For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HBDay Jr.NTR : జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి డైట్ ఫాలో అవుతారు... తన ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా...

ఆర్ఆర్ఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ డైట్ అండ్ ఫిట్ నెస్ రహస్యాలేంటో చూసెయ్యండి.

|

తెలుగు రాష్ట్రాల్లోని వారందరికీ ఆ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకని తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్న జూనియర్ గురించి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు.

Diet and Fitness Secrets of RRR Hero Jr.NTR in Telugu

తాతకు తగ్గ మనవడిగా నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోల్లో తన స్థానాన్ని సుస్థిరం కూడా చేసుకున్నాడు. తాజాగా RRR సినిమాలో కొమురం భీమ్ గా కనిపించి అదరగొట్టాడు.

Diet and Fitness Secrets of RRR Hero Jr.NTR in Telugu

వీటన్నింటిన సంగతి పక్కనబెడితే.. 'అశోక్', 'రాఖీ' వంటి సినిమాల్లో చాలా లావుగా ఉన్న తారక్ యమదొంగ సినిమాకొచ్చేసరికి చాలా సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత 'టెంపర్' సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్ తో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ లో మరింత ఫిట్ కనిపించాడు. అయితే తను ఇలా పూర్తి ఫిట్ గా ఉండేందుకు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు.. తన ఫిట్ నెస్ రహస్యాలేంటో మీరు తెలుసుకోండి... తనలాగా ఫిట్ గా తయారవ్వండి...

RRR Fashion:తారక్, చెర్రీ డ్రస్సుల్లో ఏవి బాగున్నాయో మీరే చెప్పండి...RRR Fashion:తారక్, చెర్రీ డ్రస్సుల్లో ఏవి బాగున్నాయో మీరే చెప్పండి...

9 కేజీల కండలు..

9 కేజీల కండలు..

జక్కన్న డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ సుమారు 9 కేజీల వరకు కండలను పెంచడం విశేషం. కొమురం భీమ్ పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ తన డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారట. ఫుడ్ విషయంలోనూ చాలా కఠినంగా ఉండేవారట. ప్రతిరోజూ 3 గంటలకొకసారి ఫుడ్ తీసుకుంటూ ఉండేవారట.

ప్రోటీన్స్ ఎక్కువగా..

ప్రోటీన్స్ ఎక్కువగా..

తన డైట్ లో భాగంగా, ఆయన రెగ్యులర్ గా ఎగ్ వైట్స్, ఉడకబెట్టిన కూరగాయలను ఎక్కువగా తినేవారట. వేడి వేడి చికెన్ ను ఎక్కువగా తీసుకునేవారట. అన్నింటికంటే ముఖ్యంగా తన డైట్లో భాగంగా ప్రోటీన్లు, కార్బ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకునేవారట.

RRRలో నాటు స్టెప్పులే కాదు.. అదిరేటి డ్రస్సులు కూడా..RRRలో నాటు స్టెప్పులే కాదు.. అదిరేటి డ్రస్సులు కూడా..

ఎనర్జీ పెంచుకునేందుకు..

ఎనర్జీ పెంచుకునేందుకు..

ఎన్టీఆర్ తన ఎనర్జీ పెంచుకునేందుకు రెగ్యులర్ గా బాదం పప్పు, వాల్ నట్స్ ను భోజనానికి కచ్చితంగా తీసుకుంటారని.. తన ఫిట్నెస్ ట్రైనర్ చెప్పారు. అలాగే తన రెగ్యులర్ డైట్లో భాగంగా తాజా పండ్లను తీసుకునేవారట.

జిమ్ లో ఎన్ని గంటలంటే..

జిమ్ లో ఎన్ని గంటలంటే..

తను ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజూ జిమ్ లో సుమారు మూడు గంటల పాటు సమయం కేటాయించేవారట. కార్డియో కోసం గంటన్నర టైమ్ కేటాయించి.. మరో గంటన్నర పాటు వర్కౌట్లు చేసేవారట.

FAQ's
  • జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ పెంచుకునేందుకు ఏం తీసుకునేవారు?

    తన డైట్ లో భాగంగా, ఆయన రెగ్యులర్ గా ఎగ్ వైట్స్, ఉడకబెట్టిన కూరగాయలను ఎక్కువగా తినేవారట. వేడి వేడి చికెన్ ను ఎక్కువగా తీసుకునేవారట. అన్నింటికంటే ముఖ్యంగా తన డైట్లో భాగంగా ప్రోటీన్లు, కార్బ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకునేవారట. ఎన్టీఆర్ తన ఎనర్జీ పెంచుకునేందుకు రెగ్యులర్ గా బాదం పప్పు, వాల్ నట్స్ ను భోజనానికి కచ్చితంగా తీసుకుంటారని.. తన ఫిట్నెస్ ట్రైనర్ చెప్పారు. అలాగే తన రెగ్యులర్ డైట్లో భాగంగా తాజా పండ్లను తీసుకునేవారట.

  • జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో రెగ్యులర్ గా ఎన్ని గంటలు గడిపేవారు?

    తను ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజూ జిమ్ లో సుమారు మూడు గంటల పాటు సమయం కేటాయించేవారట. కార్డియో కోసం గంటన్నర టైమ్ కేటాయించి.. మరో గంటన్నర పాటు వర్కౌట్లు చేసేవారట.

English summary

Diet and Fitness Secrets of RRR Hero Jr.NTR in Telugu

Here are the diet and fitness secrets of RRR Hero Jr.NTR in Telugu. Have a look
Desktop Bottom Promotion