For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళ్లలో నిర్లక్ష్యం చేయకూడని కిడ్నీ స్టోన్ యొక్క లక్షణాలు

|

కిడ్నీ స్టోన్ అనేది సాధారణ సమస్య కాదు . ప్రతి 10 మందిలో 7 మంది కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నట్లు అందులోనే కిడ్నీస్టోన్ సమస్యలు ఎక్కువగా మహిళల్లో ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. కిడ్నీలో కొన్ని రకాల కెమికల్స్ కరిగకపోవడం వల్ల అవి స్టోన్స్ గా రూపాంతరం చెందుతాయి . ఈ ప్రాబ్లమాటిక్ కండీషన్ ను వైద్యపరిభాషలో నెప్రోలిథియాసిస్ లేదా యూరోలిథియాసిస్ అనిపిలుస్తారు. అలాగే స్ట్రూవిట్ స్టోన్స్ అని కూడా అంటారు .

కిడ్నీస్టోన్స్ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, మరియు అనిమల్ ప్రోటీన్ మరియు ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్ట్రోన్స్ కు దారితీస్తుంది . మరో వైద్యపరమైన కారణం క్యాల్షియంతో పాటు యాంటీసిడ్స్ అధికంగా ఉండే మెడికేషన్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడుటకు కారణం అవుతాయి.

కిడ్నీలో స్టోన్స్ కు మీరు తీసుకొనే ఆహారమే కారణమా...

కిడ్నీస్టోన్స్ ను నివారించుకోవడం చాలా సులభం. వీటిని కొన్ని మెడికేషన్స్ ద్వారానే కరిగిపోయేలా చేసి మూత్రంతో పాటు బయటకు వచ్చే విధంగా చికిత్సవిధానాలు అందుబాటులో ఉన్నాయి . అయితే ఇవి చిన్న సైజు కిడ్నీ స్టోన్స్ ను మెడికేషన్స్ ద్వారా తొలగించుకోవచ్చు. అయితే పెద్దసైజులో ఉండే కిడ్నీ స్టోన్స్ కు మెడిసిన్స్ పనిచేయక అవి యురేత్రాలోనికి చేరుతాయి. ఇది బ్లాడర్ కు కిడ్నీకి న్యారో ట్యూబ్ లా ఉంటుంది . కిడ్నీ స్టోన్స్ ఈ యురేత్రాలో వచ్చి చేరడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా తయారవుతుంది. ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి సహజ పద్దతులు

కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మహిళలు కిడ్నీస్టోన్స్ ను ముందుగానే గుర్తించడానికి కొన్ని సంకేతాలు లేదా లక్షణాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుపుతున్నాము. ఈ లక్షణాలను కనుక మహిళలు ప్రారంభ దశలోనే గుర్తించినట్లైతే శరీరం నుండి స్ట్రోన్స్ బయటకు ఫ్లష్ అవుట్ చేయడానికి మరింత సులభం అవుతుంది. మరి లక్షణాలెలా ఉంటాయో చూద్దాం....

యూరినేషన్ :

యూరినేషన్ :

మహిళల్లో కిడ్నీస్టోన్ యొక్క బేసిక్ సంకేతం యూరినేషన్ సమస్య. ఈ సంకేతము సాధారణంగా మూత్రవిసర్జన చేసే సమయంలో లేదా యురేత్రాకు చేరిన సమయంలో ఈ లక్షణం కనబడుతుంది. ఈ పరిస్థితిలో, మహిళలు ఎక్కువ ద్రవాలను త్రాగడం వల్ల స్టోన్ ను మూత్రవిసర్జన రూపంలో ఫాస్ట్ ను ఫ్లష్ అవుట్ చేయవచ్చు.

 వికారం:

వికారం:

తరచూ బలమీనంగా, వికారానికి గురి అవుతుంటారు . వికారంతో పాటు హెవీ ఫీవర్ రావడం వల్ల కూడా ఇది ఒక సంకేతంగా గుర్తించాలి.

ముదురు రంగులో యూరిన్:

ముదురు రంగులో యూరిన్:

మూత్రం ముదువర్ణంలో ఉన్నట్లైతే మహిళల్లో ఇది కూడా ఒక సంకేతంగా గుర్తించాలి . ఇంకా కొన్ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కారణంగా కూడా మూత్రం ఇలా ముదురురంగులో కనిపిస్తుంటుంది . కాబట్టి, సమస్య ఏదైనా తీవ్రమైనదే కాబట్టి, యూరిన్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది

మూత్రవిసర్జనకు అర్జెంట్ అవ్వడం:

మూత్రవిసర్జనకు అర్జెంట్ అవ్వడం:

ఫ్రీక్వెంట్ యూరినేషన్ కు వివిధ కారణాలు ఉండవచ్చు. అయితే పైన తెలిపిన ఇతర లక్షణాలతో పాటు, తరచూ మూత్రవిసర్జన లేదా వెంట వెంటనే మూత్రవిసర్జన చేయాలనిపించినా అది కిడ్నీలో స్టోన్ ఉందనడానికి ఒక క్లియర్ ఇండికేషన్ .

ఫీవర్:

ఫీవర్:

హైఫీవర్ మరోక సంకేతం. దీన్ని ఏమాత్రం విస్మరించడానికి వీలులేదు. ముఖ్యంగా ఫీవర్ తో పాటు, వికారం, యూరిన్ రంగులో మార్పులు గమనించినట్లైతే ఏమాత్రం విస్మరించడానికి లేదు. బాడీ టెంపరేచర్ ను మెడికేషన్స్ ద్వారా తగ్గించుకోవాలి . అలాగే తలకు కోల్డ్ ఐస్ ప్యాక్ ను మర్దన చేసుకోవాలి.

పొత్తికడుపులోనొప్పి:

పొత్తికడుపులోనొప్పి:

పొట్ట ఉదరంలో నొప్పి మరియు ముదురంగులో మూత్ర విసర్జన కిడ్నీస్టోన్ కు ఒక సంకేతం. దీన్ని కూడా ఏమాత్రం విస్మరించడానికిలేదు . కిడ్నీస్టోన్స్ కు సంబంధించిన యూరిన్ టెస్ట్ ను చేయించుకొని డౌట్ ను క్లియర్ చేసుకోవడం చాలా అవసరం.

అధికంగా చెమటలు పట్టడం:

అధికంగా చెమటలు పట్టడం:

బహుమూలల్లో అధికంగా చెమటలు పట్టడం. ముఖ్యంగా ముఖంలో బహుమూలల్లో చెమటలు పట్టడం, మరియు ఏమాత్రం తగ్గకుండా చెమటలు విపరీతంగా పడుతుంటే , కిడ్నీ స్టోన్ ఉందని తెలిపే లక్షణాల్లో ఇదొక ప్రధాన లక్షణం.

యూరిన్లో బ్లడ్:

యూరిన్లో బ్లడ్:

యూరిన్ రెడ్ కలర్లో లేదా పింక్ కలర్లో ఉన్నట్లైతే అది కాస్తా తీవ్రపరిస్థితిగా గుర్తించి, యూరిన్ స్మెల్ ను గుర్తించి వెంటనే డాక్టర్ ను కలిసి యూరిన్ టెస్ట్ చేయించుకొని తగిన చికిత్సను తీసుకోవాలి.

నొప్పి తీవ్రంగా ఉండటం:

నొప్పి తీవ్రంగా ఉండటం:

మహిళల్లో కిడ్నీ స్టోన్ కు మరో సంకేతం మూత్రవిసర్జన సమయంలో యురెత్రా నుండి స్టోన్ ముందుకు సాప్ అయ్యే సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవించడం.

బర్నింగ్ సెన్సేషన్:

బర్నింగ్ సెన్సేషన్:

మహిళ్లల్లో కిడ్నీ స్టోన్ ఉందని తెలిపే మరో లక్షణం మూత్రవిసర్న సమయంలో యోనివద్ద తీవ్రంగా మంటగా అనిపించడం. మరియు స్టోన్ తొలగించిన తర్వాత కూడా మహిళల్లో బర్నింగ్ సెన్షేషన్ అలాగే కంటిన్యు అవుతుంది.

English summary

Kidney Stones: 10 Signs Women Should Not Ignore

Kidney Stones: 10 Signs Women Should Not Ignore, Kidney stones is not a common problem. It is stated out of every 10, there are around 7 people who suffer from kidney stones and most of them are women. Kidney stones are hard chemical deposits that form inside the kidneys.
Story first published: Tuesday, December 15, 2015, 18:16 [IST]
Desktop Bottom Promotion