For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Yoga Day 2022:ఈ భంగిమలతో యోగాను ప్రారంభించండి... ఆరోగ్యంగా ఉండండి...

|

ప్రస్తుతం యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు యోగాకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఎందుకంటే యోగా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా బలంగా మారొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ యోగాని ప్రపంచానికి పరిచయం చేసింది కూడా మన భారతీయులే కావడం గర్వకారణం. ఇదిలా ఉండగా ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మంది కెరీర్లో సంతోషంగా మరియు ప్రశాంతంగా గడపలేకపోతున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో, మెట్రో సిటీల్లో జీవించే వారి జీవితకాలం చాలా వేగంగా గడిసిపోతుంది.

కొందరు జిమ్ లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేయడం వల్ల చాలా అలసిపోతున్నామని చెబుతున్నారు. అయితే వ్యాయామం ఖచ్చితంగా మీ ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఇది మిమ్మల్ని ఎప్పటికి అలసిపోయేట్లు చేయదు . ఒకవేళ వ్యాయామంతో పాటు మీరు యోగా చేయడం వల్ల జీవితంలో మరింత ఎక్కువగా యాక్టివ్ గా ఉండవచ్చు. యోగా మీకు తక్షణ ఎనర్జీని అందించే ఒక పురాతన కాలం యొక్క వ్యాయామంగా చెబుతుంటారు. యోగాతో ఒక చిన్నపాటి యోగాతో ఒక బిట్ ఎనర్జీ పొందడం వల్ల మీ లైఫ్ మరింత బెటర్ గా ఉంటుంది. ఈ సందర్భంగా యోగాలో ప్రారంభించాలనుకునే వారు ఎలా ప్రారంభించాలి.. ఏయే భంగిమలను కచ్చితంగా చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బేసిక్ యోగా భంగిమ..
ఇది ఒక బేసిక్ యోగా భంగిమ. మీ బాడీలోని కదలికలను ఇది కంట్రోల్ చేస్తుంది. ముందుగా నిటారుగా కూర్చొని ఎడమకాలు మీదుగా కుడికాలిని వేసి, పూర్తిగా ఒకవైపునకు తిరగాలి . ఈ భంగిమలో తీసుకొనే శ్వాస వల్ల మీరు మరింత ఎక్కువ ఎనర్జిటిక్ గా భావిస్తారు.

బాలాసన భంగిమ..
ఈ భంగిమను బాలాసన లేదా ఫీటల్ ఫోజ్ అని అంటారు. మీరు ఏదైనా సమయంలో ఎక్కువ టెన్షన్ తో ఉన్నప్పుడు, ఈ భంగిమలో యోగా చేయడం వల్ల మీ మనస్సును ప్రశాతం పరుస్తుంది. ఈ భంగిమ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

మౌంటెన్ భంగిమ..
మీ బాడీ ఫర్ ఫెక్ట్ బ్యాలెన్స్ మరియు నిటారుగా ఉండాలని భావిస్తే ,మీ వర్కౌట్ ను మౌంటైన్ ఫోజ్ తో ప్రారంభించండి. ఇందులో భాగంగా మీ రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడి, రెండు చేతులను పైకి ఎత్తి , నిధానంగా శ్వాస తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ 15-30 నిమిషాల పాటు చేయొచ్చు.

ఈ భంగిమలో..
ట్రీ (చెట్టు)భంగిమతో మీరు బలాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం రెండు చేతులను పైకి చాచి నమస్తే భంగిమలో నిలబడాలి. ఫోటోలో చూపించిన విధంగా ఒంటి కాలిమీద నిలబడాలి. ఈ యోగా భంగిమ మీ కండరాలకు బలాన్ని అందిస్తుంది, అలాగే తక్షణం శక్తిని పెంచుతుంది.

శక్తివంతమైన భంగిమ..
మీ బాడీని బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు, మీ బాడీ ఒక శక్తివంతమైన ఆయుధంగా తయారవుతుంది. ఇందులో భాగంగా ముందుకు చేయిని చాచాలి. చేయితో పాటు అడుగు కూడా ముందుకు వేయడం వల్ల వల్ల బాడీలోని కండరాలు స్ట్రెచ్ అవుతాయి.

త్రికోణ భంగిమ..
మీరు మీ బాడీని గోల్డెన్ ట్రయాంగిల్లో ఉంచినట్లయితే, మీరు శక్తి వంతమైన ఎనర్జీని పొందగలరు. ఇందుకోసం మీ రెండు కాళ్ళను దూరంగా చాచి, ఒక్క వైపు బెండ్ అవ్వాలి . ఒక చేయిని పైకి మరో చేయిని క్రిందికి 90 డిగ్రీ ట్రయాంగిల్లో చాచాలి.

ఒత్తిడి తగ్గించే భంగిమ..
మనలో కొందరికి చాలా సందర్భాల్లో బాడీ బలహీనంగా మారిపోవడం వంటిది జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడి తగ్గించుకొని చురుగ్గా ఉండాలంటే, క్యాట్ ఫోజ్ ను ట్రై చేయండి.

సులభంగా శ్వాస..
ఈ భంగిమతో మీ బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ అవ్వడం మాత్రమే కాదు , చెస్ట్ ఫ్రీ అవ్వడంతో సులభంగా శ్వాస తీసుకోగలుగుతారు. ఎంత ఎక్కువ గాలి మీరు పీల్చుకోగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. దీన్నే కోబ్రా యాంగిల్ అంటారు.

English summary

International Yoga Day 2022 : Yoga Poses for Beginners in Telugu

International Yoga Day 2022 : Yoga Poses for Beginners in Telugu. Have a look
Desktop Bottom Promotion