For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైన్స్ నిరూపించిన ఈ హోంరెమెడీ ద్వారా నెలలో నాలుగు కిలోలు సులభంగా తగ్గవచ్చు!

సైన్స్ నిరూపించిన ఈ హోంరెమెడీ ద్వారా నెలలో నాలుగు కిలోలు సులభంగా తగ్గవచ్చు!

|

గత కొంత కాలంగా బరువు తగ్గడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లైనా లేదా మీ ప్రియమైన వారు బరువు తగ్గాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరు గమనిస్తూ ఉన్నా బరువు తగ్గడమంత సులభం కాదన్న విషయం మీకు ఈపాటికే స్పష్టమై ఉండుంటుంది.

చాలా మంది బరువు తగ్గే ప్రయత్నంలో బంధువులు, కుటుంబ సభ్యులూ, స్నేహితులూ, బ్లాగ్స్, మ్యాగజైన్స్ వంటి నుండి అందే సలహాలను పాటిస్తూ ఉంటారు. ఈ పద్దతులలో ఉండే సామర్థ్యంపై అలాగే బరువు తగ్గడానికి ఉపయోగపడే కొన్ని హెల్త్ ఫ్యాక్టర్స్ పై వారు అంత దృష్టి పెట్టరు. ఈ విధంగా బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నాలు ఏ మాత్రం సత్ఫలితాన్ని ఇవ్వవు.

కొన్ని వెయిట్ లాస్ రెమెడీస్ అనేవి బరువు తగ్గేందుకు ఆరోగ్యకరంగా ఉపయోగపడిన మరి కొన్నిటిని పాటించడం వలన హెల్త్ రిస్క్ లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మరికొన్ని రెమెడీస్ అనేవి బరువు తగ్గేందుకు ఉపయోగపడకపోగా దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను తీసుకువస్తాయి.

This Easy Home Remedy Can Help You Lose 4 Kilos In 1 Month, Backed By Science!

ఉదాహరణకి, ఆరోగ్యకరమైన, బ్యాలెన్స్డ్ డైట్ ను తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరంగా బరువును తగ్గించుకోవచ్చు.

క్రాష్ డైట్ ను పాటిస్తూ, ఆహారం తీసుకోకుండా ఆకలితో అలమటిస్తూ ఎటువంటి వ్యాయామాలు చేయకుండా కొంతకాలంలోనే బరువు తగ్గినా ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి మెటబాలిజాన్ని తగ్గిస్తుంది. తిరిగి మీరు వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఎదురవుతుంది.

కాబట్టి, వెయిట్ లాస్ కి అందే సలహాలను పాటించడం ఎంతో ముఖ్యం. వాటిలో, మన శరీరానికి ఏవి నప్పుతాయి తెలుసుకుని వాటిని పాటించడం ఉత్తమం. తద్వారా, బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన చర్యలను తీసుకోవచ్చు.

కాబట్టి, ఇక్కడ వివరించబడిన ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటించడం ద్వారా మీరు నెలలో నాలుగు కిలోల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు!

శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవడం వలన ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి ?

శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవడం వలన ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి ?

మనకిదివరకే తెలిసినట్టుగా, శరీరంలోని అదనపు కొవ్వు లేదా హై బాడీ మాస్ ఇండెక్స్ (BMI) రేషియో అనేది ఓవర్ వెయిట్ లేదా ఓబేస్ సమస్యకు దారితీయవచ్చు.

ఒక వ్యక్తి ఓబేస్ గా లేదా ఓవర్ వెయిట్ గా ఉన్నప్పుడు అతని/ఆమె కాన్ఫిడెన్స్ లెవల్స్ పై ఆ ప్రభావం పడుతుంది. వారు ఆకర్షణీయంగా లేరని వారు భావిస్తారు. దీని వలన మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లెమ్స్, జాయింట్ పెయిన్, డైజెస్టివ్ డిజార్డర్స్, డిప్రెషన్, ఇంఫెర్టిలిటీ వంటివి శరీర బరువు పెరగడం వలన తలెత్తే కొన్ని ఆరోగ్యసమస్యలు.

శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవడం వలన ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి ?

శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవడం వలన ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి ?

కాబట్టి, బరువు తగ్గించుకోవాలన్న ఆలోచనని తెచ్చుకోవడం ఎంతో ముఖ్యం. ఆ ఆలోచనను అమలు చేసి హెల్తీ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కు చేరడం మరింత ముఖ్యం.

ఇందుకోసం, మైండ్ ఫుల్ ఈటింగ్ తో పాటు హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ పై శ్రద్ధ వహించడం, జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

వీటితో పాటు, మెడికల్ చెక్ అప్ ను చేసుకోవడం ముఖ్యం. తద్వారా, బరువు ఎందుకు పెరుగుతుందో అర్థమవుతుంది. కొన్ని సార్లు, కొన్ని హార్మోన్ డిజార్డర్ల వలన బరువు పెరుగుతుంది. ఇటువంటి సందర్భాలలో, హెల్తీ లైఫ్ స్టయిల్ హ్యాబిట్స్ ను పాటించినా బరువు అదుపులో ఉండదు.

ఆరోగ్య సమస్యలు లేనప్పుడు కొన్ని సమర్థవంతమైన హోమ్ రెమెడీస్ ను పాటిస్తే బరువును సులువుగా తగ్గవచ్చు. అయితే, ఈ రెమెడీస్ ను క్రమం తప్పకుండా పాటించాలి.

అయితే, ఈ రెమెడీస్ ను పాటిస్తూ ఆరోగ్యకరమైన డైట్ ను తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయాలి. అప్పుడే, ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు.

ఇక్కడ, అటువంటి ప్రభావవంతమైన ఒక రెమెడీని మీకు వివరిస్తున్నాము. బరువు తగ్గేందుకు ఈ రెమెడీ ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము.

ఈ రెమెడీ వలన కలిగే ప్రభావాలు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీలో నిర్ధారించబడ్డాయి. కాబట్టి, ఈ రెమెడీ సురక్షితం మరియు ప్రభావవంతం. ఈ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

• రా టర్మరిక్ పౌడర్ - ఒక టేబుల్ స్పూన్

• తేనె - ఒక టేబుల్ స్పూన్

• జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూన్

ఈ హోమ్ రెమెడీ అనేది సమర్థవంతమైనది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన లాభాలే గాని నష్టాలుండవు.

అయితే, ఈ రెమెడీని పాటించే ముందు వైద్యుని సలహాను స్వీకరించడం మంచిది. గర్భిణీలు ఈ రెమెడీకి దూరంగా ఉండాలి.

ఈ రెమెడీకి మీరు చేసే వ్యాయామాలు అలాగే మీరు తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం తోడవుతాయి. తద్వారా, బరువును వేగంగా తగ్గించుకోగలుగుతారు.

ఈ రెమెడీ ద్వారా బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చు

ఈ రెమెడీ ద్వారా బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చు

ఈ రెమెడీలో వాడిన రా టర్మరిక్ పౌడర్ లో కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన పదార్థాలు కలవు. ఇవి శరీరంలోని ఫ్యాట్ సెల్స్ ని వేగంగా కరిగించడానికి తోడ్పడతాయి.

అంతేకాక, ఈ రెమెడీలో వాడిన తేనె అనేది మెటబాలిక్ రేట్ ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. తద్వారా, వెయిట్ లాస్ వేగవంతమవుతుంది.

జీలకర్ర పొడిలో పొటాషియంతో పాటు విటమిన్ బి కలదు. ఈ రెండు శరీరంలోని ఫ్యాట్ ను వేగవంతంగా కరిగించేందుకు తోడ్పడతాయి.

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

• కొన్ని నీళ్లను మరిగించి ఆ నీటిని ఒక గ్లాస్ లోకి తీసుకోండి.

• ఇందులో పైన చెప్పబడిన పదార్థాలను సరైన మోతాదులో జోడించండి.

• ఈ పదార్థాలను బాగా కలపండి.

• ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి ముందు ప్రతి రోజూ తీసుకోవాలి.

• ఈ రెమెడీను తీసుకోవడం మీరు కొనసాగిస్తే ఒక నెలలోని మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.

English summary

This Easy Home Remedy Can Help You Lose 4 Kilos In 1 Month, Backed By Science!

Being obese is extremely unhealthy as it makes you prone to numerous ailments, such as heart problems, high cholesterol, high blood pressure, joint pain, etc. Add 1 tablespoon each of turmeric, honey, and cumin powder in hot water, stir it and consume it before breakfast. Have this home remedy after consulting your doctor and lose weight naturally.
Story first published:Friday, June 8, 2018, 17:25 [IST]
Desktop Bottom Promotion