మానవ శరీరం పై సోడా అసాధారణ ప్రభావాలు

Subscribe to Boldsky

ప్రాణవాయువుని తీసుకునే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన పేరు జోసెఫ్ ప్రీస్ట్లీ. ఇతను ప్రాణవాయువుని కనుగొనడమే కాకుండా, అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో మానవాళికి ముప్పైన కార్బొనేటెడ్ వాటర్ సోడాని కూడా కనుగొన్నాడు.

సోడా నిజానికి మామూలు నీళ్లే , కానీ కార్బన్ డై ఆక్సైడ్ తో కార్బొనేట్ చేయడం ద్వారా సోడా గా మారుతుంది. మామూలు సోడా శరీరానికి పెద్దగా హాని చేయదు. దీనికి కారణం సోడాలోని ఎసిడిటీ పదార్ధాలను నోటిలోని లాలాజలం తటస్థీకరించడం వలన సమస్య లేకుండా చూడగలుగుతుంది. కానీ ఈ సోడాని కృత్రిమ స్వీట్నర్లతో కలపడం వలన దీనిలోని PH స్థాయి అసాధారణ రీతిలో మారుతుంది. తద్వారా శరీరానికి హానికరంగా పరిణమిస్తుంది.

సోడాను ప్రపంచ జనాభాలో 86 శాతం మంది రోజూవారీగా వినియోగిస్తూ ఉంటారు. శీతల పానీయాలు , శక్తి పానీయాలు, మామూలు సోడా లేదా ఆల్కహాల్ తో కలిపి తీసుకోవడం ద్వారా అనేక పద్దతులలో ఈ సోడాను సేవిస్తూ ఉంటారు. నిజానికి అమెరికాలో అయితే ఒక సాధారణ సగటు మనిషి రోజులో ఒకటి లేదా రెండు లీటర్ల సోడా వినియోగిస్తారని అంచనా.

Shocking! This Is What Soda Does To Your Health

ఈ పానీయాలలోని కృత్రిమ చక్కెరలు నేరుగా రక్తంలోకి విడుదల అవుతాయి, దీనికి కారణం శరీర జీవక్రియలకు అవసరమైన న్యూట్రిషన్ తత్వాలు లేదా పదార్ధాలు ఈ పానీయాలలో ఉండవు. కావున జీవక్రియలకు సంబంధించిన చర్యలకు ఆస్కారo లేక నేరుగా ఇది రక్తంలోనికి ప్రవేశిస్తుంది. దీని వినియోగం ఎక్కువైతే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీని కారణంగా సోడా తీసుకోవడం తగ్గించాల్సిన అవసరం ఉంది.

కరోనరీ ఆర్టరీ రోగాలలో(ధమనులకు సంబంధించిన) ఒకటైన Atherosclerosis వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ధమనులకు రక్త సరఫరా తగ్గిస్తుంది, తద్వారా గుండెపోటుకు కారణమయ్యే అవకాశం ఉంది.

ముఖ్యంగా శరీరంలోని భాగాలకు ప్రాణవాయువుని సరఫరా చేయడం తగ్గిస్తుంది, ఈ ప్రభావం గుండెపై అధికంగా ఉంటుంది . ధమనులలో చక్కెర, కాల్షియం కొవ్వు నిక్షేపాల మిశ్రమ శాతం పేరుకుని పోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తద్వారా గుండెకి సరైన స్థాయిలో రక్త సరఫరా ఉండదు. దీని కారణంగా గుండె పని తీరులో అసాధారణ మార్పులు , గుండె పోటులు , ఒక్కోసారి ఫంక్షనింగ్ ఆగిపోయి మరణాలు కూడా సంభవించే అవకాశం లేకపోలేదు.

కావున మీరు ఎంత ఎక్కువ సోడా తీసుకుంటే, గుండె పోటు ప్రభావాలని అంతగా ఆహ్వానిస్తున్నారని అర్ధం.

సోడా వలన ప్రభావితం అయ్యే అంశాలు:

Shocking! This Is What Soda Does To Your Health

1.బరువు పెరగడం, వృద్దాప్య లక్షణాలు త్వరగా రావడం:

ఈ కార్బొనేటెడ్ చక్కెర పానీయాలు తీసుకోవడం ద్వారా అధిక చక్కెరలు కొవ్వుగా మారి శరీరంలో నిక్షేపించబడతాయి, తద్వారా మీరు అదనపు బరువును పొందే పరిణామాలకు దారితీస్తుంది. క్రోమోజోములలో పెరిగే టెలోమేర్లు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

2. చర్మ సమస్యలు మరియు వ్యంద్యత్వ సమస్యలు:

కార్బోనేటేడ్ నీటిని అధికoగా వినియోగించుట వలన శరీరంలో pH మరియు గ్లైసెమిక్ స్థాయిలు అసమతౌల్యానికి కారణమవుతుంది. ఈనిరంతర అసమతుల్యం చర్మం బ్రేక్అవుట్లకు (పొడిబారడం లేదా విరుగుట) కారణమవుతుంది మరియు చర్మం యొక్క నాణ్యత తగ్గిస్తుంది. ఇది పురుషులలో వ్యంద్యత్వ సమస్యలకు కూడా దారి తీస్తుంది.

3. ఇతర వ్యాధులు:

ఏ. శరీరంలో నేరుగా రక్తంలోకి చక్కెర నిల్వలు పెరిగేలా చూడడం వలన నేరుగా ఇన్సులిన్ హెచ్చుతగ్గులపై ప్రభావం పడడం వలన టైప్ 2 డయబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

బి. మూత్రపిండాల ప్రొటీన్యూరియా కూడా సంభవించవచ్చు. ఈ పరిస్థితిలో, మూత్రపిండం సరిగా ప్రోటీన్లను ఫిల్టర్ చేయలేవు.

సి. కొన్ని సందర్భాల్లో, ఆస్థ్మా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మరియు తగ్గిపోయినా కూడా తిరగబెట్టే ప్రమాదం ఉంది.

Shocking! This Is What Soda Does To Your Health

4. కాల్షియం శోషణం తగ్గిస్తుంది:

బోలు ఎముకల వ్యాధి కాల్షియం తగ్గడం వలన కలుగుతుంది. మనం త్రాగే సోడా ఫాస్పోరిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. ఫాస్ఫరస్, ఎముక సాంద్రత నిర్వహించడానికి ముఖ్యమైనది అయినప్పటికీ, ఇది అధికంగా తీసుకోవడం మూలంగా కాల్షియం శోషించుకునే ప్రక్రియ తగ్గుముఖం పడుతుంది. తద్వారా ఎముకలు పెళుసు గా తయారయ్యి ఆస్ట్రియోపొరాసిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.

5. పళ్ల సమస్యలు:

మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా కృత్రిమ సోడా లోని చక్కెరలతో రసాయనిక చర్యలు జరిపి, పళ్ళలో ఉన్న ఎనామిల్ పై దాడి చేస్తుంది. మరియు పళ్లలో సెన్సిటివిటీ లక్షణాలను పెంచుతాయి. ఇటువంటి చర్యలు పళ్లను బలహీన పరుస్తాయి, దీనివల్ల కావిటీస్ మరియు దంత క్షయం ఏర్పడే అవకాశం ఉంది. మరియు పంటి రంగులో కూడా మార్పులు వస్తాయి.

హార్వార్డ్ యూనివర్సిటీ 2013 లో ఇచ్చిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1,80,000 ఊబకాయ సంబంధిత మరణాలు ఈ చక్కెర పానీయాలవలనే సంభవించినట్లు పేర్కొంది.

కావున ఈ సోడా తీసుకోవాలో లేదో అనేది నిర్ణయించుకోవాల్సింది మీరే ఇక. ఇది ఛాయిస్ మాటర్ . కానీ ఎవరైనా సరే కోరి ప్రమాదాలు తెచ్చుకోవడానికి ఇష్టపడరు. ఈ సోడా, శీతల, శక్తి పానీయాల ప్రభావాల వలన అనేకమంది ఆరోగ్యసమస్యలకు గురై హాస్పిటల్స్ లో రోగుల సంఖ్యనైతే పెంచుతున్నారు కానీ, లాభపడిన ధాఖలాలు మాత్రం ఒక్కటి కూడా కనపడదు. గమనించవలసినది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Shocking! This Is What Soda Does To Your Health

    Around a litre of soda is consumed per day by an average American! You will be shocked to know the side-effects of this beverage on your body. Soda poses many risks to your health, it can cause heart ailments, lead to weight gain and ageing, deplete the sperm count, deteriorate the skin quality, cause type-2 diabetes, and trigger asthma.
    Story first published: Tuesday, March 27, 2018, 7:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more