For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు బరువు పెరగడానికి కారణం ఈ 10 మార్నింగ్ హ్యాబిట్స్

|

సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం మూలంగా బరువును నియంత్రిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించవచ్చునని మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అసాధారణంగా బరువు పెరుగుతున్నట్లు మీరు గ్రహించిన ఎడల, మీ జీవనశైలి విధానాలలో లేదా దైనందిక కార్యకలాపాలలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు. క్రమంగా మీ బరువు అస్తవ్యస్త పోకడలకు గురై, పర్యవసాన దుష్ప్రభావాలకు దారితీయవచ్చు. ప్రధానంగా మీరోజు ప్రారంభంలో మీరు అనుసరించే విధానాలు, అలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణంగా మారవచ్చు. అవేమిటో తెలుసుకోవడం ద్వారా, మీ వెయిట్ లాస్ ప్రణాళికను సవ్యంగా కొనసాగించడానికి వీలు కుదురుతుంది. ఈ వ్యాసంలో బరువు పెరగడానికి దారితీసే ఉదయపు అలవాట్ల గురించిన వివరాలను అందివ్వడం జరిగింది. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

మనలో అనేకమంది తెలియకుండానే కొన్ని అనాలోచిత అలవాట్లను అనుసరిస్తూ ఉంటారు. కానీ అవి కూడా బరువు పెరగడానికి కారణంగా మారుతాయని గ్రహించలేకపోవచ్చు. కావున మీ ఉదయం అలవాట్లలో కొన్ని ఆరోగ్యకర మార్పులను చేర్చుకోవడం ద్వారా, మీ వెయిట్ లాస్ ప్రణాళికను సవ్యంగా కొనసాగించవచ్చునని చెప్పబడుతుంది.

కొన్ని అసంబద్దమైన రోజూవారీ అలవాట్లు, మీ సాధారణ జీవక్రియలకు అంతరాయం కలిగిస్తాయి. క్రమంగా ఆ ప్రభావం రోజంతా పడుతుంది, తద్వారా శక్తిని ఖర్చు కాకుండా నిరోధించి, కాలరీల నిలుపుదలకు కారణంగా మారుతాయి. సరైన ఆహార ప్రణాళిక మరియు వ్యాయామం ఒక మంచి ఆలోచనగా ఉంటుంది. కానీ మీరు రోజూవారీ విధానాలలో కొన్ని తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా, మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. బరువు పెరగడానికి కారణమయ్యే ఈ ఉదయపు దురలవాట్ల గురించిన మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

1. సరైన నీటిని తాగకపోవడం :

1. సరైన నీటిని తాగకపోవడం :

ఉదయాన్నే శరీరానికి సరిపడా నీళ్ళు తాగడమనేది తప్పనిసరిగా అలవరచుకోవలసిన అలవాటు. మీరు బరువు తగ్గడం గురించిన ఆలోచన చేస్తున్నవారైతే, మీకు సూచించదగిన ఉత్తమ మరియు సులభమైన మార్గం, పరగడుపునే ఒకటి లేదా రెండు గ్లాసుల వెచ్చని నీటితో రోజును ప్రారంభించడం. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తీసుకోవడం ద్వారా, మీ జీర్ణవ్యవస్థను శుభ్రపరచటం మరియు మీ జీవక్రియల పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కొంతమందిలో ఆకలి మరియు క్యాలరీలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కావున, మీ రోజును ఒక గ్లాసు వెచ్చని నీటితో ప్రారంభించండి. క్రమంగా వేగవంతమైన బరువు నష్టాన్ని ప్రోత్సహించడానికి రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచండి.

2. అల్పాహారంగా నిల్వచేసిన లేదా జంక్ ఫుడ్స్ మీద ఆధారపడడం :

2. అల్పాహారంగా నిల్వచేసిన లేదా జంక్ ఫుడ్స్ మీద ఆధారపడడం :

అల్పాహారం కొరకు నిల్వచేసిన లేదా జంక్ లేదా ఫాస్ట్ ఫుడ్స్ మీద ఆధారపడడం అనేది అనేకమంది వ్యక్తులకు సర్వసాధారణమైన విషయంగా ఉంటుంది. మీరు బరువు తగ్గడం గురించిన ఆలోచన చేస్తున్నవారిగా, మరియు మీ ఆరోగ్యం మీద దృష్టి కలిగిన వారిగా ఉన్న ఎడల, ఎట్టిపరిస్థితులలో కూడా నిల్వ చేసిన లేదా జంక్/ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించుకోవడమే మంచిదిగా సూచించబడుతుంది. అంతేకాకుండా డీప్ ఫ్రైడ్ మరియు నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోవడం మూలంగా, అవి మీ జీవక్రియల మీద ప్రభావాన్ని చూపి శరీరంలో కాలరీల నిలుపుదలకు కారణమవుతుంది. ఫలితంగా ఆ ప్రభావం మీ బరువు అసమతుల్యతలకు కారణమవుతుంది. ఇవి అధిక మొత్తాలలో, చక్కెర మరియు ఉప్పును కలిగి ఉండి, శారీరిక ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపి, హార్మోనులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా, ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఈ నిల్వ చేసిన ఆహార పదార్ధాలు మీ ఆహార కోరికలను పెంచుతాయి. మరియు అతిగా తినడానికి దారితీస్తుంది. కావున వీటికి బదులుగా, పండ్లు, ఓట్ మీల్, గింజలు మొదలైన ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయాలను కలిగి ఉండాల్సిందిగా సిఫారసు చేయబడుతుంది.

3. అల్పాహారం తీసుకోకపోవడం :

3. అల్పాహారం తీసుకోకపోవడం :

అల్పాహారం అనేది రోజులో ముఖ్యమైన భోజనంగా చెప్పబడుతుంది. మీ దేహం సక్రమంగా పనిచేయడానికి మరియు శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్ని స్థిరీకరించడానికి సహాయపడే శక్తి స్థాయిలని పెంపొందించడంలో అల్పాహారం కీలక బాధ్యతను పోషిస్తుంది. అల్పాహారం తీసుకోకపోవడం అనేది బరువు అసమతుల్యతలకుగల మరో ప్రధానమైన తప్పిదంగా చెప్పబడుతుంది. ఇది మీ జీవక్రియలమీద ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మరియు శరీరం యొక్క కొవ్వు స్థాయిలను కరిగించే ప్రక్రియను తగ్గిస్తుంది. ఉదయంపూట సరైన అల్పాహారం తీసుకోకపొతే, మీరు రోజులో అనారోగ్యకర ఆహార నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా, మంచి అల్పాహారాన్ని అనుసరించడమనేది, మీ అవాంఛనీయ ఆహార కోరికలను తగ్గిస్తుంది. మరియు రోజు మొత్తం అధిక ఆకలిని నిరోధించడానికి కూడా సహాయపడుతుంది.

4. ఉదయపు సూర్యకాంతిని సంగ్రహించకపోవడం :

4. ఉదయపు సూర్యకాంతిని సంగ్రహించకపోవడం :

మీరు తగినంత ఉదయపు సూర్యకాంతిని పొందలేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణంగా ఉంటుందని తెలుసా ? ఉదయం సూర్యుడి నుండి వెలువడే కిరణాలు ఆరోగ్యకరమైన D విటమిన్ కలిగి ఉండి, శరీర జీవక్రియల కార్యకలాపాలను పెంచడంలో శరీరానికి తగిన శక్తిని సమకూర్చగలదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యకాంతికి శరీరాన్ని బహిర్గతం చేయడం ద్వారా, BMI ను అదుపులో ఉంచి, మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదని చెప్పబడింది.

5. వ్యాయామం చేయకపోవడం :

5. వ్యాయామం చేయకపోవడం :

రోజులో క్రమం తప్పకుండా వ్యాయామాన్ని అనుసరించడం మూలంగా, అధిక కేలరీలు కరిగించబడి శరీరానికి సరైన శక్తి స్థాయిలు విస్తరించబడి బరువు నిర్వహణలో తోడ్పడుతుంది. కావున ఎట్టిపరిస్థితుల్లో రోజూవారీ వ్యాయామాన్ని నిర్వహించడం ఉత్తమంగా సూచించబడుతుంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఖాళీ కడుపుతో ఉదయంపూట వ్యాయామం చేయడం కారణంగా, శరీరంలో అధిక మొత్తాలలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి, క్రమంగా బరువు నిర్వహణలో ఎంతగానో సహాయం చేస్తుంది. ప్రతి ఉదయం ఖచ్చితంగా జిమ్ వెళ్లాలని నియమమేమీ లేదు. కానీ మీ వర్క్ అవుట్ రొటీన్లో భాగంగా, కనీసం వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ మరియు జాగింగ్ వంటివాటిలో మీసమయానికి అనుగుణంగా అనుసరిస్తూ, కాలరీలను కరిగించేలా ప్రణాళికలు చేసుకోవలసి ఉంటుంది.

6. ఎక్కువగా నిద్రపోవడం :

6. ఎక్కువగా నిద్రపోవడం :

రోజులో కనీసం ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోవడమనేది బరువు పెరుగుదలతో ముడిపడి ఉంటుందని మీకు తెలుసా ? వాస్తవానికి రోజులో 7 నుండి 8 గంటల నిద్ర అనేది, శరీర జీవక్రియల వ్యవస్థకు ప్రామాణికంగా సూచించబడుతుంది. ఇది శారీరిక ఆరోగ్యం పరంగా మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పబడుతుంది.

కానీ రోజులో 10 గంటలకన్నా అధికంగా నిద్రపోవడం, మీ బాడీ మాస్ ఇండెక్స్ మీద ప్రభావం చూపుతుంది. అధికంగా నిద్రపోవడం మూలంగా మీ అల్పాహారం టైమింగ్ ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి అల్పాహారం తప్పించడానికి కూడా కారణమవుతుంది. క్రమంగా ఈ అలవాటు, తదుపరి రోజుల్లో మీ జీవక్రియలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

7. అల్పాహారం అత్యల్పంగా తీసుకోవడం :

7. అల్పాహారం అత్యల్పంగా తీసుకోవడం :

బరువు పెరగడాన్ని ప్రభావితం చేయగల చెత్త అలవాట్లలో ఇది కూడా ఒకటి. వాస్తవానికి అల్పాహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ డైట్ సిఫారసు చేయబడుతుంది. పోషకాలు తక్కువగా ఉండేలా అల్పాహారాన్ని తీసుకోవడం, లేదా అత్యల్ప మోతాదులో అల్పాహారాన్ని కలిగి ఉండడం కూడా మీ జీవక్రియలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి ఆదర్శవంతమైన అల్పాహారం 500 నుండి 600 కేలరీల మధ్యలో ఉండాలని సూచించబడుతుంది. అందులో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఈ పోషకాలు మీ బరువు నిర్వహణలో సహాయం చేస్తాయి.

కావున అల్పాహారం విషయంలో ఏమరపాటు తగదు.

8. అల్పాహారం తీసుకోవడానికి ఎక్కువసేపు వేచిఉండటం :

8. అల్పాహారం తీసుకోవడానికి ఎక్కువసేపు వేచిఉండటం :

అల్పాహారం తినడానికి చాలా ఎక్కువ సమయం వేచి ఉండటం మూలంగా కూడా బరువు పెరుగుతారు. శారీరిక విధులను క్రియాత్మకం చేయడానికి, మీ దేహానికి తగినంత శక్తి స్థాయిలు అవసరమవుతాయి. అలా కాకుండా, ఆకలి వేస్తున్నా కూడా సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోకపోవడం మూలంగా, మీ పొట్ట ఖాళీగా అనిపిస్తుంది. మరియు దీనికి ప్రతిస్పందనగా ఆమ్లరసాల ఉత్పత్తిని పెంచుతుంది. క్రమంగా ఇది పొట్టలో పుండ్లు (అల్సర్స్) వంటి లక్షణాలకు దారితీస్తుంది. కావున, బెడ్ నుండి దిగిన మొదటి గంటలోపే ఏదో ఒకటి తినేలా ప్రణాళికలు చేసుకోండి.

9. అధిక ప్రోటీన్ లేని అల్పాహారం :

9. అధిక ప్రోటీన్ లేని అల్పాహారం :

ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవడం మూలంగా, మీ పొట్ట మద్యాహ్నం వరకు నిండుగా ఉండేలా చూడడంలో సహాయం చేస్తుంది. ఇది మీ కోరికలను అరికట్టేందుకు మరియు బరువు నిర్వహణలో అత్యుత్తమంగా సహాయం చేస్తుంది. అధిక ప్రోటీన్ తో కూడిన అల్పాహారం తీసుకోవడం మూలంగా, శరీరంలో ఆరోగ్యకర కొవ్వు పెరుగుదలతో సంబంధం కలిగి ఉండి జీవక్రియలు మెరుగుపడడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఒక సాధారణ ప్రోటీన్ ఆధారిత అల్పాహారం తీసుకునే వారిలో శరీర బరువు కూడా అదుపులో ఉంటుందని తేలింది.

10. అసంబద్ద ఆహారపు అలవాట్లు :

10. అసంబద్ద ఆహారపు అలవాట్లు :

కొందరు ఉదయాన్నే అసంబద్ద ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఉదాహరణకు, రాత్రి మిగిలిన ఆహారాన్ని తీసుకోవడం, శీతల పానీయాలు సేవించడం, ధూమపానం మొదలైనవి శరీర జీవక్రియల మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీర్ఘకాలిక అలవాటు కారణంగా, అనేక శారీరిక వైద్య పరిస్థితులను ఎదుర్కొనవలసి రావొచ్చు. ఉదాహరణకు బరువు పెరగడం, హార్మోనుల అసమతౌల్యం మొదలైనవి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

10 Morning Habits That Cause Weight Gain

If your weight loss efforts are going waste, there is a chance you are following the wrong practices right at the start of the day. The wrong morning habits that you have been following can interfere with your normal metabolic activity. Not drinking water, skipping breakfast, not getting morning sunlight, oversleeping, etc., are morning habits that cause weight gain.
Desktop Bottom Promotion