For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

12-3-30 ఈ వర్కౌట్ తో త్వరగా బరువు తగ్గొచ్చు.. కానీ..

కొంత కాలంగా 12-3-30 వ్యాయామాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ వినూత్న ట్రెడ్ మిల్ వర్కౌట్ ను మొదట సోషల్ మీడియాలో లారెన్ గిరాల్డో విడుదల చేశారు.

|

వేసవి కాలం, వర్షా కాలం, శీతా కాలాల్లో... బరువు తగ్గించుకోవడానికి అనువైనది చలికాలమే. చాలా మంది ఈ కాలంలోనే బరువు తగ్గించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే మనం ఫిట్ గా ఉండాలంటే డైట్ తో పాటు వ్యాయామం, యోగా చాలా ముఖ్యం. అయితే యూట్యూబ్ లు, పలు వీడియోలు చూసి చాలా మంది నిపుణుల సలహాలు పొందకుండానే వ్యాయామాలు చేస్తుంటారు. కానీ అది చాలా తప్పు. అలా చేస్తే ముందు బరువు తగ్గినప్పటికీ.. భవిష్యత్తులో కచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ.. ముఖ్యంగా కొత్తగా వ్యాయామం చేసే వారు నిపుణుల సలహా మేరకే వ్యాయామం, డైట్ చేయాల్సి ఉంటుంది.

12-3-30 workout

2019లో 12-3-30 వ్యాయామాన్ని విడుదల చేసిన గిరాల్డో

కొంత కాలంగా 12-3-30 వ్యాయామాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ వినూత్న ట్రెడ్ మిల్ వర్కౌట్ ను మొదట సోషల్ మీడియాలో లారెన్ గిరాల్డో విడుదల చేశారు. అతను ఈ వీడియోను 2019లో యూట్యూబ్ లో, 2020లో టిక్ టాక్ లో షేర్ చేశాడు. ఈ వీడియోను గిరాల్డ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేశాడు. ఈ వీడియోకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వ్యాయామం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వ్యాయామంపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు

ఈ వ్యాయామంపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు

ట్రెడ్ మిల్ ను 12 ఇంక్లైన్ లో సెట్ చేసి, వేగాన్ని గంటకు మూడు మైళ్ల దగ్గర ఉంచి, ఆపై 30 నిమిషాల పాటు నడవాలి. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ లారెన్ గిరాల్డో మాట్లాడుతూ.. తాను చాలా తక్కువ సమయంలో 30 పౌండ్లు పెరగడంతో ఈ వర్కౌట్ పద్దతి గేమ్ ఛేంజర్ గా నిలిచిందని వివరించారు. 12-3-30 వ్యాయామం గురించి ఆరోగ్య నిపుణులతో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నడకను తక్కువ ప్రభావం చూపే వ్యాయామంగా పరిగణిస్తారని, వంపు తిరిగిన ఉపరితలంపై నడవడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఫైబ్రస్ టిష్యూపై విపరీతమైన ఒత్తిడి

ఫైబ్రస్ టిష్యూపై విపరీతమైన ఒత్తిడి

ఈ వ్యాయామం చేయడం ద్వారా దిగువ వీపు, స్నాయువు, అకిలెస్ స్నాయువు, మోకాలి, అరికాలిని అంటి పెట్టుకున్న ఫైబ్రస్ టిష్యూపై విపరీతమైన ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. ఈ వ్యాయామం చాలా ప్రమాదకరమని, కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే గాయాలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీన్ని చేసే సమయంలో నిత్యం అప్రమత్తంగా ఉండండి.

చాలా మంది ట్రెడ్ మిల్ పై నడవడం చాలా సులభమైన పనిగా భావిస్తారు. అయితే వంకరగా ఉన్న ట్రెడ్ మిల్ పై నడవడం కొండ ఎక్కడానికి ఏమాత్రం తక్కువ కాదని ఫిట్ నెస్ నిపుణుడు ఒకరు తెలిపారు.

30 నిమిషాలకు మించి నడవాల్సిన అవసరం లేదు..

30 నిమిషాలకు మించి నడవాల్సిన అవసరం లేదు..

ట్రెడ్ మిల్ పై 30 నిమిషాలకు మించి నడవాల్సిన అవసరం లేదన్నారు. మొదటి సారి ట్రెడ్ మిల్ ను ఉపయోగిస్తున్న వ్యక్తులు ఈ వ్యాయామంపై గుడ్డిగా ఆధార పడకూడదని.. ట్రెడ్ మిల్ ను జీరో ఇంక్లైన్ కు సెట్ చేయడం ద్వారా ప్రారంభించి తర్వాత దానిని 12కి సెట్ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

అయితే 12-3-30 అనేది కొన్ని ప్రయోజనాలను అందించినప్పటికీ సైడ్ ఎఫెక్స్ట్ ఉన్నాయని బ్రూక్స్ చెప్పారు. దీనికంటే కూడా ఇతర వ్యాయామాలు చాలా ఉన్నాయని వాటి వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు. ఏ వ్యాయామం అయినా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఫిట్‌నెస్‌ నిపుణులు సూచిస్తున్నారు.

English summary

How 12-3-30 workout help to lose weight? Know How to do it and it's drawbacks in Telugu

read this to know How 12-3-30 workout help to lose weight? Know How to do it and it's drawbacks in Telugu
Story first published:Saturday, December 17, 2022, 21:10 [IST]
Desktop Bottom Promotion