For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతక కోలన్ క్యాన్సర్ ను నివారించే నేచురల్ మార్గాలు..

|

పేరుకూ, విధులకూ... ఈ రెండిటి విషయంలోనూ పెద్దది... పెద్దపేగు. దీన్నే ఇంగ్లిష్‌లో కోలన్ అంటారు. ఈ అవయవానికి క్యాన్సర్ వస్తే దాన్ని 'కోలన్ క్యాన్సర్' అని పిలుస్తారు. మనం తిన్న ఆహారంలో అన్ని పోషకపదార్థాలను ఒంటికి పట్టేలే చేసేవి చిన్న పేగులైతే... శరీరానికి అవసరమైన నీటిని, పొటాషియం లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను ఒంటికి పట్టేలా చేసే బాధ్యత పెద్దపేగుదే. ఆ తర్వాత వ్యర్థాలను మల ద్వారం గుండా బయటికి పంపివేయడం కూడా దానిపనే. మలద్వారాన్ని రెక్టమ్ అంటారు. పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే దాన్ని కోలన్ క్యాన్సర్ అని, మలద్వారానికీ అది సోకితే రెక్టల్ క్యాన్సర్ అనీ అంటారు. ఇప్పుడు ముందుగానే గుర్తిస్తే కోలన్ క్యాన్సర్‌కు సమర్థంగా చికిత్స చేయవచ్చు.

క్యాన్సర్ సోకినప్పుడు పెద్దపేగుకు కండపెరిగినట్లుగా కొన్ని బొడిపెలు వస్తాయి. వాటినే పాలిప్స్ అని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి బొడిపెలూ లేకుండా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది వంశపారంపర్యంగా రాదు. కాకపోతే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఉంటే ఇది వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. అందుకే ఇలా వచ్చిన వారి పిల్లలకు 15 ఏళ్ల వయసు నుంచే తరచూ స్క్రీనింగ్ చేయడం అవసరం. ఎందుకంటే కోలన్ క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత బాగా నయమవుతుంది.

శరీరంలోని అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

కోలన్ క్యాన్సర్ లక్షణాలు: స్టూల్ (మలంలో)రక్తం పడటం, సడన్ గా బరువు తగ్గడం, రెక్టల్ బ్లీడింగ్, ప్రేగుల్లో అసౌకర్యంగా ఉండటం, ఎక్కువ టాయిలెట్ కు వెళ్లడం లేదా బౌల్ మూమెంట్ సరిగా లేకపోవడం. కోలన్ క్యాన్సర్ నేరుగా మనం తీసుకొనే డైట్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు, రెగ్యులర్ గా వ్యాయం చేయడం వల్ల చాలా వరకూ క్యాన్సర్ రిలేటెడ్ లక్షణాలను నివారించుకోవచ్చు.

ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోండి.. ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోండి..

కోలన్ క్యాన్సర్ నివారణకు వివిధ రకాల హోం రెమెడీస్ ఉన్నాయి . అందువల్ల, కొన్ని హోం రెమెడీస్ ను లిస్ట్ అవుట్ చేసి ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. వీటిని కనుకు రెగ్యులర్ గా తీసుకొన్నట్లైతే కోలన్ క్యాన్సర్ నివారించుకోవచ్చు. మరి నేచురల్ మార్గాలేంటో చూద్దాం...

జెన్సింగ్:

జెన్సింగ్:

క్యాన్సర్ వంటి వాటి నివారణకు జెన్సింగ్ ను చికిత్సగా తీసుకోవడానికి ఎక్కువగా మద్దతివ్వడం జరిగింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల , ఇవి క్యాన్సర్ సెల్స్ ను మరియు క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను నాశనం చేయడానికి సహాయపడుతాయి . కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ క్యాచెసిన్స్ మరియు ఎపిక్యాచెసిన్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని క్యాన్సర్ కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను తగ్గించి క్యాన్సర్ ను నివారిస్తుంది. కాబట్టి డైలీ డైట్ లో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్ ను గ్రేట్ గా నివారించుకోవచ్చు.

గార్లిక్:

గార్లిక్:

వెల్లుల్లి వాసన అంటే పడనివారు చాలా మందే ఉండవచ్చు. అయితే గుండె ఆరోగ్యాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది, అంతే కాదు పెద్దప్రేగు ను శుభ్రపరచేటటువంటి ఆహారాల్లో ఇది ఒకటి.

ఫ్లాక్స్ సీడ్స్ లేదా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ :

ఫ్లాక్స్ సీడ్స్ లేదా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ :

ఫ్లాక్సీడ్స్ ల ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్స్ మరియు నేచురల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఫ్లాక్ సీడ్స్ నీటిని గ్రహించి కోలన్ ను విస్త్రుతపరుస్తుంది. దాంతో టాక్సిన్ మరియు మ్యూకస్ ను శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది. దాంతో పాటు, క్యాన్సర్, గుండె జబ్బులను మరియు డయాబెటిస్ ను నివారిస్తుంది.

సాల్మన్ :

సాల్మన్ :

సాల్మన్ చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు డైజెస్టివ్ ట్రాక్ ను శుభ్రం చేసే ఆయిల్స్ పెద్దప్రేగును శుభ్రం చేయడానికి సహాపడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బ్లూ బెర్రీస్ :

బ్లూ బెర్రీస్ :

బ్లూ బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సేరియస్ సెల్స్ కు ఎదుర్కొనే పాజిటివ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి . అంతే కాదు, వ్యాధినిరోధకతను పెంచే గుణాలు కూడా మెండుగా ఉంటాయి . ఇవి శరీరంలో సెల్యులార్ మోషన్ మరియు ఫ్రీరాడికల్స్ తగ్గించి క్యాన్సర్ రాకుండా శరీరాన్ని కాపాడుతాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు కోలన్ (పెద్ద ప్రేగును)శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. డైజిస్టివ్ ట్రాక్ (జీర్ణ కోశాన్ని) శుభ్రంగా ఉంచడానికి సహాయపడతుంది. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఆకుకూరలు రెగ్యులర్ బౌల్ మూమెంట్ ను ప్రమోట్ చేస్తాయి . కోలన్ క్యాన్సర్ కు కారణం అయ్యే లక్షణాలు తగ్గిస్తాయి.

English summary

Natural Ways To Treat Colon Cancer

Colon cancer, also known as colorectal cancer or bowel cancer, is the third most common type of cancer. It is also the second leading cause for a cancer death. It frequently occurs after the age of 50. Genetic factors play a major role in its development.
Story first published: Saturday, December 26, 2015, 16:32 [IST]