For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హ్యాపీ బర్త్ డే నరేంద్ర మోడీ : మన ప్రధాని ప్రత్యేకమైన దినచర్య గురించి నేర్చుకోవాల్సిన విషయాలివే..!

డైట్ అండ్ ఫిట్ నెస్ గురించి నరేంద్ర మోడీ ఎలాంటి విషయాలు చెబుతున్నారో తెలుసుకుందాం.

|

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17వ తేదీన 71వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఏడు పదుల వయసులోకి అడుగుపెడుతున్నప్పటికీ మోడీ అచ్చం పాతికేళ్ల కుర్రాడిలా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటికీ యువతకు ఆరోగ్యం, యోగా, ద్యానం, ఫిట్ నెస్, డైట్ విషయంలో సవాలు విసురుతూనే ఉన్నాడు.

Happy Birthday Narendra Modi : Diet and Fitness Lessons from PM

తన డైట్ అండ్ ఫిట్ నెస్ గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను నేచర్ ను ప్రేమిస్తానని.. నేచర్ తో కలిసి జీవించడం అంటే తనకు ఎంతగానో ఇష్టమని చెప్పారు.

Happy Birthday Narendra Modi : Diet and Fitness Lessons from PM

అలాగే తనకు ప్రతిరోజూ యోగా చేయడమంటే చాలా ఇష్టమని.. తన ఫిట్ నెస్ సీక్రెట్లలో ఇది చాలా ముఖ్యమైందని చెప్పారు. దీని వల్లే తాను ప్రతిరోజూ చాలా చురుకుగా ఉంటానని.. దాదాపు 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా సమర్థవంతంగా పనులు చేయగలుగుతున్నానని చెప్పాడు. ఈ సందర్భంగా మనం కూడా నరేంద్ర మోడీ డైట్ అండ్ ఫిట్ నెస్ రహస్యాలేంటో తెలసుకుందామా

సరైన నిద్ర..

సరైన నిద్ర..

ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ ‘ప్రతి మనిషి రోజుకు కనీసం ఆరు గంటలు నిద్ర పోవాలి. దీని వల్ల రోజంతా చురుకుగా పని చేయొచ్చు. అదే సమయంలో ప్రశాంతంగా నిద్ర పోవాలి. నిద్రించే సమయంలో ఎలాంటి ఆలోచనలు చేయకూడదు. నేను కూడా నిద్రకు కొంత సమయం ముందు అన్నింటినీ పక్కనబెట్టి రిలాక్స్ అవుతాను' అని మోడీ చెప్పారు.

యోగా..

యోగా..

ప్రపంచానికి మన దేశం అందించిన గొప్ప వాటిలో యోగా ఒకటి. దీన్ని కూడా ప్రధానమంత్రి మోడీనే ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రచారం చేశారు. అంతేకాదు తాను కూడా ప్రతిరోజూ తప్పనిసరిగా యోగా చేస్తారట. తాను ప్రతిరోజూ అత్యుత్సాహంగా ఉండేందుకు యోగాలోని తాను వేసే ఆసనాలే అని చెబుతారు. సూర్యనమస్కారం మరియు ప్రాణాయామం వంటి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.

వెజిటేరియన్ డైట్..

వెజిటేరియన్ డైట్..

ప్రధాని నరేంద్ర మోడీ ఫేవరెట్ ఫుడ్ ‘కిచిడి'. ‘రైస్ లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆహారం చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఎక్కువ న్యూట్రిషన్లు, మైక్రో న్యూట్రిషన్లు ఉంటాయి. ఇలా నేను శాఖాహార ఆహారాన్ని తీసుకోవడం వల్ల నా శరీరం నా కంట్రోల్ ఉంటుంది' అని చెప్తారు.

ద్యానం..

ద్యానం..

ద్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. ద్యానం అనేది పూర్తిగా విశ్రాంతి సమయం. కాబట్టి దీనిని మీకు పూర్తిగా అనుకూలమైన సమయంలో చేయాలి. కాబట్టి మీకు ఆటంకం కలగని సమయాన్ని, ప్రాంతాన్ని చూసుకోండి. సాధారణంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాలు ద్యానం చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే మీకు అనుకూలమైన భంగిమలో కూర్చోవాలి. ఎందుకంటే మీరు కూర్చునే భంగిమ కూడా మీ మీద ప్రభావం చూపుతుంది. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా స్ట్రైట్ గా కూర్చొంది. మీరు ధ్యానం చేస్తున్నంతసేపు కళ్లు మూసుకుని భుజాలు మరియు మెడ ప్రశాంతంగా ఉంచుకోవాలి.

కడుపు ఖాళీగా..

కడుపు ఖాళీగా..

ఏ వయసులో వారైనా సరే వ్యాయామం చేసేటప్పుడు లేదా ద్యానం మరియు యోగా వంటివి చేసేటప్పుడు కడుపు ఖాళీగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పరగడుపునే వీటిని చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ మీరు భోజనం చేసిన తర్వాత ద్యానం చేస్తే మీకు నిద్ర రావొచ్చు. ఏది ఏమైనా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పనులు చేయడానికి మాత్రం ప్రయత్నించకండి.

పంచసూత్రాలు..

పంచసూత్రాలు..

ప్రధాని మోడీ తాను ఫిట్ నెస్ సాధించేందుకు పంచసూత్రాలను పాటిస్తారట. తను ఎక్కడ వాకింగుకు వెళ్లినా భూమి(Prithvi), జలం(Water), అగ్ని(Fire),వాయు(Air), ఆకాశం(Sky or Space) వంటివి ఉండేలా చూసుకుంటారట. ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగుకు వెళ్లే చోట గడ్డి, నీళ్లు, గులకరాళ్లను ఉండేలా చూసుకుంటారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరితో షేర్ చేసుకున్నాడు.

చెడు అలవాట్లకు దూరంగా..

చెడు అలవాట్లకు దూరంగా..

ప్రధాని మోడీ చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటారట. ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి వెళ్లరట. అందుకే ఏడు పదుల వయసులో అడుగు పెడుతున్నప్పటికీ తాను ఇంకా యాక్టివ్ గా ఉన్నానని చెబుతారు. అలాగే వయసు తన శరీరానికే కానీ.. తన మనసుకు కాదని కూడా చెబుతుంటారు.

English summary

Happy Birthday Narendra Modi : Diet and Fitness Lessons from Prime Minister of India

Here are the diet and fitness lessons from PM Narendra Modi. Take a look
Desktop Bottom Promotion