For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో విటమిన్-సి ఎక్కువగా ఉండే ఈ డ్రింక్స్ తాగండి.. ఇమ్యూనిటీని ఈజీగా పెంచుకోండి...

సమ్మర్లో విటమిన్ సి డ్రింక్స్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఎలాంటి రోగాల బారిన పడరని తెలుసా. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం యొక్క ప్రాధాన్యతను అందరూ అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.

Vitamin C Drinks to Boost Immunity to Fight in Summer

ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం మరియు ఎలాంటి రోగాలు దరి చేరకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన పోషకాహారం, శారీరక వ్యాయామం, మంచి నిద్ర మరియు ఒత్తిడి లేని జీవితం అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.

Vitamin C Drinks to Boost Immunity to Fight in Summer

గత రెండు సంవత్సరాలుగా మనలో చాలా మంది ఎక్కువ ఇమ్యూనిటీ ఉండే ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. రోగనిరోధక శక్తి వల్ల వ్యాధికారకాలు, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు లేదా వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు. అయితే ముఖ్యంగా విటమిన్ సి ఎముకలు మరియు దంతాలను బలంగా మార్చడం, జీవక్రియను పెంచడం, గాయాలను నయం చేయడం మరియు చర్మం, జుట్టును ఆరోగ్యకరంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సందర్భంగా విటమిన్-సి ఏయే జ్యూస్ లలో ఎక్కువగా లభిస్తుంది. వేసవిలో ఎలాంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వేసవిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జననాంగాలను ఎలా శుభ్రం చేసుకోవాలి?వేసవిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జననాంగాలను ఎలా శుభ్రం చేసుకోవాలి?

విటమిన్ సి ఎక్కువగా ఉండే పానీయాలు..

విటమిన్ సి ఎక్కువగా ఉండే పానీయాలు..

స్ట్రా బెర్రీ-కివీ డ్రింక్ : విటమిన్ సి, బి1, బి9, బి6 బి12 ఎక్కువగా ఉండే పానీయాలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.

ఆరెంజ్ - గ్రేప్ జ్యూస్..

ఆరెంజ్ - గ్రేప్ జ్యూస్..

ఈ జ్యూస్ లో విటమన్ ఎ మరియు విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ ర్యాడికల్ డ్యామేజీని నివారిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుదలలో కచ్చితంగా సహాయపడుతుంది.

మధుమేహం: చక్కెరను నియంత్రించడానికి పసుపుతో ఈ 2 పదార్థాలను కలిపి, ఉదయం ఖాళీ కడుపుతో తినండి.మధుమేహం: చక్కెరను నియంత్రించడానికి పసుపుతో ఈ 2 పదార్థాలను కలిపి, ఉదయం ఖాళీ కడుపుతో తినండి.

టొమాటో జ్యూస్..

టొమాటో జ్యూస్..

తాజా టొమోటో రసంలో విటమిన్-ఎ, విటమిన్-సి మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల అంటువ్యాధులనేవి దరి చేరవు. మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయపడుతుంది.

గ్రీన్ యాపిల్-క్యారెట్ జ్యూస్...

గ్రీన్ యాపిల్-క్యారెట్ జ్యూస్...

ఈ డ్రింక్స్ లో విటమిన్ ఎ, విటమిన్-సి, విటమిన్-బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ బాడీలో రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మీ శరీరాన్ని రక్షిస్తుంది. వీటితో పాటు బీట్-క్యారెట్-అల్లం పానీయం తాగడం వల్ల మీకు వాపు, జలుబు, ఫ్లూ లక్షణాలు వంటివి దరి చేరవు.

విటమిన్ సితో ఆరోగ్య ప్రయోజనాలు..

విటమిన్ సితో ఆరోగ్య ప్రయోజనాలు..

* ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే హానికరమైన ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షించే యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది.

* విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

* విటమిన్ సి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది గౌట్ ప్రమాదాన్ని కలిగించదు.

* విటమిన్ సి రక్తహీనత, ఐరన్ లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

* ఇది మీ నాడీ వ్యవస్థను కూడా రక్షిస్తుంది మరియు చిత్త వైకల్యం మరియు ఇతర జ్ణాపకశక్తి రుగ్మతలను నిర్వహిస్తుంది.

FAQ's
  • విటమిన్ సి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?

    * ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే హానికరమైన ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షించే యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది.

    * విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

    * విటమిన్ సి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది గౌట్ ప్రమాదాన్ని కలిగించదు.

    * విటమిన్ సి రక్తహీనత, ఐరన్ లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

    * ఇది మీ నాడీ వ్యవస్థను కూడా రక్షిస్తుంది మరియు చిత్త వైకల్యం మరియు ఇతర జ్ణాపకశక్తి రుగ్మతలను నిర్వహిస్తుంది.

English summary

Vitamin C Drinks to Boost Immunity to Fight in Summer

Here are some vitamin C enriched drinks that can help against infection and keep disease at bay. Take a look
Desktop Bottom Promotion