For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే హేర్బల్ టీలు

|

ప్రస్తుత రోజుల్లో తలనొప్పి ఒక సాధారణ సమస్యగా మారింది. ఎవరి మాట్లాడినా తలనొప్పి...తలనొప్పి అంటుంటారు. తలనొప్పి వివిధ కారణాల వల్ల వివిధ సమయంలో వస్తుంటుంది. కొంత మందికి ఉదయం తలనొప్పి వస్తే మరికొందరికి మద్యహ్నానం..సాయంత్రాలలో వస్తుంటుంది అని చెబుతుంటారు. అందుకోసం కొన్ని మందులను తీసుకొని మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకుంటుంటారు. అయితే ఇవి స్వల్పకాలిక ఉపశమనం కలిగిస్తాయి. పవర్ ఉన్నంత సేపు నొప్పి తగ్గి, పవర్ తగ్గిన తర్వాత తలనొప్పి తిరిగి వస్తుంటుంది.

సాధరణ తలనొప్పి అయితే త్వరగా తగ్గించుకోవచ్చు. అయితే మైగ్రేన్ తలనొప్పి అయితే మంచి పరిష్కార మార్గంను ఎంపిక చేసుకోవాలి. రసాయనిక మందులతో కాకుండా, కొన్ని హేర్బల్ టీలు తలనొప్పికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . గ్రీన్ టీ, దాల్చిన చెక్క టీ మరియు జింజర్ టీ వంటివి తీసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ సింపుల్ హేర్బల్ టీలు మైగ్రేన్ తలనొప్పికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అయితే ఇవి మందుల కంటే కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అయితే మంచి ఫలితం ఉంటుంది.

READ MORE: వివిధ రకాల వ్యాధుల కోసం 15 రకాల హెర్బల్ టీలు

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి మీరు తీసుకొనే హెర్బల్ టీ లవ్ల ఎలాంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంతో పాటు, శరీరంలోని వ్యాధినిరోధకతను పెంచుతాయి. దాంతో జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

READ MORE: డయాబెటిస్ వ్యాధిని కంట్రోల్ చేసే 10 ది బెస్ట్ హేర్బల్ టీలు

మరి మీరు ఇదివరకే మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నట్లైతే ఈ క్రింద తెలిపిన హోం రెమెడీస్ ను ఫాలో అవ్వండి...

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

హేర్బల్ టీలో ఒక ఉత్తమమైనది గ్రీన్ టీ. ఇందులో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది అన్ని రకాల తలనొప్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా మైగ్రేన్ ను నివారిస్తుంది. గ్రీన్ టీలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకుంటే మరింత బెటర్ గా పనిచేస్తుంది.

అల్లం టీ:

అల్లం టీ:

జింజర్ టీ కణాలతో సహా ఉపశమనం కలిగిస్తుంది. జింజర్ హేర్బల్ టీ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో తలనొప్పిని నివారించుకోవచ్చు . గర్భణి స్త్రీలు జింజర్ టీను నివారించాలి.

చమంతి టీ:

చమంతి టీ:

మైగ్రేన్ తలనొప్పికి మరో హేర్బల్ టీ వేడి వేడిగా చామంతి టీని తీసుకోవడమే. మీరు చాలా ఎక్కువ తలనొప్పితో బాధపడుతున్నట్లైతే చామంతి టీ తీసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని డిఫరెన్స్ ను గమనించండి.

లెమన్ టీ:

లెమన్ టీ:

మైగ్రేన్ తలనొప్పిని నివారించడంలో మరో హేర్బల్ టీ బ్లాక్ లెమన్ టీ . ఒక కప్పు బ్లాక్ టీని షుగర్ లేకుండా తయారుచేయాలి . అందులో రెండు మూడు చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవాలి . ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి నివారించబడుతుంది.

రోజ్మెరీ టీ:

రోజ్మెరీ టీ:

రోజ్మెరీ టీలో ఉండే స్మూతింగ్ లక్షణాలు మైగ్రేన్ లక్షణాలను చాలా త్వరగా తగ్గిస్తుంది . రోజ్మెరి ఎసెన్స్ ను ఒక కప్పు టీలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. బరువును కూడా తగ్గించుకోవచ్చు.

పుదీనా టీ:

పుదీనా టీ:

పుదీనాలో ఉండే ఫ్లేవర్ వల్లే మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవచ్చు. వేడి వేడి బ్లాక్ టీని ఒక కప్పులో కొన్ని పుదీనా ఆకులు వేసి 10నిముషాలు నానిన తర్వాత తీసుకోవాలి.

దాల్చిన చెక్క టీ:

దాల్చిన చెక్క టీ:

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి ది బెస్ట్ హేర్బల్ టీ దాల్చిన చెక్క టీ. బ్లాక్ టీలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి త్రాగాలి.

యాలకలతో తయారుచేసిన టీ:

యాలకలతో తయారుచేసిన టీ:

యాలకలతో తయారుచేసిన హేర్బల్ టీ . మైగ్రేన్ తలనొప్పిని నివారించడానికి ఇది ఒక ఉత్తమమైన టీ. టీ తయారుచేసేటప్పుడు కొన్ని యాలకలు టీలో వేసి మరిగించి తీసుకోవాలి.

English summary

8 Teas That Help With Migraines: Health Tips in Telugu

When you wake up to a gruesome headache it feels like the whole world is tearing apart. Though there are several medications to treat these painful headaches especially migraines, it is always best to turn to home remedies.
Desktop Bottom Promotion