For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపిఎల్ ఆటగాళ్ల డైట్ ఫాలో అవ్వండి... మీరూ ఫిట్ గా మారిపోండి...

|

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2021లో 14వ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో ఆటగాళ్లు ఫిట్ నెస్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వారు సంవత్సరాల కొద్దీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తారు. దీనంతటికీ కారణం వారు చేసే కఠినమైన వర్కవుట్లు.. కచ్చితంగా పాటించే డైట్. దీని వల్లే వారు అందమైన బాడీ షేప్ ను సైతం సొంతం చేసుకుంటారు.

ఇక విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లైతే ఫిట్ నెస్ కోసం ఏకంగా మాంసాహారాన్నే మానేశాడు. రోహిత్, ధోనీ, జడేజాతో పాటు ఇతర ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎలాంటి డైట్ మెయింటెన్ చేస్తారు.. మైదానంలో చురుకుగా ఉండేందుకు ఏదైనా ప్రత్యేక ఆహారం తీసుకుంటారా? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు 'హిట్ మ్యాన్'ఏమి చేస్తాడో చూసేయ్యండి...ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు 'హిట్ మ్యాన్'ఏమి చేస్తాడో చూసేయ్యండి...

విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ..

క్రికెట్ ఆటలో ఫిట్ నెస్ విషయానికొస్తే.. ఇప్పట్లో మొదటగా వినిపించే పేరు విరాట్ కోహ్లీ. టీమిండియా కెప్టెన్ గా వరుస విజయాలు సెంచరీల మీద సెంచరీలు అలవోకగా బాదే ఈ ఆటగాడు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్ మెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా మహమ్మారి కాలంలో క్రికెట్ మ్యాచులు లేనప్పటికీ, తన ఫిట్ నెస్ పై ఏ మాత్రం అశ్రద్ధ వహించలేదు. తన ఇంట్లోనే కఠినమైన వర్కవుట్లు చేశాడు. అందుకే ఇప్పుడు బెంగళూరు కెప్టెన్ గా మరోసారి మైదానంలో చురుకుగా అడుగు పెట్టబోతున్నాడు. 32 ఏళ్ల విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్ నెస్ గా ఉండేందుకు కఠినమైన డైట్ ప్లాన్ ను మెయింటెయిన్ చేస్తాడు. తను మాంసాహారం పూర్తిగా మానేశాడు. ఎక్కువగా కూరగాయలు, తాజా పండ్లను మాత్రమే తీసుకుంటాడు.

రోహిత్ శర్మ..

రోహిత్ శర్మ..

ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్న రోహిత్ శర్మ, ఫిట్ నెస్ విషయంలోనూ చాలా ఫోకస్ పెడతాడు. ఒకప్పుడు డైట్ అండ్ ఫిట్ నెస్ పై పెద్దగా శ్రద్ధ చూపని హిట్ మ్యాన్.. మ్యాచ్ లో ఎదురైన ఇబ్బందుల కారణంగా కఠినమైన వర్కవుట్లు, డైట్ ఫాలో అవ్వడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఉదయాన్నే కోడి గుడ్లు మరియు ఓట్స్, పాలను తీసుకుంటాడు. ఒకప్పుడు బాగా బొద్దుగా కనిపించిన రోహిత్ ఈ మధ్యన చాలా ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఈ ఆటగాడు కూడా మాంసాహారం జోలికి అస్సలు వెళ్లడట. ఇక భోజనం విషయానికొస్తే రెగ్యులర్ గా చపాతీలు, బ్రౌన్ రైస్ కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారట.

మహేంద్ర సింగ్ ధోనీ..

మహేంద్ర సింగ్ ధోనీ..

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తప్పుకున్నప్పటికీ ఫిట్ నెస్ పై ఏ మాత్రం ఫోకస్ తగ్గించలేదు. 39 ఏళ్ల వయసులోనూ పూర్తి ఫిట్ గా ఉండేందుకు తన బాడీలోని కొవ్వు కరిగించాలని బాగా నమ్ముతాడు. అందుకు అనుగుణంగా డైట్ ప్లాన్ చేస్తాడట. ధోని ఫిట్ గా ఉండేందుకు కేవలం వర్కవుట్లు మాత్రమే చేయకుండా.. ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ వంటివి ఎక్కువగా ఆడతాడట. వీటి వల్ల కంటి చూపు, ఏకాగ్రత పెరుగుతుందట. ఇక ధోని డైట్ విషయానికొస్తే.. ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతాడట. తాజా పండ్ల రసాలను, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటాడట.

ధోనీ డైట్ సీక్రెట్స్, వర్కవుట్లను ఫాలో అయితే మీకు సిక్స్ ప్యాక్ ఖాయం...!ధోనీ డైట్ సీక్రెట్స్, వర్కవుట్లను ఫాలో అయితే మీకు సిక్స్ ప్యాక్ ఖాయం...!

రవీంద్ర జడేజా..

రవీంద్ర జడేజా..

మరో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గుజరాతీ వంటలంటే చాలా ఇష్టమట. అయినప్పటికీ తన రెగ్యులర్ డైట్ మెనూలో కొవ్వు, పిండి పదార్థాలు, ఎక్కువ కేలరీలు ఉండే ఫుడ్ అవాయిడ్ చేస్తాడట. ఎందుకంటే మైదానంలో తాను పూర్తిగా ఫిట్ గా ఉండేందుకే తొలి ప్రాధాన్యత ఇస్తాడట. అందుకే తాను తీవ్రమైన వర్కవుట్లు చేస్తాడట. గంటలకొద్దీ జిమ్ లో గడుపుతాడట. అయితే జడేజా తన డైట్ మెనూలో ఎక్కువగా పాలు, పండ్ల రసాలు తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారట.

హార్దిక్ పాండ్య..

హార్దిక్ పాండ్య..

ఐపిఎల్ తో ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న క్రికెటర్ హార్దిక్ పాండ్య. ఈ ముంబై ఆటగాడు ఫిట్ నెస్ కోసం తీవ్రంగా కష్టపడతాడట. అలాగే తను తీసుకునే ఆహారంలో కూడా కచ్చితమైన మెనూ పాటిస్తాడట. పాండ్య ప్రతిరోజూ ఉదయాన్నే తాజా పండ్లను మరియు జీడిపప్పు గింజలను తీసుకుంటాడట. వీటితో పాటు కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ, పళ్లరసాలను రెగ్యులర్ గా తీసుకుంటాడట. మధ్యాహ్నం సమయంలో కూరగాయల సూప్, స్వీట్ కార్న్, టమోటో, బటర్ నాన్, రోటీ, బ్రెడ్ రోల్స్ పెరుగున్నం ఎక్కువగా తీసుకుంటాడట. సాయంత్రం స్నాక్ సమయంలో మాత్రం కచ్చితంగా తందూరి చికెన్ లాగించేస్తాడట. రాత్రికి రోటీ మరియు నాన్, పళ్ల రసం తీసుకుంటాడట.

డివిల్లీయర్స్..

డివిల్లీయర్స్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ డివిల్లీయర్స్ ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అదే సమయంలో డైట్ కూడా మెయింటెయిన్ చేస్తాడు. తను కూడా ఎక్కువగా ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని ఇష్టపడతాడట. అందులో భాగంగా ప్రతిరోజూ పాలు, గుడ్లు, ప్రోటీన్ షేక్స్ ను తీసుకుంటాడట. అదే సమయంలో తను ఫిట్ గా ఉండేందుకు రెడ్ వైన్ కూడా తీసుకుంటాడట.

English summary

Cricketers Diet You should to Add In Your Daily Routine

Here are the cricketers diet you should to add in your daily routine. Have a look
Story first published: Friday, April 9, 2021, 11:14 [IST]