For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య నివారణకు ఉత్తమ హోం రెమెడీస్

|

Irregular Periods : 3 Home Remedies For Irregular Periods ! || Boldsky Telugu

అపక్రమ రుతుక్రమం(ఇర్రెగ్యులర్ పీరియడ్స్), వైద్య పరంగా ఓలిగోమినోరియా, అనేది మహిళల్లో సాధారణ సమస్య. తరచూ ఇలా ఇన్ ఫ్రీక్వెంట్ పీరియడ్స్(35డేస్)పైన తో బాధపడుతుంటారు. ప్రతి మహిళలో రుతుక్రమం యొక్క సమయం 28రోజులు, అయినా కూడా, పీరియడ్ రేజ్ 21 నుండి 31 డేస్ వరకూ ఉంటుంది. అందువల్ల, మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. అపక్రమ రుతుక్రమాన్ని నివారించడానికి కొన్ని ఆహారాలున్నాయి.ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను నివారించడానికి కొన్నిముఖ్యమైన ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఈ సమస్యకు వివిధ రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా జీవనశైలిలో ఒత్తిడి, అపక్రమ డైట్, వ్యాయామం లేకపోవడం, క్రమంగా అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, స్మోకింగ్, ఆల్కహాల్ , కెఫిన్, మందులు మరియు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల అది ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మీద ప్రభావం చూపుతుంది.

అంతేకాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు అనీమీయా, మోనోపాజ్, థైరాయిడ్ డిజార్డర్, హార్మోనుల అసమతుల్యత, మరియు ఇతర ఆరోగ్య సమస్యల నివారణకు ఉపయోగించే మందుల , ట్రీట్మెంట్స్ వల్ల, పీరియడ్స్ లో మార్పలు కలగవచ్చు. ఈ సమస్యను నివారించడానికి ఒక ప్రత్యేకమైన వైద్యపరమైన సహాయం తీసుకొన్నట్లైతే తప్పకుండా నివారించుకోవచ్చు.

అయితే, ఈ సమస్య నివారణకు మెడిసిన్ తీసుకోవడం కంటే, కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల సమస్య నివారించుకోవచ్చు.

మరి ఆ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

అల్లం

అల్లం

అల్లం, రుతుక్రమంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. అందువల్ల, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను నివారించడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.అందుకోసం అల్లం టీ లేదా రెగ్యులర్ వంటల్లో దీన్ని ఉపయోగించవచ్చు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

డయాబెటిస్ ను కంట్రోల్ చేయడం నుండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను నివారించడం వరకూ ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఒక గొప్ప హోం రెమెడీ. అంతే కాదు, వేరే ఇతర సమస్యలైనా చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.దాల్చిన చెక్క టీని త్రాగడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది.

కలబంద

కలబంద

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను నివారించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి, అలోవెరా జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం పరగడుపు తీసుకోవడం చాలా మంచిది. అంతే కాదు, బరువును కూడా కంట్రోల్ చేస్తుంది.

పసుపు

పసుపు

ఇది యూట్రస్స్ కు రక్తప్రసరణను అందిస్తుంది మరియు హార్మోనులను సమతుల్యం చేస్తుంది. అందువల్ల, ఇది రుతుక్రమంలో నొప్పి మరియు తిమ్మెర్లెను నివారిస్తుంది. దీన్ని పాలలో మిక్స్ చేసి తీసుకోవాలి.

పచ్చిబొప్పాయి

పచ్చిబొప్పాయి

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను సమస్యను ఎలా నివారించాలి? అందుకు పచ్చిబొప్పాయిని క్రమంగా తింటుండాలి.ఇంది నేరుగా యూట్రస్ మీద ప్రభావం చూపుతుంది. యూట్రస్ కు రక్త ప్రసరణను అందిస్తుంది. అదే విధంగా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను సమస్యను కూడా నివారిస్తుంది.

నువ్వులు

నువ్వులు

నువ్వుల్లో అధికంగా నూనెకంటెంట్ ఉంటుంది. ఇది హార్మోనుల ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది . ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్ ను రెగ్యులర్ చేస్తుంది. ఇది స్వీట్ డిష్ లీ మదా గార్నిష్ చేసి తీసుకోవచ్చు.

బెల్లం

బెల్లం

బెల్లం ఇందులో ఐరన్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది మరియు పీరియడ్స్ సమస్యకూడా ఉండదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గించడంలో ఇది ఒక ఉత్తమ ఆహారం.

క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్

క్యారెట్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి, ఇది ఇర్రెగ్యులర్ మెనుస్ట్రోషన్ సైకిల్ ను సమస్యను నివారిస్తుంది. కాబట్టి, క్యారెట్ ను మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ద్రాక్ష

ద్రాక్ష

ద్రాక్షలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, మెనుస్ట్రేషన్ సైకిల్ ను క్రమబద్దం చేస్తుంది. రక్తహీనత లేకుండా కాపాడుతుంది. పీరియడ్స్ సమస్యకు ఇది ఒక ఉత్తమ ఆహారం.

 జీలకర్ర

జీలకర్ర

దీన్ని జీరా అని కూడా పిలుస్తారు. రక్తహీనతకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. జలుబు నివారణకు దీన్ని కొన్ని వేల సంవత్సరాల నుండి హోం రెమెడీస్ లో ప్రధానమైనదిగా ఉపయోగిస్తున్నారు . ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బట్టర్ మిల్క్

బట్టర్ మిల్క్

మజ్జిగ లో క్యాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, ప్రోటీన్స్ మరియు పొటాషియం అధికంగా ఉంది. విటమిన్ బి వివిధ రకాలా హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నయం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 సోంపు

సోంపు

ఈస్ట్రోజ్ న్ మీదా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇదిస్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద పనిచేస్తుంది మరియు రెగ్యులర్ పీరియడ్స్ కు సహాయపడుతుంది

కొత్తిమీర జ్యూస్

కొత్తిమీర జ్యూస్

కొత్తిమీర జ్యూస్ హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది. పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహఆయపడుతుంది. అలాగే, పీరియడ్స్ లో నొప్పిని కూడా తగ్గిస్తుంది.

కాకరకాయ

కాకరకాయ

కాకరకాయ పీరియడ్స్ లోపాలకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉత్తమ ఫలితాలను పొందాలంటే, ఈ జ్యూస్ ను రోజూ రెండు సార్లు తీసుకోవాలి

ఫిగ్

ఫిగ్

అంజుర వేర్లను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని త్రాగవచ్చు. ఒక నెల ఇలా త్రాగడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య లేకుండా చేస్తుంది.

పార్ల్సే

పార్ల్సే

దీన్నే అజ్వైన్ అని కూడా అంటారు. ఇందులో విటమిన్ ఎ, కె, మరియు సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నివారించడానికి చికిత్సలా పనిచేస్తుంది

ఖర్జూరం

ఖర్జూరం

ఖర్జూరంను పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తక్షణ ఉపశమనం పొందవచ్చు.అంతే కాదు, ఇందలో న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది పీరియడ్స్ లోపాలను తగ్గించడానికిఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

Best Home Remedies To Cure Irregular Periods

Irregular period, medically known as oligomenorrhea, is a common problem among women. It means infrequent periods with intervals of more than 35 days. The average duration of menstrual cycle in a woman is of 28 days, but can also range from 21 to 35 days. However, you don't need to worry. There are some foods to cure irregular periods. Today, Boldsky shares with you best foods for irregular periods.
Story first published: Wednesday, January 14, 2015, 17:28 [IST]
Desktop Bottom Promotion