For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ సులువైన ఉపాయం మీకోసమే!

బరువు పెరగాలనుకుంటే, పాలలో తేనె కలిపి తాగండి

|

మనలో చాలామందికి అధిక బరువును తగ్గించుకోవడం అనేది అతి పెద్ద సమస్య. కానీ కొంత మంది మాత్రం తమ బరువును పెంచుకోవడానికి అనేక ఏ ఆహారం తీసుకోవాలి అని చాలా అగచాట్లు పడుతుంటారు.

వీరికి ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే, పాలు తేనెలు కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారా? తప్పక పెరుగుతారు! తేనెలో ఉండే అధిక కెలోరీలు బరువు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. పాలు సంపూర్ణ ఆహారం అనే విషయం మనందరికి తెల్సిందే! దాని వలన కూడా మన శరీరానికి అదనపు కెలోరీలు జతకూడుతాయి.

మీరు కనుక బరువు పెరగాలనుకున్నట్లైతే, ఈ రెండిటి మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో పొద్దుట కానీ లేదా నిద్రపోయే ముందు కానీ తీసుకోవడం అత్యుత్తమం. ఇలా చేయటం వలన మీరు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.

Want-To-Gain-Weight?-Heres-A-Simple-Tip!

నిద్రపోయే ముందు పాలు తీసుకుంటే మీ శరీరానికి కెలోరీలు చేకూరుతాయి. మీరు తీసుకునే కెలోరీల మొత్తం, మీరు నడక, మెట్లు ఎక్కటం, వ్యాయామం చేయడం, పడుకోవడం మొదలైన వివిధ దైనందిన కార్యక్రమాల కొరకు ఖర్చు పెట్టే కెలోరీల కంటే అధికంగా ఉంటే మీ బరువు దానంతట అదే పెరుగుతుంది.

వెన్నతీయని పాలలో (హోల్ మిల్క్) కొవ్వుల శాతం అధికంగా ఉండటం వలన, మీరు వీటిని వినియోగిస్తే అది ఇచ్చే అధిక కెలోరీల వలన త్వరగా బరువు పెరుగుతారు. ఒక కప్పు వెన్నతీయని పాలలో 150 కెలోరీల శక్తి ఉంటుంది.

ఇతర బరువును పెంచే ఆహారపదార్థాలతో పాటుగా రోజుకు రెండు కప్పుల పాలు తీసుకుంటే, వారానికి అరకేజీ వరకు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వెన్నతీయని పాలకు మన ఇష్టానికి అనుగుణంగా పలు రకాలుగా రుచిని జోడించి వినియోగించవచ్చు. ఉదాహరణకు, మీకు చాక్లెట్ సువాసన అంటే ఇష్టమైతే కనుక చాక్లెట్ పొడిని కలుపుకుని తాగవచ్చు. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వలన మీరు తీసుకునే కెలోరీల సంఖ్య కూడా పెరుగుతుంది.

అంతేకాకుండా, వెన్నతీయని పాలను బ్లూ బెర్రీస్, బాదం పప్పు మొదలైనటువంటి వివిధ రకాల తాజా పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ తో కలిపి బ్లెండ్ చేసి స్మూథీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఓట్ మీల్ లేదా క్వినోవాలతో పాయసం మాదిరిగా కూడా చేసుకుని ఆరగించవచ్చు. కనుక పొద్దుట లేదా పడుకునే ముందు, పాలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన మీరు తీసుకొనే కెలోరీలు ఆరోగ్యకరంగా పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Want-To-Gain-Weight?-Heres-A-Simple-Tip!

తేనెలో ఎన్నో రకాల పోషకాలతో పాటు అధిక కెలోరీలు ఉంటాయి. దీనిని బరువు తగ్గించే సాధనంగా కూడా వినియోగించవచ్చు. గోరువెచ్చని నీళ్లల్లో తేనెతో పాటుగా నిమ్మరసం లేదా దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన అదనపు కెలోరీలు లేదా కొవ్వులు సులువుగా కరుగుతాయి.

అదే తేనేని పాలతో కలిపి తీసుకుంటే బరువు పెరగటానికి దోహదపడుతుంది. తేనెలో సుమారుగా 80% చెక్కెరలు, 2% విటమిన్లు మరియు ఖనిజాలు, మిగిలిన శాతం నీరు ఉంటాయి. దీనిలో ఎటువంటి కొవ్వులు ఉండవు.

అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉండటం వలన, అధికంగా వ్యాయామం చేసేవారికి తేనె అద్భుతమైన శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా తేనేని అధికంగా సేవిస్తే దానిలో ఉండే కొవ్వులు మన శరీరంలో కొవ్వులుగా మారి నిల్వ ఉంటాయి. తేనెలో సహజమైన చెక్కెరలు ఉంటాయి కనుక ఇవి మన శరీరంలో చెడు కొవ్వులుగా మారవు.

ఇప్పుటివరకు తేనె మరియు పాలను విడివిడిగా సేవిస్తే కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారు.వీటిని కలిపి తీసుకోవడం వలన మరీంత రుచి మరియు ప్రయోజనాలు చేకూరుతాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి మిశ్రమానికి, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ మరియు దాల్చినచెక్క పొడి కలిపితే దాని సువాసన పెరగడంతో పాటుగా మనలో తాగాలనే ఆశక్తిని పెంచుతుంది.

Want-To-Gain-Weight?-Heres-A-Simple-Tip!

పాలు మరియు తేనెల మిశ్రమాన్ని తెల్లవారి కాకుండా నిద్రపోయేముందు తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతుంది. నిద్రపోయే సమయంలో మన జీర్ణప్రక్రియ వేగం మందగించడం వలన, శరీరం ఎక్కువ కెలరీలను గ్రహించి బరువు పెరుగుదల త్వరగా జరిగేటట్టు చేస్తుంది.

అంతేకాకుండా మన బరువు పెరుగుదల ప్రస్ఫుటంగా ఉండాలంటే మనం తీసుకునే పాలు తేనెల మిశ్రమం యొక్క పరిమాణం అధికంగా ఉండాలి. ఎక్కువ సార్లు తీసుకోవాలి. తేనెను వేడిగా లేదా బాగా మరిగిన పాలలో కాకుండా గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత వద్ద తేనె జిగురుగా, మన శరీరం జీర్ణం చేసుకోవడానికి వీలులేని విధంగా మారుతుంది.


దీని వలన కడుపునొప్పి, మలబద్దకం, మలవిసర్జన సమయంలో నొప్పి లేదా ఇతర జీర్ణప్రక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కనుక మన జీవక్రియలలో ఎటువంటి అవాంఛనీయ సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే, మీ రుచికి అనుగుణంగా చల్లని లేదా గోరువెచ్చని పాలలో తేనెను కలపాలి. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు మొదలైన వాటితో కూడిన ఆహారంతో పాటుగా తేనె మరియు పాల మిశ్రమాన్ని మీ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవడం వలన మీ బరువు తప్పకుండా పెరుగుతుంది. అంతేకాకుండా సంపూర్ణ ఆహారం తీసుకోవడం వలన కలిగే ఇతర ప్రయోజనాలను మీరు పొందుతారు. ఇది బరువు పెరగాలనుకునేవారికి అద్భుతమైన వరమని నిర్వివాదంగా చెప్పవచ్చు.

English summary

Want-To-Gain-Weight?-Here's-A-Simple-Tip!

Want-To-Gain-Weight?-Here's-A-Simple-Tip! Drinking milk and honey helps you gain weight naturally. Milk and honey also help in boosting your health apart from providing you calories and they are loaded with a lot of benefits.
Desktop Bottom Promotion