For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక బరువును తగ్గించడంలోనే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఇడ్లీ డైట్

అధిక బరువును తగ్గించడంలోనే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఇడ్లీ డైట్

|

ఎప్పుడైనా మీరు ఇడ్లీ డైట్ గురించి విన్నారా ? దీని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా, ఊబకాయం తగ్గించడంలో, క్రమంగా బరువు తగ్గడంలో కూడా అత్యుత్తమ ప్రభావాలను కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇడ్లీలు వాస్తవానికి అల్పాహారం కోసం తయారు చేయబడిన దక్షిణ భారతీయ ప్రధాన వంటకంగాను, మరియు చిరుతిండిగా కూడా ఉంటుంది. ఇక ఉత్తర భారతదేశంలో, ఇడ్లీ ఒక ఆరోగ్యకరమైన స్నాక్స్ వలె భావించడం జరుగుతుంది. మీకు ఇడ్లీ అంటే మక్కువ ఎక్కువగా ఉన్నట్లయితే, అది బరువు తగ్గడంలో కూడా ఎటువంటి ప్రభావాన్ని కలుగజేస్తుందో తెలుసుకోండి.

ఇడ్లీ – బరువు తగ్గించడంలో చూపే ప్రభావం :

ఇడ్లీ – బరువు తగ్గించడంలో చూపే ప్రభావం :

• దక్షిణ భారతదేశపు ఉత్తమ ఆహార పదార్ధాలలో ఒకటైన ఇడ్లీ, అల్పాహారంగా మాత్రమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా సమర్థవంతమైనదిగా ఉంటుంది. అనేకమంది ప్రజలు క్రమంగా ఒక నెల పాటు, ఇడ్లి డైట్ అనుసరించడం ద్వారా బరువు కోల్పోయారని చెప్పబడింది. తమిళనాడు నుండి సూపర్ స్టార్ రజని చెప్పిన మాటల ప్రకారం, "నేను 40 రోజులలో 5 కిలోల బరువును కోల్పోయాను, ఇడ్లీ డైట్ మీదనే పూర్తిగా ఉన్నాను." అని చెప్పడం జరిగింది.

 ఇడ్లీ డైట్లో రోజులో మూడుపూటలా

ఇడ్లీ డైట్లో రోజులో మూడుపూటలా

• ఇడ్లీ డైట్లో రోజులో మూడుపూటలా ఇడ్లీనే తీసుకోవాలని లేదు. ఈ ఇడ్లీ డైట్లో, ఇడ్లీని మీ అల్పాహారం మరియు సాయంత్రం స్నాక్ వలె చేర్చవచ్చు.

 ఇడ్లీలు బరువు తగ్గడంలో అత్యుత్తమంగా

ఇడ్లీలు బరువు తగ్గడంలో అత్యుత్తమంగా

• ఇడ్లీలు బరువు తగ్గడంలో అత్యుత్తమంగా సహాయం చేస్తాయని చెప్పబడింది. ఉడికించిన ఆహారం, కొవ్వులు మరియు కేలరీలను కలిగి ఉండదు. వాస్తవానికి కొవ్వులు, అధిక కాలరీల కారణంగానే మీ బరువు పెరుగుతుంది. కానీ ఇడ్లీలు ఉడికించిన ఆహార పదార్ధాలుగా ఉన్న కారణాన ఎటువంటి, సమస్యలను కలిగి ఉండవు.

ఇడ్లీలు మినపప్పు మరియు బియ్యం

ఇడ్లీలు మినపప్పు మరియు బియ్యం

ఇడ్లీలు మినపప్పు మరియు బియ్యం నుండి తయారు చేయబడుతుంది. ఇది ఉత్తమ దక్షిణ భారత దేశపు వంటకంగా ఉండడమే కాకుండా, సులభంగా జీర్ణమవుతుంది.

బియ్యపు పిండితో మాత్రమే చేసే ఈ ఇడ్లీలు

బియ్యపు పిండితో మాత్రమే చేసే ఈ ఇడ్లీలు

బియ్యపు పిండితో మాత్రమే చేసే ఈ ఇడ్లీలు, కడుపులో కొంచెం ఎక్కువ సేపు ఉంటుంది. బియ్యం బరువు పెరిగే కారణాలలో ఒకటిగా ఉంటుంది. అంతేకాకుండా, కేవలం మినప్పప్పు మరియు బియ్యం కలిగి ఉన్న కారణాన, రోజూ అవసరమయ్యే ఇతర పోషక పదార్ధాలను భర్తీ చేయదు. ఇడ్లీ, రుచికరమైన మరియు మరింత పోషకమైనవిగా ఉండేందుకు, వీటికి అదనంగా కొన్ని ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు మరియు సహజసిద్దమైన సుగంధ ద్రవ్యాలను జోడించండి. మరియు దీనిలోని ఫైబర్ నిల్వలు ఆకలిని దరికి చేరనివ్వదు.

 ఆవిరి ఇడ్లీలను, సిట్రస్ జ్యూస్లతో

ఆవిరి ఇడ్లీలను, సిట్రస్ జ్యూస్లతో

ఆవిరి ఇడ్లీలను, సిట్రస్ జ్యూస్లతో (ద్రాక్ష, నారింజ, బత్తాయి లేదా నిమ్మ రసం వంటివి) కలిగి ఉన్న ఎడల, మీరు మరింత అదనంగా కొవ్వులను కరిగించగలరని చెప్పబడింది. మరియు శరీరంలో బియ్యం నుండి విడుదల కాబడే పిండి పదార్థాలను నిరోధించడానికి కూడా సహాయపడుతుంది.

ఊబకాయం తగ్గించడంలో ఇడ్లీ యొక్క ప్రయోజనాలను చూశారు కదా, ఇప్పుడు దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఊబకాయం తగ్గించడంలో ఇడ్లీ యొక్క ప్రయోజనాలను చూశారు కదా, ఇప్పుడు దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఇడ్లీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

• ఇవి తేలికగా జీర్ణమవడమే కాకుండా, కడుపు నిండిన అనుభూతిని ప్రేరేపిస్తాయి. ఏదిఏమైనా, ఇడ్లీలు బియ్యంతో తయారుచేస్తారు, కాబట్టి ఈ దక్షిణ భారతీయ ప్రధాన వంటకాన్ని జీర్ణించుకోవడం కష్టం.

• ఇడ్లీలు గ్లూటేన్ రహితమైనవి ఎందుకంటే అవి గోధుమలతో తయారుచేయబడవు. మీకు మీ ఆహార ప్రణాళికలో గ్లూటేన్ జోడించుకోవాలని భావిస్తున్న ఎడల, అల్పాహారంలో రొటీస్ లేదా చపాతీలను కూడా ఇడ్లీలతో తీసుకోవచ్చు.

• కార్బొహైడ్రేట్లు, ఫైబర్స్ మరియు ప్రోటీన్ల యొక్క గొప్ప వనరుగా ఉన్న ఇడ్లీ పుష్టికరమైనదిగా చెప్పబడుతుంది.

ఇడ్లీ పులియబడే కొలదీ, మరింత ప్రోటీన్ మరియు విటమిన్లతో

ఇడ్లీ పులియబడే కొలదీ, మరింత ప్రోటీన్ మరియు విటమిన్లతో

• ఇడ్లీ పులియబడే కొలదీ, మరింత ప్రోటీన్ మరియు విటమిన్లతో సమృద్దిగా అవుతుంది. పులియబెట్టినప్పుడు, ఆహారంలోని ప్రోటీన్లు మరియు విటమిన్ B కంటెంట్ యొక్క లభ్యత పెరుగుతుంది.

• బియ్యం మీకు కొవ్వు చేరడానికి ప్రధాన కారకంగా ఉన్న ఎడల, గోధుమతో కూడా ఇడ్లీ తయారుచేయవచ్చు. ఇవి కూడా సులభంగా జీర్ణమవుతూ, బరువు తగ్గడంలో కీలక పాత్రను పోషిస్తాయి. మధుమేహ రోగులకు మంచిదిగా చెప్పబడుతుంది. బియ్యం, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది కాబట్టి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు, గోధుమ ఇడ్లీలను తీసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది.

ఈవిధంగా ఇడ్లీలు బరువు తగ్గడానికి సహాయపడడంతో పాటుగా

ఈవిధంగా ఇడ్లీలు బరువు తగ్గడానికి సహాయపడడంతో పాటుగా

ఈవిధంగా ఇడ్లీలు బరువు తగ్గడానికి సహాయపడడంతో పాటుగా, మీ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో కూడా ఎంతగానో దోహదపడుతుంది. కానీ, రోజూవారీ జీవన శైలిలో ఆరోగ్యకర మార్పులు, వ్యాయామం, వ్యసనాలకు, గాడ్జెట్ స్క్రీన్లకు దూరంగా ఉండడం వంటివి కూడా తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Idli Benefits Health and Aids Weight Loss

Have you heard about an idli diet? There is a non-technical diet named after idli. This diet has been introduced after knowing its health benefits and its major contribution in aiding weight loss. Idlis are a staple South-Indian dish that is made for breakfast and also enjoyed as a snack. In North India, idlis are a healthy and filling snack idea. If you love to eat idli, then you would like to know how it aids weight loss. Keep reading to know the answer...
Story first published:Wednesday, October 16, 2019, 11:22 [IST]
Desktop Bottom Promotion