For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌ద్యం మానేయ‌డానికి ప‌వ‌ర్ ఫుల్ రెమిడీస్

By Nutheti
|

మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసినా.. మానేయ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. ఆల్క‌హాల్ కి అడిక్ట్ అయ్యారు అన‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంత ప్ర‌య‌త్నించినా.. ఒక్క‌సారి మ‌ద్యానికి బానిస‌య్యాక‌.. బ‌య‌ట‌కు రావ‌డం చాలా క‌ష్టం అంటూ ఉంటారు.

చాలా ర‌కాలుగా చాలా మంది మ‌ద్యం సేవించ‌డం మానేయాల‌ని ట్రై చేస్తూ ఉంటారు. కానీ.. త‌మ‌ని తాము మ‌ద్యం తాగ‌కుండా కంట్రోల్ చేసుకోవ‌డానికి చాలాల ఇబ్బంది ప‌డుతుంటారు. అయితే మ‌ద్యం సేవించ‌కుండా అడ్డుక‌ట్ట‌వేయ‌డానికి చాలా మార్గాలే ఉన్నాయి. అలాగే ఫెయిల్ అయిన సంద‌ర్భాలూ ఉన్నాయి. రెగ్యుల‌ర్ గా మ‌ద్యం సేవించే వాళ్లు మానేయ‌డానికి చాలా ఇబ్బందిప‌డ‌తారు. అయితే ఇలాంటి వాళ్ల‌కు చ‌క్క‌టి రెడిడీస్ ఉన్నాయి.

మెడిక‌ల్ గా కంటే.. న్యాచుర‌ల్ రెమిడీస్ ద్వారా ఆల్క‌హాల్ సేవించ‌కుండా అడ్డుక‌ట్ట‌వేసే మార్గాలున్నాయి. ఇలాంటి స‌హ‌జ మార్గాల వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. మానేయ‌ల‌ని భావించే వాళ్లు.. ఈ రెమిడీస్ ట్రై చేస్తే మంచి ఫ‌లితాలుంటాయి.

alcohol

వేరే ప‌నుల‌తో మైండ్ డైవ‌ర్ట్:
ఆల్క‌హాల్ మానేయాల‌నుకునేవాళ్ల‌కు ఇది సుల‌భ‌మైన‌, చ‌క్క‌టి ప‌రిష్కారం. మీకు ఆల్క‌హాల్ తీసుకోవాలి అనిపించిన‌ప్పుడు.. మీరు చాలా ఇష్ట‌ప‌డే ప‌ని చేయ‌డం మొద‌లుపెట్టండి. దీనివ‌ల్ల మీ మైండ్ డైవ‌ర్ట్ అవుతుంది. లేదా వాకింగ్ కి వెళ్ల‌డం, బుక్స్ చ‌ద‌వ‌డం, వ్యాయామం చేయ‌డం వంటి ప‌నుల ద్వారా ఆల్క‌హాల్ తీసుకోకుండా ఉండ‌వ‌చ్చు.

ఇష్ట‌మైన‌వాళ్ల‌తో మాట్లాడ‌టం:
మ‌ద్యం తీసుకోవ‌డం వ‌దిలిపెట్టాలి అనుకున్న‌ప్పుడు.. మీకు ఇష్ట‌మైన‌వాళ్ల హెల్ప్ తీసుకోండి. ఆల్క‌హాల్ తీసుకోవాలి అనిపించిన‌ప్పుడు ఇష్ట‌మైన వాళ్ల‌తో కాసేపు స్పెండ్ చేయ‌డం, మాట్లాడ‌టం వల్ల మైండ్ డైవ‌ర్ట్ అయి.. ఆల్క‌హాల్ తీసుకోవాల‌న్న ఆలోచ‌న నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

sugar

పంచ‌దార‌:
చాలా సంద‌ర్బాల్లో ఇది వ‌ర్క‌వుట్ అవుతుంది. మ‌ద్యం మానేయాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు మానేసే ప్ర‌య‌త్నాల్లో ఇది చాలా స‌క్సెస్ ఫుల్ గా ప‌నిచేస్తుంది. అప్పుడ‌ప్పుడు ఆల్క‌హాల్ తీసుకునేవాళ్లు మ‌ద్యం తాగాలి అనిపించిన‌ప్పుడు పంచ‌దార డ్రింక్ తీసుకుంటే స‌రిపోతుంది. లేదంటే ఒక గ్లాస్ సోడా లేదా ఏదైనా తీపి ప‌దార్థం తీసుకుంటే.. మ‌ద్య‌పానానికి గుడ్ బై చెప్ప‌వ‌చ్చు. ఇది చాలా ఎఫెక్టివ్ గా ప‌నిచేస్తుంది.

food

ఆహారం:
ఆక‌లిగా ఉన్న‌ప్పుడు ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. పొట్ట‌లో ఖాళీగా, ఆక‌లిగా ఉండ‌టం, భోజ‌నం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌ద్యం సేవించాల‌నే ఆలోచ‌న వ‌స్తుంది. కాబ‌ట్టి మంచి ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ద్యం తాగాల‌నే ఆలోచ‌న నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ సైక‌లాజిక‌ల్ రెమిడీ ద్వారా పాజిటివ్ రిజ‌ల్ట్స్ పొంద‌వ‌చ్చు.

మంచినీళ్లు:
ఈ రెమిడీస్ తోపాటు రోజుకి 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివ‌ల్ల వేరే డ్రింక్స్ తాగాల‌నే ఆలోచ‌న నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఆల్క‌హాల్ ఆలోచ‌న దూర‌మ‌వ‌డంతోపాటు.. ఆరోగ్యం, ప్ర‌శాంత‌త మీ సొంత‌మ‌వుతుంది.

English summary

Remedies To Reduce Alcohol Cravings

Even if people know that consuming alcohol is injurious to health, they cannot stop themselves from drinking it. It is the strongest example of addiction that drags people towards it.
Story first published: Saturday, December 26, 2015, 10:47 [IST]
Desktop Bottom Promotion