For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎసిడిటి వల్ల వచ్చే కడుపు నొప్పికి ఉపశమనం కలిగించే హోం రెమెడీస్

|

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన శరీరంలో జీర్ణక్రియకు సహాయపడే జీర్ణ రసాలు అధికమైనా లేదా తక్కువగా ఉన్న పొట్టనొప్పికి కారణం అవుతుంది . ముఖ్యంగా ఎసిడిటిగా లేదా గ్యాస్ , వికారం, చెడు శ్వాసతో బాధపడాల్సి వస్తుంది. ఇది అన్ని వయస్సుల వారిలో వచ్చే సాధరణ ఆరోగ్య సమస్య.

అందుకు ఎసిడిటి మరియు పొట్టనొప్పకి కారణం ఏంటని మీకు ఆశ్చర్యం కలగవచ్చు., అందుకోసం ఇక్కడ కొన్ని కారణాలు తెలపడం జరిగింది . స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయామ చేయకపోవడం, అపక్రమ ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, లేదా ఆల్కహాల్ తీసుకోవడం ముఖ్య కారణాలు కావచ్చు.

కాబట్టి, ఎసిడిటి వల్ల వచ్చే స్టొమక్ పెయిన్ నుండి మీరు ఉపశమనం పొందాలనుకుంటే , ఖచ్చితంగా ఈ క్రింది చిట్కాలను అనుసరించాల్సిందే . ఈ హోం రెమెడీస్ ను మన వంటగదిలో విరివిగా అందుబాటులో ఉంటాయి, మరియు ఇవి చౌకైనవి కూడా...మరికెందుకు ఆలస్యం ఈ హోం రెమెడీస్ మీద ఓ లుక్కేస్తే చాలు పొట్టనొప్పి ఇట్టే తగ్గించుకోవచ్చు:

చల్లటి పాలు:

చల్లటి పాలు:

ఎసిడిటి వల్ల వచ్చే కడుపు నొప్పిని నివారించడానికి చల్లటి పాలు గ్రేట్ గా సహాయపడుతాయి. రాత్రుల్లో ఈ సమస్యతో మీరు బాధపడుతున్నట్లైతే నిద్రించడానికి ముందు ఒక గ్లాసు చల్లటి పాలను తీసుకోవాలి. పాలలో ఉండే ఆ లక్షణాలు కడుపు నొప్పి నుండి ఉపశమనంకలిగిస్తుంది మరియు పొట్టను చల్లగా ఉంచుతుంది.

మజ్జిగ -

మజ్జిగ -

ఈ స్మూతింగ్ డ్రింక్ ఎసిడిటి వల్ల వచ్చే పొట్టనొప్పిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . అందుకు మీరు చేయాల్సిందల్లా, పెప్పర్ లేకుండా బట్టర్ మిల్క్ ను తీసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి తీసుకొన్న తర్వాత ఒక 5 నిముషాలు నడవడం వల్ల పొట్టను చల్లబరుస్తుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

మీరు టీ త్రాగాలని అనుకుంటుంటే, ఈ పొట్ట సమస్యలకు గోరువెచ్చని గ్రీన్ టీ బెటర్ ఆప్షన్ . గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ పొట్ట ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతాయి .దీనికి కొద్దిగా నిమ్మరసం జోడించడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పొట్ట నొప్పిని నివారిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఎసిడిటి వల్ల వచ్చే కడుపు నొప్పి నివారించుకోవడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ ఆపిల్ సైడర్ వెనిగర్. ఒక గ్లాసు చల్లని నీళ్లలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి నిధానంగా కొద్దికొద్దిగా త్రాగితే ఎక్కువ ప్రయోజనం. ఈ వెనిగర్ నొప్పిని మరియు ఇతర ఇన్ఫెక్షన్స్ నివారించడంతో పాటు పొట్టకు చల్లదనం కలిగిస్తుంది.

గంజి:

గంజి:

రైస్ వాటర్ ను త్రాగడం వల్ల ఎసిడిటిని తగ్గించుకోవచ్చు. అన్నం ఉడికిన తర్వాత వంచే గంజి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో చిటికెడు ఉప్పు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఎసిడిటి వల్ల వచ్చే పొట్టనొప్పిని తగ్గిస్తుంది. అంతే కాదు వ్యాధినిరోధకతను కూడా పెంచడంలో ఒది ఒక బెస్ట్ హోం రెమెడీ.

లెమన్ వాటర్:

లెమన్ వాటర్:

ప్రతి రోజూ ఉదయం కాలీ పొట్టతో నిమ్మరసం త్రాగడం మంచిది . ఈ సింపుల్ హోం రెమెడీ పొట్టనొప్పిని నివారిస్తుంది మరియు ఎసిడిటిని తగ్గిస్తుంది . దీన్ని అనుసరించడం చాలా సులభం మరియు కొద్ది రోజులు తాగితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

English summary

Home Remedies For Stomach Pain Due To Acidity

According to experts, it is said that an excess or imbalance of digestive acids produced by the stomach will cause a tummy ache along with acidity or gas, nausea, bad breath. This is one of the many common health problems which is faced people of all ages.
Story first published: Thursday, October 22, 2015, 17:05 [IST]
Desktop Bottom Promotion