For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గే రహస్యాలేంటో తెలుసా..

|

ఏ మహిళ అయినా సరే ప్రసవం తర్వాత కొన్ని నెలల పాటు విరామం తీసుకుంటుంది. ఇది అత్యంత సహజమైన విషయం. కానీ సినిమా హీరోయిన్లు, స్పోర్ట్స్ స్టార్లు మాత్రం ఈ విరామాన్ని పూర్తిగా తగ్గించేస్తున్నారు.

ఇటీవల బాలీవుడ్ అందాల భామ సమీరా రెడ్డి రెండు నెలల పాపతో కర్నాటకలోని ఎత్తైన శిఖరాన్ని అవలీలగా ఎక్కేసింది. తను ఫిట్ గా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇందుకు గాను ఆమెను అనేక మంది ప్రశంసించారు. కొత్తగా తల్లులు అయిన వారందరికీ మీరే ఆదర్శం అని పొగడ్తలతో తెగ ట్వీట్లు వచ్చాయి.

1) ఫిట్ నెస్ బాటలో సానియా..

ఇప్పుడు అదే కోవలో సానియా మీర్జా కూడా ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతోంది. కాకపోతే సమీరారెడ్డిలాగా కాకుండా ఈ టెన్నిస్ స్టార్ జిమ్ బాట పట్టింది. ఇటీవలే తను 23 కిలోలు బరువు తగ్గాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలిపింది. అయితే ఏకంగా 26 కిలోల బరువు తగ్గినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. అంతేకాదు అందుకు సంబంధించి ఫొటోలను వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

2) సానియాకు ఏమనిపించిందంటే..

అయితే ఇటీవల మరో ఫిట్ నెస్ ఛాలెంజ్ ను చేపట్టింది. ప్రతిరోజూ తనకు సంబంధించిన ఎక్సర్ సైజ్ వీడియోలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికరమైన ట్యాగులను జత చేస్తోంది ఈ బ్యూటిఫుల్ మామ్. ఈ ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు తన మనసులో ఏమేమీ అనిపించిదో, ఆ భావాలన్నింటినీ క్యాప్షన్లుగా రాస్తోంది. ఇలా కొత్తగా తల్లి అయిన మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వారిలో ఎంతో స్ఫూర్తిని రగిలిస్తోంది.

3) ఆనందం రెట్టింపు..

తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో సానియా ఏమందంటే ‘‘ ప్రసవం తర్వాత తిరిగి వారి వారి పనుల్లో చేరాలని మహిళలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటం సహజమే. అయితే అందుకు కఠినమైన ఎక్సర్ సైజులు చేసి బరువు తగ్గి ఫిట్ గా మారితే సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ హెల్దీగా, ఎనర్జీటిక్ గా తయారు కావాలి. అలాగే మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి‘‘ అని సానియా చెప్పింది.

4) కండరాల నొప్పులు సహజం..

సాధారణంగా ఎక్సర్ సైజు చేయడం మొదలుపెట్టినా లేదంటే చాలా రోజుల విరామం తర్వాత తిరిగి ఎక్సర్ సైజ్ ప్రారంభించినా.. కండరాల నొప్పులు, శారీరక అలసట వంటివి అత్యంత సహజం. మన శరీరం రోజువారీ వర్కవుట్ కు అలవాటు పడే వరకూ ఇలాంటి తిప్పలన్నీ తప్పవు. ఇజాన్ పుట్టాక బరువు తగ్గి ఫిట్ గా మారేందుకు వర్కవుట్ రోటిన్ ని ప్రారంభించినప్పుడు తానూ ఇలాంటి కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నట్లు సానియా చెప్పింది.

5) కార్డియో ఎక్సర్ సైజ్..

తనకు సంబంధించినంత వరకు ఎక్కువగా కార్డియో ఎక్సర్ సైజులపైనే సానియా శ్రద్ధ పెట్టింది. కండరాల నొప్పులతో శరీరం బాగా బలహీనంగా మారినప్పుడు స్కిప్పింగ్, బర్పీన్, స్ప్రింట్స్ వంటివి ఎక్కువగా చేశాను. అయితే వీటిని చేసేందుకు నా శరీరం త్వరగానే అలవాటు పడినప్పటికీ నాలోని శక్తి చాలా వేగంగా క్షీణించింది. దీంతో ఇది కూడా కష్టంగా మారింది.

6) ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తేనే..

మనం చేసే ఏ పనుల్లో అయినా సమస్యలు, సవాళ్లు ఎదురవడం సాధారణమే. మనం రోజూ చేసే వర్కవుట్ విషయాల్లో ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో ప్రతికూల పరిస్థితుల్ని గ్రహిస్తూ, వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగితేనే విజయం వరిస్తుందని నిరూపించింది టెన్నిస్ స్టార్ సానియా.

7) అదొక స్వీట్ ఫీలింగ్..

మనం రోజూ చేసే వర్కవుట్ ఏదైనా సరే, మన శరీరాన్ని వార్మప్, యాక్టివేషన్ ఎక్సర్ సైజ్ మనకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఎంత కఠినమైన పని చేసినా దాన్ని ఇష్టంగా చేస్తే దాని ఫలితం చాలా మధురంగా ఉంటుంది.

8) గ్రేట్ జాబ్..

సానియా మీర్జా పోస్టు చేస్తున్న వీడియోలను చూసి నెటిజన్లు ఆమెను తెగ పొగిడేస్తున్నారు. సానియా మీ ఎక్సర్ సైజ్ కొత్తగా తల్లులు అయిన వారందరికీ ప్రేరణ ఇస్తుందని, మీరు గ్రేట్ జాబ్ చేస్తున్నారని రకరకాల పాజిటివ్ కామెంట్లతో సానియాను ప్రోత్సహిస్తున్నారు నెటిజన్లు.

9) ఆ క్షణం అద్భుతం..

తను ఏడో రోజు పోస్టు చేసిన వీడియోలో ఎక్కువగా డంబెల్స్, కెటిల్ బెల్, వెయిట్ లిఫ్టింగ్ వంటి వర్కవుట్లపైనే సానియా ఎక్కువగా శ్రద్ధ కనబరిచింది. ఇప్పుడు తన శరీరం వర్కవుట్స్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది నన్ను మరింత శక్తివంతంగా తయారు చేస్తుంది అని చెబుతోంది.

10) ఫిట్ గా ఉండాలన్న నమ్మకమే..

‘‘ప్రసవం తర్వాత కూడా ఫిట్ గా ఉండాలనుకున్న నా నమ్మకమే మళ్లీ ఈ దిశగా అడుగులు వేసేలా చేసింది. అయితే దీని కోసం శారీరకంగానే కాదు.. మానసికంగానూ సంసిద్ధం కావాలని గ్రహించాను. త్వరలోనే నేను మరింత శక్తిమంతంగా తయారై, టెన్నిస్ ని కూడా శిక్షణలో భాగంగా చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత సగర్వంగా టెన్నిస్ కోర్టులో అడుగు పెట్టాలనుకుంటున్నాను‘‘ అని సానియా సోషల్ మీడియా ద్వారా అందరికీ వివరించింది.

English summary

Sania Mirza Shares Secrets Of Her Post-Pregnancy Weight Loss. Here's Why You Should Start Doing This Exercise

Here we talking about sania mirza shares secrets of her post-pregnancy weight loss. Read on to know why you should start doing this exercise
Story first published: Thursday, October 10, 2019, 15:42 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more