Latest Updates
-
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది!
Happy Birthday Narendra Modi:71వ ఏళ్ల వయసులోనూ ప్రధాని ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటం వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసా
నరేంద్రమోడీ డైట్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17వ తేదీన 71వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఏడు పదుల వయసులోకి అడుగుపెట్టినప్పటికీ, మోడీ అచ్చం పాతికేళ్ల కుర్రాడిలా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇప్పటికీ యువతకు ఆరోగ్యం, యోగా, ద్యానం, ఫిట్ నెస్, డైట్ విషయంలో సవాలు విసురుతూనే ఉన్నాడు. తన డైట్ అండ్ ఫిట్ నెస్ గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను నేచర్ ను ప్రేమిస్తానని.. నేచర్ తో కలిసి జీవించడం అంటే తనకు ఎంతగానో ఇష్టమని చెప్పారు. అలాగే తనకు ప్రతిరోజూ యోగా చేయడమంటే చాలా ఇష్టమని.. తన ఫిట్ నెస్ సీక్రెట్లలో ఇది చాలా ముఖ్యమైందని చెప్పారు.

దీని వల్లే తాను ప్రతిరోజూ చాలా చురుకుగా ఉంటానని.. దాదాపు 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా సమర్థవంతంగా పనులు చేయగలుగుతున్నానని చెప్పాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ డైట్ అండ్ ఫిట్ నెస్ రహస్యాలేంటో తెలసుకుందామా...

మోడీ చిన్నతనంలో..
గుజరాత్ లోని వాద్ నగర్లో జన్మించిన ప్రధాని మోడీ.. ఛాయ్ అమ్ముకునే నాటి నుండి ప్రధానమంత్రి పదవిని అలంకరించేంత వరకు మోడీ ప్రస్థానంలో ఎన్నో మలుపులు, మైలురాళ్లు ఉన్నాయి. చిన్నతనంలో ప్రధాని నరేంద్రమోడీ సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలని ఆశపడ్డాడు. అయితే ఆర్థిక, ఇతర సమస్యల కారణంగా అది నెరవేరలేదు. కానీ ఏకంగా ప్రధాని పదవినే దక్కించుకున్నాడు. ఇక తన ఫిట్ నెస్ విషయానికొస్తే.. యోగా చేయడం వల్ల ఒక్కటే ఆరోగ్యంగా ఉండరని.. మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ నొక్కి చెప్పారు.

71ఏళ్ల వయసులోనూ..
ప్రధాని నరేంద్ర మోడీ 71వ వసంతంలోకి అడుగుపెట్టినా ఇప్పటికీ అనేక యోగాసనాలు చాలా సునాయసంగా వేసేస్తారు. యోగాసనాలలో ప్రాణాయామంతో పాటు అనేక ఆసనాలు చాలా ముఖ్యమని వివరించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయాన్నే వాకింగ్, యోగా మరియు ధ్యానం వంటివి చేస్తూ రోజును ప్రారంభిస్తారు. అనంతరం సూర్యనమస్కారం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని.. ఇదే తన ఆరోగ్య రహస్యమని కొన్ని సందర్భాల్లో వివరించారు.

ఫుడ్ విషయంలో..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. ఆయన ఎక్కువగా గుజరాతీ ఆహారాన్ని ఇష్టపడతారు. అందులోనూ ఖిచ్చి అనే రెసిపీని ఎక్కువగా ఇష్టపడతారట. తను తినే భోజనంలో కచ్చితంగా ఒక కప్పు పెరుగును చేర్చుకుంటారట. దీని వల్ల తాను ఆరోగ్యంగా ఉంటానని చెబుతారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో పండే పుట్టగొడుగులు చాలా బాగుంటాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందులో అనేక రకాల పోషకాలు నిండి ఉన్నాయని వివరించారు. తను పేర్కొన్న పుట్టగొడుగు శాస్త్రీయ నామం మాక్రూలా ఎక్సులెంటా.

ఉపవాసం ఉంటారా?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపవాసం ఉండటం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. తాను నవరాత్రుల సమయంలో ఉపవాసం ఉంటానని ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. విదేశాలకు వెళ్లిన సమయంలో కూడా ఉపవాసాన్ని విరమించలేదని, కేవలం నిమ్మరసం మాత్రమే తీసుకుంటానని చెప్పారు. మన శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపవాసం చాలా మంచి మార్గమని చెప్పారు.

ఇష్టమైన వంటకాలు..
డోక్లా అనేది గుజరాతీ సాంప్రదాయ ఆహారం. దీన్ని చూస్తే మన నోరూరిపోతుంది. ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఈ డోక్లా చాలా రుచికరమైన వంటకం. మోడీకి ఇష్టమైన ఆహారాలలో ఇది ఒకటి. దీంతో పాటు సాయంకాలం వేళ టీ టైమ్ స్నాక్స్ ఆవపిండి వాసనతో అలంకరించబడిన కండ్వి తాజాగా చాలా రుచికరంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు.

మనసుకు కాదు..
ప్రధాని మోడీ చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటారట. ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి వెళ్లరట. అందుకే ఏడు పదుల వయసులో అడుగు పెట్టినప్పటికీ, తాను ఇంకా యాక్టివ్ గా ఉన్నానని చెబుతారు. అలాగే వయసు తన శరీరానికే కానీ.. తన మనసుకు కాదని కూడా చెబుతుంటారు.
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17వ తేదీన 71వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఏడు పదుల వయసులోకి అడుగుపెట్టినప్పటికీ, మోడీ అచ్చం పాతికేళ్ల కుర్రాడిలా చాలా యాక్టివ్ గా ఉంటారు.



Click it and Unblock the Notifications