For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు చేసే ఈ చిన్న పనుల వల్లే అధిక బరువుకు కారణాలవుతున్నాయి..

మనిషి ఫిట్ గా ఉండాలంటే ఆరోగ్యకమైన ఆహారం తీసుకోవడం మరియు సరైన వ్యాయామం అనుసరించడం. ఈ రెండు పద్దతుల ద్వారానే ఫిట్ గా ఉండాలన్నా లక్ష్యాన్ని నెరవేరుస్తాయి. కానీ కొన్ని సమయాల్లో ఈ అదనపు బరువు పెరిగిపోయి, ఏ

|

మనిషి ఫిట్ గా ఉండాలంటే ఆరోగ్యకమైన ఆహారం తీసుకోవడం మరియు సరైన వ్యాయామం అనుసరించడం. ఈ రెండు పద్దతుల ద్వారానే ఫిట్ గా ఉండాలన్నా లక్ష్యాన్ని నెరవేరుస్తాయి. కానీ కొన్ని సమయాల్లో ఈ అదనపు బరువు పెరిగిపోయి, ఏమాత్రం బరువును తగ్గించుకోలేకపోతుంటారు. దాని గురించి ఆదోళన చెందుతుంటారు. బరువు తగ్గడానికి ఆవేశంలో మనం తీసుకునే చిన్న నిర్ణయాల వల్ల మరింత బరువు పెరుగుతారు తప్ప తగ్గడం అంటూ ఉండదు.

Little things you are doing that could make you gain weight

అధిక బరువు మిమ్మల్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అధిక బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు గురించి కొంచెం నిశితంగా పరిశీలిద్దాం. అధిక బరువును తగ్గించుకోవాలని ప్రయత్నించేటప్పుడు అది, మీ ఆరోగ్యానికి ఒక సవాలుగా మారుతుందని మీరు తెలుసుకోవాలి. ఆహారం, వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలి. అధిక బరువుతో పోరాడే వారు, అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ క్రింది విషయాల పట్ల కొంచె అవగాహన కలిగి ఉండటం మంచిది.

బరువు పెరిగిన తర్వాత

బరువు పెరిగిన తర్వాత

బరువు పెరిగిన తర్వాత అధిక బరువును తగ్గించుకోవాలని ప్రయత్నించే వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. అవి ఏమిటో మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది ప్రతి రోజూ ఆరోగ్య సంరక్షణకు సవాలుగా మారుతుందన్న విషయం గుర్తించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దిన చర్యలో చేసే ఈ చిన్న పొరపాట్లే అధికబరువుకు కారణం అవుతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. అవి ఏంటో చూద్దాం.

అల్పాహారాన్ని మానేస్తుంటారు:

అల్పాహారాన్ని మానేస్తుంటారు:

అధిక బరువును తగ్గించుకోవాలనే క్రమంలో అల్పాహారం , భోజనాలు మానేస్తుంటారు. ఈ రెండింటితో అధికబరువును కంట్రోల్ చేయవచ్చు అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇది తప్పుడు నిర్ణయం. నిర్ణీత సమయంలో నిర్ణీత ఆహారం తీసుకునే వారిలో జీవక్రియల ప్రభావం ఉంటుంది. అలా చేయనప్పుడు శరీరంలో టాక్సిన్స్ ఓవర్ లోడ్ అవ్వడానికి కారణం అవుతుంది. అది మిమ్మల్ని ఊబకాయాలుగా మారడానికి దారితీస్తుంది.

ఒత్తిడి:

ఒత్తిడి:

యువతలో మరియు వయస్సు పెరిగే కొద్ది ఒత్తిడికి గురి అవుతుంటారు. ఇటువంటి పరిస్థితి తరచూ ఊబకాయానికి దారితీస్తుంది. ఒత్తిడిని అధిగమించలేని వారిలో అధిక బరువు సమస్యలుంటాయి. అందువల్ల ఒత్తిడిని నుండి బయటపడటానికి ప్రయత్నించడం చాలా అవసరం. అధిక బరువు ఉన్నామన్న ఆందోళనతో కొంత మంది ఆహారాన్ని తినడం మానేస్తుంటారు. అయితే ఒత్తిడిలో ఉన్నప్పుడు తమకు తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినడానికి మెగ్గు చూపుతారు. కాబట్టి ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త వహించాలి.

అధిక వ్యాయామం :

అధిక వ్యాయామం :

అధిక బరువు తగ్గాలనే ప్రయత్నంలో మితిమీరన వ్యాయామం చేస్తుంటారు. కానీ దీని వల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు కరిగి, మరింత ఎక్కువ ఆహానం తీసుకోవడానికి దారితీస్తుంది. అది మళ్ళీ మిమ్మల్ని ఊబకాయస్తులుగా మార్చుతుంది. అందువల్ల వ్యాయామం చేసే మందు జాగ్రత్తగా ఉండాలి. ఎంత మాత్రం వ్యాయామం చేయాలి, బరువు తగ్గడానికి ఎలాంటి వ్యాయామాలు సహాయపడుతాయన్న విషయం నిపుణుల ద్వారా తెలుసుకోవడం మంచిది.

 ఎక్కువగా డైటింగ్ చేయడం:

ఎక్కువగా డైటింగ్ చేయడం:

పొట్ట తగ్గించుకోవడానికి తరచూ చాలా మంది డైట్ ను అనుసరిస్తుంటారు. అలా ప్రతి ఆహారాన్ని తినడం మానేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు డైటీషియన్ ను సంప్రదించి సరైన ఆహార ప్రణాళికను ఫాలో అవ్వడం మంచిది.

మీరు తినే ఆహారం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోండి.

మీరు తినే ఆహారం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోండి.

అధిక బరువు ఉన్న వారికి తరచుగా వివిధ రకాల అసౌకర్యం ఉంటుంది. అధిక బరువు కారణంగా చాలా మంది ఆహారం పట్ల నియంత్రణ కలిగి ఉంటారు. కానీ ఇది ఆరోగ్యపరంగా ఒక విలన్ గా మారుతుంది. మీరు తినే ఆహారాల పట్ల జాగ్రత్తగా ఉండి, మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటూనే, అధిక బరువును కంట్రోల్ చేయగలరు.

లిక్విడ్ క్యాలరీలు తాగడం:

లిక్విడ్ క్యాలరీలు తాగడం:

ఆల్కహాల్ బెవరేజ్, సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ లు, సిరఫీ కాఫీ డ్రింక్స్, ఇతర హై షుగర్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువుకు కారణం అవుతుంది. ఇటువంటి పానీయాల్లో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి.

ఆహారాన్ని చాలా వేగంగా తినడం :

ఆహారాన్ని చాలా వేగంగా తినడం :

20 నిముషాల్లో మెదడుకు పొట్ట నిండిందనే సంకేతాలు వెళుతాయి?చెప్పలేము, చాలా త్వరగా తినడం, నమలకుండా తినడం వల్ల పొట్టలోకి ఆహారంతో పాటు గాలి కూడా వెళ్ళి గ్యాస్ట్రిక్ సమస్యకు కారణమవ్వడమే కాదు, ఊబకాయులుగా మార్చతుంది.

సరైన నిద్రలేకపోవడం

సరైన నిద్రలేకపోవడం

నిద్రలో లోపాలు మరియు మంచి నిద్ర లేకపోవడం , సరైన టైమ్ కు నిద్రపోకుండా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఇటు ఆరోగ్యం మీద ప్రభావం చూసి, అధిక బరువుకు దారితీస్తుంది. హార్మోనులు ప్రభావితం అవుతాయి. శక్తిలేకుండా చేస్తుంది. కనీసం రోజుకు 7 గంటల సేపు నిద్రపోవడం చాలా అవసరం.

విశ్రాంతి లేకపోవడం :

విశ్రాంతి లేకపోవడం :

ఒత్తిడి క్రమంగా పెరగడం వల్ల బెల్లీ ఫ్యాట్ కు గురిచేస్తుంది. అధిక ఒత్తిడిలో అనారోగ్యకరమైన ఆహారాలపై కోరికలు పెరుగుతాయి. దాంతో ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా ఒత్తిడి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బద్దకంగా మారి వ్యాయామం చేయక క్రమంగా బరువు పెరుగుతారు

English summary

Little things you are doing that could make you gain weight

In this article we explain some little things you are doing that could make you gain weight. Read on.
Story first published:Monday, September 9, 2019, 18:07 [IST]
Desktop Bottom Promotion