For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొడల మద్య కొవ్వు కరిగించే హోం రెమెడీస్

|

దృడమైన, ఆరోగ్యకరమైన తొడలు కావాలని ప్రతి ఒక్కరి ఆకాంక్షగా ఉంటుంది. అవునా ? ఇటువంటి తొడలు వ్యక్తి ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. క్రమంగా ఈ కథనంలో, ఇంట్లోనే తొడ చుట్టూ చేరిన కొవ్వును తగ్గించడం మరియు తొడలను దృడంగా చేయడం గురించిన వివరాలను పొందుపరచడం జరిగింది.

వాస్తవానికి తొడలో అధిక స్థాయిలో కొవ్వు పేర్కొని పోవడమనేది పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పురుషులు కూడా తొడలు స్లిమ్ గా, పటిష్టంగా చేసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఇది మనిషి నడకలో కూడా మార్పును తీసుకుని వస్తుంది కాబట్టి. అలాగే, పుట్టిన సమయం నుండి ఆరు సంవత్సరాల వయస్సు వరకు, అమ్మాయిలు మరియు అబ్బాయిలలో ఉండే కొవ్వు కణాల సంఖ్య మరియు పరిమాణం శరీరంలోని కొవ్వుకు సమానంగా పెరుగుతుంది. కానీ ఆ తర్వాత శరీరంలో జరిగే అనూహ్య పరిణామాలు, జీవనశైలి, ఆహార ప్రణాళికల వంటి అనేక కారణాల కారణంగా పసితనంలో కూడా అనేకమంది పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారని మనకు తెలిసిన విషయమే. కానీ, ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రతరం అయితే, అది క్రమంగా జీవక్రియల మీద ప్రభావం చూపి గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవ సంబంధిత సమస్యలకు సైతం దారితీస్తుంది. కావున, జాగ్రత్త తప్పనిసరి.

 

Reduce Thigh Fat

ఏది ఏమైనా వయసు పెరిగే కొలదీ, హార్మోనుల సమస్యలు, జీవన శైలి ప్రమాణాల కారణంగా తొడల చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా మహిళలలో పిరుదులు, తొంటి ప్రాంతాలలో, మరియు పురుషులలో పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు చేరడం జరుగుతుంటుంది. స్త్రీ పురుషులిద్దరితో పోలిస్తే మహిళలలో అధిక శాతం కొవ్వు నిక్షేపాలు పేరుకుని పోవడం ఉంటుంది. ఎందుకంటే, ఎనిమిదేళ్ళ వయస్సు తరువాత, బాలురతో పోల్చి చూసినప్పుడు బాలికలలో హార్మోనుల స్థాయిలు, జీవనశైలి ప్రమాణాల నేపధ్యంలో ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. క్రమంగా శరీరంలో కొవ్వు పేర్కొనిపోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణంస్త్రీల హార్మోన్ స్థాయిలలో జరిగే గణనీయమైన మార్పులే ఎక్కువ కారణమవుతుందని చెప్పబడింది.

తొడలలో గణనీయంగా చేరే కొవ్వు కారణంగా మహిళలు అనుభవించే ఈ అసౌకర్యం మాటలలో చెప్పలేనిది. ఇది తొడల మీద చర్మాన్ని పూర్తిగా సాగేలా చేసి, డింపుల్స్ కనిపించేలా చేస్తుంది. ఈ అదనపు కొవ్వు నిల్వలు చర్మం కింద ఉండే అనుసంధాన కణజాలాల గుండా నెట్టబడడం జరుగుతుంది. పురుషుల్లో తొడల భాగంలో సెల్యులైట్ ఎక్కువగా కనిపించేలా ఉండదు. ఎందుకంటే ఇది తరచుగా వారిలో నడుము లేదా ఉదర భాగాలలో కనబడుతుంది.

మీ తొడలు మరియు శరీరంలోని ఇతర భాగాల నుండి కొవ్వును తరిగించే క్రమంలో భాగంగా ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, జీవన శైలి విధానం మరియు వ్యాయామాల కలయిక అవసరమవుతుంది. క్రమంగా, తొడలలో చేరిన కొవ్వుని తగ్గించుకునే విధానాల గురించిన సమగ్ర సారాంశాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. .

ఈ వ్యాసం ప్రధానంగా మీ జీవన శైలి ప్రమాణాలలో మార్పులను సూచిస్తుందని గుర్తుంచుకోండి.

1. మీ శరీరాన్ని హైడ్రేట్ చేయండి :

1. మీ శరీరాన్ని హైడ్రేట్ చేయండి :

మీ శరీరాన్ని నీటితో నింపి హైడ్రేట్ చేయడం ద్వారా, శరీరం డీహైడ్రేషన్ సమస్యకు దూరంగా ఉంటుంది. ఇది హానికరమైన విషతుల్యాలను బయటకు నెట్టివేయడానికి దోహదపడుతుంది, మరియు కణాలకు పోషకాలను రవాణా చేయడానికి ఉపకరిస్తుంది. ఆరోగ్యకరమైన తొడల కోసం రోజూలో కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి.

సోడాలు, ఎనర్జీ డ్రింకులు లేదా సాంద్రీకృత రసాలను కలిగి ఉన్న పానీయాలను పక్కన పెట్టండి. అవి ఎటువంటి ఉపయోగం లేకపోగా, దుష్ప్రభావాలను మాత్రం అధికంగా కలిగి ఉంటాయి. వీటిలో అధిక శాతంలో క్యాలరీలు మరియు చక్కెరలు పుష్కలంగా నిండి ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం మూలంగా మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుకుంటాయి. వీటికి బదులుగా నేరుగా పండ్ల రసాలను, కొబ్బరి నీళ్ళు వంటి వాటిని అనుసరించడం నూటికి నూరుశాతం మంచిది. భోజనానికి కనీసం 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీటిని తాగండి, మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతికి లోనుకావడం మూలాన, ఆహారం మీద కోరికలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతాయి. ఈ అలవాటు, తొడ కొవ్వుతో పాటుగా, మొత్తం శరీర కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తుంది.

2. సాధారణ పిండిపదార్థాలను తగ్గించడం :
 

2. సాధారణ పిండిపదార్థాలను తగ్గించడం :

తొడ ప్రాంతంలో చేరే కొవ్వు విషయానికి వస్తే సాధారణ కార్బోహైడ్రేట్లు కూడా మీకు అత్యంత హానికరంగా ఉంటాయని చెప్పబడింది. ఇవి ఫైబర్ (పీచు) నిక్షేపాలలో తక్కువగా ఉండి, త్వరగా జీర్ణం కావడం మూలంగా రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరిగడానికి దారితీస్తాయి. అంతేకాకుండా ఆహారం అధికంగా తీసుకునేలా ప్రేరేపిస్తాయి. మరోవైపు, పిండిపదార్థాలను నియంత్రిత వినియోగంలో తీసుకుంటే మీకు మంచిదిగానే చెప్పబడుతుంది. ఎందుకంటే అవి మీ శరీరం ద్వారా మరింత నెమ్మదిగా శోషించబడతాయి. క్రమంగా ఇవి మీ కడుపు నిండిన అనుభూతికి లోను చేసి, తరచుగా ఆహారం మీదకు మనసు వెళ్ళకుండా చేస్తుంది. సంక్లిష్ట పిండిపదార్ధాలకు ఉదాహరణగా ధాన్యాలు, బ్రౌన్ రైస్, గోధుమలు, ఓట్స్, మొదలైనవి ఉంటాయి. ఈమధ్య ఓట్ మీల్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. వీరికి మరొక ప్రత్యామ్నాయంగా ఓట్స్ నానబెట్టి, అందులో డ్రైఫ్రూట్స్ వేసుకుని, సరైన మోతాదులో ముడి తేనెను జోడించుకుని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇది మీకు రుచితో పాటు, ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుస్తుంది.

3. పండ్లు మరియు కూరగాయలు :

3. పండ్లు మరియు కూరగాయలు :

పండ్లు మరియు కూరగాయలు ఎప్పటికీ ఉత్తమ ఆహారాలుగానే ఉంటాయి. ఎందుకంటే ఇవి తొడ భాగంలోని కొవ్వును తగ్గించడానికి సరిపోయేలా, తక్కువ కేలరీలతో మరియు అధిక పోషకాలతో నిండుకుని ఉంటాయి. పైగా వీటిని పెద్ద మొత్తాలలో తీసుకున్నా చెప్పుకోదగిన దుష్ప్రభావాలు ఉండవు. ఏది ఏమైనా నియంత్రిత పద్దతిలోనే ఆహార ప్రణాళికలను అనుసరించాలని గుర్తుంచుకోండి. పైగా ఇవి ఫైబర్ నిక్షేపాలలో అధికంగా ఉన్న కారణంగా దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఊతమిస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్ మరియు సాస్ జోడించకుండా, తాజాగా సూప్స్ మరియు సలాడ్లలో జోడించడం ద్వారా తీసుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది. పండ్లను పండ్ల రసాల కన్నా, నేరుగా తీసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఒక వేళ పండ్ల రసాలను అనుసరించాలని భావిస్తే, తగిన మొత్తాలలోనే ఎటువంటి కృత్రిమ చక్కెరల జోలికి పోకుండా తీసుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.

4. ప్రోటీన్ కొంచం ఎక్కువ తీసుకోండి :

4. ప్రోటీన్ కొంచం ఎక్కువ తీసుకోండి :

ప్రోటీన్ నిజానికి ఒక స్థూల పోషకంగా ఉండనుంది. ఇది మీకు తక్కువ క్యాలరీలను శోషించుకునేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా ప్రోటీన్, మీ తొడలను ఆరోగ్యకరంగా పటిష్టంగా ఉంచేందుకు మీరు అనుసరించే విధానాలను సులభతరం చేస్తుంది. మొత్తం శరీరంలో కొవ్వును తగ్గించడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వారు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, అధిక ప్రోటీన్ ఆహారాలు తీసుకునే వ్యక్తులు ఎక్కువ కేలరీలను బర్న్ చేయగలుగుతున్నారని చెప్పబడింది. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం మూలంగా ఇది మీ కణజాలాలను నిర్మించడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. క్రమంగా, వ్యాయామం తోడైన పక్షంలో చక్కటి శరీరాకృతిని పొందగలిగేలా మీకు ఉపకరిస్తుంది. కానీ ప్రోటీన్ ఆధారిత కృత్రిమ పద్దతులను ఆశ్రయించకుండా, ఆహార పదార్ధాలను నియంత్రిత పద్దతులలో అనుసరించడమే మేలు. తరచుగా మీ ఆహార ప్రణాళికలో చేపలు, గుడ్డు వంటివి ఉండేలా చూసుకోండి.

5. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తినండి :

5. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తినండి :

సాల్మన్, మాకెరెల్, హెర్రింగ్ మొదలైన చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక మొత్తాలలో ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి మృదువైన కణజాలం అందించడానికి సహాయం చేస్తూ, చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది. తొడల్లో ఉండే సెల్యులైట్ విచ్చిన్నం గావించడానికి చేపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సహాయం చేస్తాయి. మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న కారణాన చర్మ కణజాలాన్ని మరమ్మత్తు చేయడానికి కీలకపాత్ర పోషిస్తాయి. క్రమంగా సెల్యులైట్ స్థాయిని తగ్గించేలా ప్రోత్సహిస్తూ తొడల ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది. కావున వారంలో కనీసం 4 నుండి 5 మార్లైనా చేపల్ని తీసుకునేలా ప్రణాళికలు చేయాలని సూచించబడుతుంది.

6. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి :

6. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి :

ఉప్పు శరీరంలో నీటి నిలుపుదలను అధికం చేస్తుంది. కావున, వీలైనంత వరకు ఉప్పును తగ్గించి ఉండేలా ఆహార ప్రణాళికను అనుసరించాలని గుర్తుంచుకోండి. మీరు ఎంత ఎక్కువ ఉప్పు తీసుకుంటే, అంత నీరు శరీరంలో పేరుకుంటుందని గుర్తుంచుకోండి. ఇది క్రమంగా రక్తపోటు, గుండె మరియు మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. కొవ్వు పరంగా, ప్రధానంగా పొత్తి కడుపు, తొడలు, నడుము, తొంటి భాగాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, రోజులో 2,300 మిల్లీగ్రాముల సోడియం మాత్రమే శరీరానికి అవసరం ఉంటుంది. ఈ మొత్తం కన్నా అధికంగా తీసుకోవడం హార్మోనులు మరియు జీవక్రియల మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.

7. నడక (ట్రెడ్ మిల్) :

7. నడక (ట్రెడ్ మిల్) :

నడక తొడలను స్లిమ్ చేయడంలో సహాయం చేస్తుందా ? అంటే, అవుననే చెప్పాలి. ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది- ఒకటి, ఇది శరీరం యొక్క దిగువ భాగం స్లిమ్ చేసేందుకు సహాయం చేస్తుంది. రెండు, కాలరీలను కరిగించడానికి సహాయం చేస్తుంది. మీరు ముందుగా నడకను సాధారణ వేగంతో ప్రారంభించి, నెమ్మదిగా వేగం పెంచుతూ వెళ్ళండి. ఏదిఏమైనా ఒక లక్ష్యంతో ప్రణాళికలు చేసుకుని అనుసరించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. పని ఒత్తిళ్ళ కారణమంగా నడకకు సమయాన్ని కేటాయించలేని వారు, ఇంట్లోనే ఒక ట్రెడ్మిల్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. నడక, మీ తొడల మీద ఒత్తిడిని పెంచి, కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది. కావున రోజులో కనీసం 30 నిమిషాల కనీస నడకని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగండి. క్రమంగా ఆ నిడివిని పెంచుతూ ముందుకు సాగండి.

8. స్క్వాట్స్ (గుంజీళ్ళు) :

8. స్క్వాట్స్ (గుంజీళ్ళు) :

స్క్వాట్స్ తొడలు, హిప్స్ మరియు పిరుదులలో చేరిన అదనపు కొవ్వును తొలగించడానికి సూచించదగిన ఉత్తమమైన వ్యాయామంగా చెప్పబడుతుంది. స్క్వాట్స్ కండర నిర్మాణానికి సహాయం చేస్తూ, క్రమంగా ఆరోగ్యకర తొడల నిర్మాణానికి సహాయం చేస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్క్వాట్స్ అనుసరించడం ద్వారా తొడల భాగంలోని సెల్యులైట్ కరిగించడానికి ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పబడింది.

మారుతున్న జీవనశైలి ప్రామాణికాల ప్రకారం, రోడ్ సైడ్ జంక్ ఫుడ్, కార్బోనేటెడ్ పానీయాల మీద అధికంగా ఆధారపడడం జరుగుతుంది. ఇవి కృత్రిమ చక్కెరలను, అసంబద్ద పదార్ధాలను అధిక స్థాయిలో కలిగి ఉన్న కారణంగా శరీరానికి ఏమాత్రం సహాయం చేయకపోగా, అధిక స్థాయిలో దుష్ప్రభావాలను మాత్రం కలిగి ఉంటాయి. దానికి తోడు కలుషితమైన ఆహార పదార్ధాలు, మరియు నిల్వ చేసిన పదార్ధాలను తరచుగా తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు పేర్కొని పోవడం, లేదా వ్యాధుల బారిన పడడం జరుగుతూ ఉంటుంది. కావున వీలైనంత వరకు జంక్ ఫుడ్, హోటల్ భోజనాలు, కార్బోనేటెడ్ పానీయాలను తగ్గించడమే మంచిదని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. మరియు దైనందిక కార్యక్రమాలతో తీరికలేని పని ఒత్తిడి మూలంగా వ్యాయామానికి కూడా సరైన సమయాన్ని కేటాయించలేని స్థితిలోకి వెళ్తున్నారు. కావున ప్రధానంగా జీవనశైలి ప్రామాణికాల మీద దృష్టి సారించడం మంచిదిగా సూచించబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Reduce Thigh Fat At Home

As you age, the hormones trigger the accumulation of fat around the thighs, hips and buttocks of women and in the abdominal region for men. A combination of diet and exercise is required in order to lose fat from your thighs and other parts of the body. To reduce thigh fat have protein foods, drink more water, include walking and running in your daily routine.
Story first published: Friday, March 22, 2019, 15:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more