For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఇలాంటి పుష్ అప్స్ సరిగా చేయలేరు.. ఎందుకో తెలుసా...

|

మనలో కొంతమంది రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఉంటారు. అలా చేసే వారిలో ఎలాంటి పుష్ అప్స్ అయినైనా చాలా తేలిగ్గా చేసేస్తుంటారు. అలాంటి వ్యాయామంతో శరీరానికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది.

ఇలా చేయడం వల్ల ఆరోగ్య పరంగా అనేక ఫలితాలు ఉన్నాయి. బాడో టోండ్ గా కనిపించడం కూడా అందులో భాగమే. అయితే మనలో చాలా మంది సులభంగా పుషప్స్ చేసేందుకు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

జిమ్ ట్రైనర్ దీని గురించి శిక్షణ ఇస్తున్నప్పటికీ, కొన్నిసార్లు దీనిపై ఆసక్తి తగ్గిపోవడం లేదా జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో చాలా మంది పుషప్స్ చేయడాన్ని మానేస్తారు. అయితే అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

పుషప్స్ కు ముందు..

పుషప్స్ కు ముందు..

మనలో పుషప్స్ చేసే వారికి వార్మప్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఇలా వార్మప్ చేయడం వల్ల టైట్ గా ఉన్న కండరాలు కొద్దిగా లూజుగా మారిపోతాయి. దీని వల్ల సులభంగా ఎక్సర్ సైజ్ చేయగలరు. వార్మప్ అనేది మన శరీరాన్ని చాలా ఫ్లెక్సిబుల్ గా తయారు చేస్తుంది. అంతేకాదు ఎంత కష్టతరమైన వ్యాయామాలైన సులభంగా చేసేందుకు మన బాడీ సహకరిస్తుంది. ఎవరైతే వార్మప్ లేకుండా, గట్టి కండరాలతో పుషప్స్ లాంటివి చేస్తే.. మీరు కిందకు పడటం లేదా జారిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. అందుకే పుషప్స్ చేయడానికి ముందుగా కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు వార్మప్ చేయాలి.

శ్వాస సరిగా తీసుకోకపోవడం..

శ్వాస సరిగా తీసుకోకపోవడం..

వ్యాయామం చేసేటప్పుడు చాలా మంది చేసే పొరపాట్లలో ఇది ఒకటి. అదే శ్వాస తీసుకోకపోవడం. ఎక్సర్ సైజ్ చేసే సమయంలో ఎవరైతే శ్వాస బాగా తీసుకుంటారో వారికి ఫలితాలు అద్భుతంగా వస్తాయి. ఇలా శ్వాస సరిగా తీసుకుంటే, వారి బాడీలో ఆక్సీజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఫలితంగా గుండె కొట్టుకునే వేగం పెరిగి ఎక్కువ క్యాలరీలు కరిగించడానికి వీలవుతుంది. మీ రక్త ప్రసరణలో కూడా ఎక్కువ ఆక్సీజన్ ఉంటే, మీరు బాగా పర్ఫార్మ్ చేయగలుగుతారు.

సరైన తిండి తినకపోతే..

సరైన తిండి తినకపోతే..

ఉదాహరణకు బ్యాటరీ ఛార్జింగ్ లేకుండా ఫోన్ ఎలా అయితే పని చేయదో.. మన శరీరానికి కూడా సరైన తిండి లేకపోతే.. అది కూడా సరిగ్గా సహకరించదు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు పుషప్స్ చేస్తే, కొన్నిసార్లు దెబ్బలు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. మీ శరీరం బలంగా ఉండి, బాగా పెర్ఫార్మ్ చేయాలంటే, మీరు ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, ఇంకా ఇతర హెల్దీ న్యూట్రియెట్స్ ని మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

టైడ్ అయినప్పుడు..

టైడ్ అయినప్పుడు..

మీ కండరాలు అలసిపోయిన సమయంలో మీరు పుషప్స్ సరిగ్గా చేయలేకపోతారు. అందుకే మీరు చేసే వర్కౌట్ల నుండి అప్పుడప్పుడు విరామం తీసుకోవడం వల్ల, మీకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయితే మీరు వారమంతా వర్కౌట్స్ చేసే సమయంలో ఒకరోజు విరామం తీసుకుంటే మాత్రం మీరు చాలా చురుగ్గా వ్యాయామం చేయగలుగుతారు.

బరువులు ఎత్తకపోవడం..

బరువులు ఎత్తకపోవడం..

సాధారణంగా వ్యాయామంలో భాగంగా.. బరువులను ఎత్తడం ద్వారా, మీ శరీరంలోని కండరాలు బలంగా తయారవుతాయి. మీరు బాగా పని చేయగలుగుతారు. అంతేకాదు, మీకు దెబ్బలు తగిలే రిస్క్ కూడా తగ్గిపోతుంది. మీరు ఏదైనా మైదానంలో పరుగెత్తినంత సులభంగా పుషప్స్ చేయాలంటే, మీ కాళ్ల వెనుక, మరియు భుజాలకు సంబంధించిన వ్యాయామం చేయాలి.

సరైన భంగిమలో..

సరైన భంగిమలో..

ఏ వ్యాయామం అయినా సరైన యాంగిల్ లో చేయాలి. అది వదిలిపెట్టి మీరు ఎన్ని బరువులు ఎత్తినా.. ఎన్ని వ్యాయామాలు చేసినా.. మీ వర్కవుట్ల టెక్నిక్ సరిగ్గా లేకపోతే మీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే పుషప్స్ చేసేటప్పుడు మీ అరచేతులు భుజాల వెడల్పులో నేలని బలంగా ఆనించి ఉండాలి. మీ కోర్ కూడా చాలా బలంగా ఉండాలి. మధ్య భాగంలో మరింత నిటారుగా ఉండాలి.

గమనిక : ఈ వివరాలన్నీ ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం అందించాం. ఈ సమాచారమంతా కేవలం మీ అవగాహన కోసమే. కాబట్టి మీ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని గుర్తుంచుకోగలరు.

English summary

Can't do push-ups here are the 6 culprits

If you are unable to do push-ups despite practicing them regularly, here are six problems that may be hindering your push-ups.
Story first published: Thursday, December 3, 2020, 15:58 [IST]