మోతాదులో పోషకాలను అందివ్వడమే కాకుండా, ఊబకాయం తగ్గించడంలో కూడా అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. గుమ్మడికాయలను వాటి గుజ్జు, విత్తనాలు మరియు విత్తనాల నూనెల కోసం ఉపయోగిస్తారు. వీటిని పంప్కిన్-పీస్ మరియు కేకులు, స్మూతీస్ వంటి వాటికి జోడించి తీసుకోబడుతాయి. మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్ వలె కూడా గుమ్మడికాయను నేరుగా తీసుకోవచ్చు. అంతేకాకుండా, దీనిలోని ఫైబర్ నిల్వలు, ఆకలిని అదుపులో ఉంచుతుంది. క్రమంగా ఆహారం మీదకు మనసు వెళ్ళకుండా నిరోధిస్తూ, బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషించగల అనేక ఆరోగ్య ప్రయోజనాలు గుమ్మడికాయలో నిక్షిప్తమై ఉన్నాయి.

బరువు తగ్గించడంలో గుమ్మడికాయ పనితీరు:

బరువు తగ్గించడంలో గుమ్మడికాయ పనితీరు:

మీరు రోజువారీ ఆహారప్రణాళికలో భాగంగా గుమ్మడికాయను కూడా చేర్చుకొనిన ఎడల, తక్కువ కాలంలోనే ఎక్కువ కేలరీలు కరగడం ద్వారా, బరువు కోల్పోవడాన్ని గమనించవచ్చు. ఫైబర్లో అధికంగా ఉంటూ, కాలరీలలో తక్కువగా ఉండే గుమ్మడికాయ, నెమ్మదిగా ఆకలిని దూరంగా ఉంచుతుంది. క్రమంగా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

గుమ్మడికాయ బరువును ఎలా తగ్గించగలదు:

1.కేలరీలు తక్కువ :

USDA డేటా ప్రకారం 100గ్రాముల ముడి గుమ్మడికాయలో కేవలం 26 కాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. క్రమంగా తక్కువ కాలరీలతోనే, అధిక మోతాదులో పోషకాలను శరీరానికి అందివ్వగలరు.

2.ఫైబర్లో ఎక్కువ :

2.ఫైబర్లో ఎక్కువ :

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్(వ్యవసాయ శాఖ) ప్రకారం 100 గ్రాముల గుమ్మడికాయ కేవలం 0.5గ్రాముల ఫైబర్ కలిగి ఉంటుంది. క్రమంగా, ప్రతి కప్పు గుమ్మడికాయలో సుమారుగా 3గ్రాముల ఫైబర్ మరియు 49 కేలరీల శక్తి ఉంటుంది. బరువు తగ్గడంలో ఫైబర్ కీలకపాత్ర పోషిస్తుంది. మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా, తరచుగా ఆకలి కలుగకుండా నిరోధిస్తుంది.

3.వ్యాయామం తర్వాత తీసుకోదగిన ఉత్తమ ఆహారంగా :

3.వ్యాయామం తర్వాత తీసుకోదగిన ఉత్తమ ఆహారంగా :

గుమ్మడికాయలో పొటాషియం నిల్వల ఉనికి ఎక్కువగా ఉంటుంది, క్రమంగా వ్యాయామం తర్వాత కండరాల విశ్రాంతికి మరియు పునర్నిర్మించడానికి ఎంతగానో సహాయపడగలదు. 100గ్రాముల గుమ్మడికాయలో 340మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అనగా ఇది అరటిపండులోని పొటాషియం స్థాయిల కన్నా అధికంగా ఉంటుంది. క్రమంగా మీ వ్యాయామం తర్వాత, మీ కండరాలను తిరిగి వేగంగా పునర్నిర్మించేందుకు సహాయపడుతుంది.

Most Read:మా తమ్ముడి ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకునేదాన్ని, బాత్రూం టవల్ కట్టుకునేదాన్ని #mystory292Most Read:మా తమ్ముడి ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకునేదాన్ని, బాత్రూం టవల్ కట్టుకునేదాన్ని #mystory292

4.రోగనిరోధక శక్తిని పెచుతుంది :

4.రోగనిరోధక శక్తిని పెచుతుంది :

శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలైన విటమిన్-సి మరియు బీటాకెరోటిన్ ఉనికిని గుమ్మడికాయ కలిగి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తికి బూస్టర్ వలె ఉంటాయి. క్రమంగా ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉండేలా దోహదపడుతుంది.

5.నిరాశ, ఆందోళనలు మరియు ఒత్తిడిని నియంత్రిస్తుంది :

5.నిరాశ, ఆందోళనలు మరియు ఒత్తిడిని నియంత్రిస్తుంది :

గుమ్మడికాయలోని ట్రిప్టోఫాన్ అని పిలువబడే అమైనోఆమ్లం, ఒత్తిడి మరియు ఆందోళనలతో పోరాడి డిప్రెషన్ తగ్గించడంలో కీలకపాత్ర పోషించే సహజ సిద్దమైన మూడ్ బూస్టర్ వలె ఉంటుంది. మీ బరువును తగ్గించడంలో మరియు ఫిట్నెస్ నియమావళిని క్రమబద్దీకరించడంలో మీకు సహాయపడేందుకు మరియు ఆకలి మీదకు మనసు వెళ్ళకుండా చేసేలా ఈ ట్రిప్టోఫాన్ దోహదపడుతుంది.

బరువును తగ్గించడంలో గుమ్మడికాయను ఆహారప్రణాళికలో ఎలా తీసుకోవాలి:

బరువును తగ్గించడంలో గుమ్మడికాయను ఆహారప్రణాళికలో ఎలా తీసుకోవాలి:

బరువు తగ్గడంలో గుమ్మడికాయలో ఉన్న లక్షణాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా, ఇప్పుడు గుమ్మడికాయను మీ బరువు తగ్గడానికి సూచించబడిన ఆహారప్రణాళికలో చేర్చుకునే విధానాల గురించి తెలుసుకుందాం. గుమ్మడికాయను పీస్, కేకుల రూపంలో తీసుకోవడం అంత ప్రయోజనాన్ని కలిగి ఉండదు. దీనికి కారణం, వీటిలో అధిక చక్కెరలు, రీఫైండ్ పిండిపదార్ధాలు మరియు ఇతర కొవ్వు పదార్థాలను కూడుకుని ఉంటాయి కాబట్టి. ఇవి బరువు తగ్గించడానికి బదులుగా బరువు పెరగేందుకు దారితీస్తుంది. ఇక్కడ, మీ వెయిట్-లాస్ ఆహార ప్రణాళికకు జోడించుకునేలా కొన్ని ఆరోగ్యకరమైన గుమ్మడికాయ ఆధారిత వంటకాలను పొందుపరచబడినవి.

Most Read:బరువు తగ్గాలని భావించేవారు, అల్పాహారం తీసుకోవడంలో చేయకూడని తప్పులు :Most Read:బరువు తగ్గాలని భావించేవారు, అల్పాహారం తీసుకోవడంలో చేయకూడని తప్పులు :

1.తృణ ధాన్యాలు, గుమ్మడికాయ మరియు క్రాన్బెర్రీస్ సూప్ :

1.తృణ ధాన్యాలు, గుమ్మడికాయ మరియు క్రాన్బెర్రీస్ సూప్ :

తృణ ధాన్యాలలోని పోషకాలు, క్రాన్బెర్రీస్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా, ఈ సూప్ శరీరానికి సంపూర్ణతని ఇచ్చేలా ఉంటుంది.

2.కాల్చిన గుమ్మడికాయతో రెసిపీ :

2.కాల్చిన గుమ్మడికాయతో రెసిపీ :

రెడ్ వైన్ వెనిగర్, థైమ్, మిరపకాయలు మరియు కొత్తిమీరతో కూడిన ఈ కాల్చిన గుమ్మడికాయ రెసిపీ, కడుపు నిండినట్లుగా ఉంచడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది.

3.గుమ్మడికాయ హమ్ముస్ రెసిపీ :

3.గుమ్మడికాయ హమ్ముస్ రెసిపీ :

కాల్చిన గుమ్మడికాయ, చిక్పీస్, ఆలివ్ నూనె మరియు జీలకర్ర వంటి ఉత్తమ పదార్ధాలతో కూడిన ఈ హమ్ముస్ రెసిపీ సాయంత్రం తీసుకునే స్నాక్స్ వలె ఉపయోగపడుతుంది.

Most Read:మా ఆవిడను ఆ సమయంలో టచ్ చేస్తే తంతుంది, ముద్దు పెడితే చెంప చెళ్లుమన్పించింది, శృంగారం మాట ఎత్తితేMost Read:మా ఆవిడను ఆ సమయంలో టచ్ చేస్తే తంతుంది, ముద్దు పెడితే చెంప చెళ్లుమన్పించింది, శృంగారం మాట ఎత్తితే

4.గుమ్మడికాయ సూప్ రెసిపి :

4.గుమ్మడికాయ సూప్ రెసిపి :

గుమ్మడికాయ సూప్ వెయిట్-లాస్ ఆహార ప్రణాళికలో ఉన్న వారికి ప్రత్యేకించి సూచించబడిన ఆహారపదార్ధంగా ఉంటుంది.

5.కట్టా మీటా కడ్డు :

5.కట్టా మీటా కడ్డు :

మీరు భారతీయ ఆహార ప్రేమికునిగా ఉన్నట్లయితే, ఈ తీపి మరియు స్పైసి సబ్జిని తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే. ఇంగువ, సోపు, జీలకర్ర మరియు చింతపండు గుజ్జుతో చేసే ఈ రుచికరమైన ఈ కట్టా మీటా కడ్డు ఉత్తమమైన రుచిని కలిగి ఉండడమే కాకుండా, భోజనం సంపూర్ణతను అందిస్తుంది.

బరువు తగ్గాలని చేసే ఆహార ప్రణాళికలు అంత తేలికగా ఉండవని గుర్తుంచుకోండి. కావున, ఉత్తమ ఫలితాలను పొందేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు, దీర్ఘకాలిక వ్యాయామం, సరైన ఆహార ప్రణాళిక కూడా అవసరంగా ఉంటుందని గుర్తుంచుకోండి.

English summary

Pumpkin For Weight Loss: Health Benefits And 5 Yummy Kaddu Recipes To Lose Weight Fast

Almost every vegetarian is familiar with the big and round squash plant veggie - pumpkin. The vegetable is widely used for cooking in Indian kitchens as well. We make curries, subzis, soups, kebabs and even halwas with pumpkins. The vegetable has a thick outer covering, which encloses the hard pulp and seeds. Known as kaddu in Hindi, pumpkin is a vegetable that comes with a whole range of health and beauty benefits.
Desktop Bottom Promotion