For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HBDay Sachin Tendulkar: 48 ఏళ్ల వయసులోనూ సచిన్ ఫిట్ గా ఉండేందుకు గల కారణాలేంటో తెలుసా...

సచిన్ టెండూల్కర్ కు నాలుగు పదుల వయసు దాటినా అంత ఫిట్ గా ఎలా ఉంటున్నాడంటే..

|

క్రికెట్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికీ సచిన్ టెండూల్కర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలువబడే సచిన్ టెండూల్కర్ క్రికెట్లో తన అత్యుత్తమ ఆటతీరుతో ప్రత్యేకమైన రికార్డులను నెలకొల్పాడు.

HBDay Sachin Tendulkar:Master Blaster Fitness Secrets in Telugu

కేవలం 15 సంవత్సరాల వయసులోనే కెరీర్ ప్రారంభించిన సచిన్ ఎందరికీ ఆదర్శంగా నిలిచాడు. నేటికీ చాలా మంది యువ ఆటగాళ్లు తనను ఫాలో అవుతున్నారు. తనలా గొప్ప ఇన్సింగ్స్ లు ఆడేందుకు, సచిన్ లా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

HBDay Sachin Tendulkar:Master Blaster Fitness Secrets in Telugu

ఆయన క్రికెట్ నుండి రిటైర్ అయినా, నాలుగు పదుల వయసు దాటి.. దాదాపు ఐదు పదుల వయసులోకి అడుగు పెట్టే సమయంలోనూ ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉంటున్నాడు.

HBDay Sachin Tendulkar:Master Blaster Fitness Secrets in Telugu

ఈరోజు సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా.. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా తను ఇంత ఫిట్ గా ఎలా ఉంటున్నాడు.. దాని వెనుక డైట్ సీక్రెట్స్ ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Happy Birthday Sachin : క్రికెట్ దేవుని గురించి మనం నమ్మలేని నిజాలు...Happy Birthday Sachin : క్రికెట్ దేవుని గురించి మనం నమ్మలేని నిజాలు...

భోజన ప్రియుడు..

భోజన ప్రియుడు..

సచిన్ టెండూల్కర్ మంచి భోజన ప్రియుడు. అతనికి ఇష్టమైన ఆహారం కనబడితే చాలు కడుపు నిండా తినేస్తాడట. అయితే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఎక్కువగా తినేందుకు ప్రాధాన్యత ఇస్తాడట. సచిన్ టెండూల్కర్ కు బెంగాలీ ఆహారం మరియు థాయ్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. బెంగాలీ స్టైల్లో వండిన వంటకాల్లో ఎండ్రకాయలంటే తనకు అత్యంత ఇష్టమైన వంటకాల్లో ఒకటి. వీటితో పాటు సచిన్ టెండూల్కర్ ఎండాకాలంలో లభించే మామిడి పండ్లను బాగా ఇష్టపడతాడట. అలాగే అల్పోన్సో పండును బాగా ఇష్టపడతాడట.

ప్రశాంతత కోసం ధ్యానం..

ప్రశాంతత కోసం ధ్యానం..

సచిన్ టెండూల్కర్ గంటల కొద్దీ మైదానంలో గడిపిన అనంతరం ప్రశాంతత కోసం ద్యానం చేస్తాడట. అయితే అదే సమయంలో శారీరక వ్యాయమాలు చేయడం మరచిపోలేదు. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు శ్వాస వ్యాయమాలు (శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాయమాలు) నిర్వహిస్తారు. సచిన్ ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపించడానికి కారణం, తాను ద్యానం చేయడమే అంట.

ప్రోటీన్ల ఫుడ్..

ప్రోటీన్ల ఫుడ్..

సచిన్ ఎంత భోజన ప్రియుడు అయినప్పటికీ, తన ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడట. తాను తీసుకునే ఆహారంలో 30 శాతం ప్రోటీన్, 30 శాతం కొవ్వు మరియు 40 శాతం కార్బొహేడ్రేట్లు ఉండే వాటిని తీసుకుంటాడు. ఏ పరిపూర్ణ ఆటగాడికి అనువైన ఆహారం ఇది. అయితే, సచిన్ రిటైర్ అయినప్పటికీ, నేటికీ ఆయన ఫిట్ నెస్ పై ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.

ఆరోగ్యంగా ఉండేందుకు..

ఆరోగ్యంగా ఉండేందుకు..

2011లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, అంతకుముందు చాలా నెలలు ముందే ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువగా ఉడికించిన ఆహారాన్ని తీసుకునేవాడు.

ఓట్ మీల్స్, ఎండు ద్రాక్ష..

ఓట్ మీల్స్, ఎండు ద్రాక్ష..

సచిన్ టెండూల్కర్ ఫిట్ గా ఉండేదుకు రెగ్యులర్ గా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్స్ మరియు పాలు తీసుకునేవాడు. అలాగే ఎండుద్రాక్షలను కూడా తినడాన్ని ఇష్టపడేవాడట. అనంతరం రసం, పాలు మరియు కాఫీ తినేందుకు ఇష్టపడతారు. అలాగే డ్రైఫూట్స్, మొలకెత్తిన గింజలు స్నాక్స్ గా తీసుకునేవాడు.

లంచ్ టైంలో..

లంచ్ టైంలో..

సచిన్ టెండూల్కర్ రుచికరమైన ఆహారాన్ని తినడాన్ని బాగా ఇష్టపడతారు. అందులోనూ ఇంట్లో తయారు చేసిన వంటలను ఇష్టంగా తింటారు. రెగ్యులర్ గా మధ్యాహ్నం వేళలో రోటీలను, ఆలివ్ నూనెలో ఉడికించిన పప్పు దాన్యాలు లేదా చేపలను తింటారు.

డిన్నర్ టైంలో..

డిన్నర్ టైంలో..

ఇక డిన్నర్ సయంలో ప్రోటీన్ షేక్ మరియు వంద గ్రాముల మిశ్రమ డ్రై ఫ్రూట్స్ మరియు మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.

English summary

Happy Birth Day Sachin Tendulkar: Master Blaster Fitness Secrets in Telugu

Here we are talking about the hbday sachin tendulkar: Master blaster fitness secrets in telugu. Read on
Desktop Bottom Promotion