For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ తప్పులు అస్సలే చేయొద్దు.. లేకపోతే సమస్యలు తప్పవు

కొందరు వ్యాయామాలు చేస్తున్నప్పుడు, జిమ్‌కు వెళ్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ తప్పులేంటో వాటి నుండి ఎలా దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఫిట్‌గా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం. మంచి బరువు మెయింటైన్ చేస్తేనే ఎలాంటి రోగం రాకుండా ఉంటుంది. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మంచి ఆహారం తీసుకోవాలి. శారీరక శ్రమ లేకపోతే ఒంట్లో కొవ్వు పెరిగి అనేక రుగ్మతలు వస్తాయి. క్రమంతప్పని వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చిన్నా చితకా కారణాలతో వ్యాయామం చేయకుండా మానేస్తే అప్పటి వరకు చేసిందంతా పనికిరాకుండా పోతుంది.

Fitness Mistakes Beginners Should Avoid in telugu

ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. కరోనా తర్వాత హెల్దీగా, ఫిట్‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. మంచి సమతుల్య ఆహారం తీసుకుంటున్నారు. రోజూ శారీరక శ్రమ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కొందరు వ్యాయామాలు చేస్తున్నప్పుడు, జిమ్‌కు వెళ్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ తప్పులేంటో వాటి నుండి ఎలా దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వార్మప్ దాటవేయడం

1. వార్మప్ దాటవేయడం

సమయం లేదనో, లేక వార్మప్ ప్రాముఖ్యత తెలియకనో వార్మప్ దాటవేస్తుంటారు. డైరెక్ట్‌గా వ్యాయామాలు చేయడం మొదలు పెడతారు. కానీ ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.

కీళ్లు, కణజాలాలు, కండరాలను వ్యాయామానికి సిద్ధం చేయడానికి వార్మప్ చాలా ముఖ్యం. వార్మప్ చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది. రక్తసరఫరా వేగం పెరుగుతుంది. ఇలా శరీరాన్ని అసలు వ్యాయామం చేయడానికి సిద్ధం చేయడానికి వార్మప్ చాలా అవసరం. చిన్న చిన్న స్ట్రెచ్‌లు చేస్తే కండరాలు సాగి వ్యాయామానికి సిద్ధపడతాయి.

2. ఒక ప్లాన్ లేకపోవడం

2. ఒక ప్లాన్ లేకపోవడం

ఎలాంటి ప్లాన్, గోల్ లేకుండా జిమ్‌కు వెళ్లడం, వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితం రాదు. మీకేం కావాలో తెలిసుంటే దానికి తగ్గ వ్యాయామాలు చేయవచ్చు. మీకేం కావాలో తెలియకపోతే ఏదో ఒక వ్యాయామం చేస్తూ పోతారు. దీని వల్ల ఫలితాలు కనిపించవు.

జిమ్‌కు వెళ్లే ముందు అసలు మీకేం కావాలో తెలుసుకోవాలి. అందుకు తగ్గట్లుగా వ్యాయామాలు చేయాలి.

3. ఒకే వ్యాయామాన్ని పదే పదే చేయడం

3. ఒకే వ్యాయామాన్ని పదే పదే చేయడం

ఒకే వ్యాయామాన్ని పదే పదే చేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఒకే వ్యాయామాన్ని అదే పనిగా చేస్తుంటే దాని వల్ల ఫలితం చాలా తక్కువ.

ఒక పటిష్టమైన ఫిట్‌నెస్‌ ప్లాన్ వారానికి 3-4 వర్కవుట్‌లతో ఉంటుంది. విషయాలను మార్చడానికి ముందు 4-6 వారాల వ్యవధి ఉంటుంది. మీ లక్ష్యాలు, షెడ్యూల్, ప్రస్తుత ఫిట్‌నెస్‌ స్థాయి, పని చేయడానికి వెచ్చించాలనుకుంటున్న సమయం మొదలైన వాటిపై ఇది ఆధారపడి ఉంటుంది.

4. కేవలం కార్డియో మాత్రమే చేయడం

4. కేవలం కార్డియో మాత్రమే చేయడం

గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కార్డియో చక్కగా ఉపయోగపడుతుంది. కార్డియో ద్వారా చాలా కేలరీలు కరుగుతాయి. అయితే బరువు తగ్గడం, కండరాలను పెంచడం మీ లక్ష్యాలైతే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కార్డియో ఒక్కటే సరిపోదు.

కొవ్వు కరిగించడం, మంచి శరీరాకృతి కావాలనుకుంటే కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెంట్ ట్రైనింగ్ చేయడం చాలా అవసరం. స్ట్రెంత్ ట్రైనింగ్ లీన్ మజిల్‌ను పెంచుతుంది. దీని వల్ల కేలరీలు కూడా ఎక్కువగా బర్న్ అవుతాయి.

5. పోస్టు వర్కౌట్ స్ట్రెచ్‌ చేయకపోవడం

5. పోస్టు వర్కౌట్ స్ట్రెచ్‌ చేయకపోవడం

వ్యాయామం చేసిన తర్వాత ఇంటికి వెళ్లడం కాదు.. పోస్టు వర్కౌట్ స్ట్రెచ్ చేయాలని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం నుండి కోలుకోవడానికి పోస్టు స్ట్రెచ్ ఉపయోగపడుతుంది. పోశ్చర్, బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది. పోస్టు వర్కౌట్ స్ట్రెచ్ వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. స్ట్రెచింగ్ అనేది వర్కవుట్‌లో ఒక భాగం చేసుకోవాలి.

వ్యాయామం చేసిన తర్వాత స్ట్రెచింగ్ చేయడం మర్చిపోతే కండరాలు కోలుకోవడానికి అవకాశం ఉండదు.

English summary

Fitness Mistakes Beginners Should Avoid in telugu

read this to know Fitness Mistakes Beginners Should Avoid in telugu
Desktop Bottom Promotion