For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తీవ్రంగా ఇబ్బంది పెట్టే చిగుళ్ల వాపు తగ్గించే హోం రెమిడీస్..!!

By Swathi
|

చిగుళ్ల వాపు అనేది సాధారణంగా కనిపించే సమస్య. చాలా వరకు అందరూ ఈ సమస్యతో ఇబ్బందిపడుతూ ఉంటారు. కొంతమందికి ఇది చాలా తరచుగా వస్తుంటుంది. ఒకసారి ఈ సమస్య వచ్చిందంటే.. చాలా తీవ్రమైన నొప్పి, డిస్ కంఫర్ట్ ఉంటుంది. చిగుళ్ల వాపు ఉన్నప్పుడు.. కనీసం బ్రష్ చేయడానికి, ఏదీ నమలడానికి కూడా రాదు.

సాధారణంగా చిగుళ్లు పింక్ కలర్ లో ఉంటాయి. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ గా మారుతాయి. కొన్ని సందర్భాల్లో చిగుళ్ల వాపు కారణంగా.. చిగుళ్ల నుంచి రక్తస్రావం కూడా అవుతుంది. చిగుళ్ల వాపు సమస్యకు చాలా కారనాలున్నాయి. న్యూట్రీషనల్ డెఫిసియన్సీ, ఓరల్ ఇన్ఫెక్షన్స్, జింగ్విటీస్ కూడా ఈ సమస్యకు కారణమవుతాయి.

ఈ చిగుళ్ల వాపు సమస్య నివారించడానికి మౌత్ వాష్, పేస్ట్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించగానే.. వాపు తగ్గి, నొప్పి తగ్గిస్తాయి. కానీ.. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. కాబట్టి.. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడటానికి.. హోం రెమిడీస్ ఉపయోగిస్తే.. చాలా ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.

సాల్ట్ వాటర్

సాల్ట్ వాటర్

ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ నివారించడానికి సాల్ట్ వాటర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సాల్ట్ వాటర్ తో నోటిని పుక్కిలించడం వల్ల.. ఇన్ఫెక్షన్స్ నివారించి చిగుళ్ల వాపు నుంచి బయటపడవచ్చు.

లవంగం

లవంగం

ఈ ట్రెడిషనల్ ట్రిక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది చిగుళ్ల వాపు తగ్గిస్తుంది.

తుమ్మ

తుమ్మ

చిగుళ్ల వాపు తగ్గించడానికి మన అమ్మమ్మలు పాటించిన చిట్కా తుమ్మ బెరడు. కాబట్టి తుమ్మ బెరడుని నీటిలో ఉడికించి.. ఆ నీటితో రెండుమూడు నిమిషాలు నోరు పుక్కిలిస్తే.. అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు.

ఆముదం

ఆముదం

ఆముందంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. చిగుళ్ల వాపు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చిగుళ్ల వాపు ఉన్న ప్రాంతంలో ఆముదాన్ని అప్లై చేసి.. నొప్పి, వాపు తగ్గుతాయి.

అల్లం

అల్లం

అల్లంలో కూడా యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది నోట్లో ఉన్న బ్యాక్టీరియా నివారిస్తుంది.

నిమ్మ రసం

నిమ్మ రసం

నిమ్మలో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు.. నోట్లో బ్యాక్టీరియాను వెంటనే నాశనం చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్ని లెమన్ వాటర్ తో నోటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

అలోవెరా

అలోవెరా

అలోవెరా జెల్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది చిగుళ్ల వాపు నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

ఆవనూనె

ఆవనూనె

ఆవనూనెలో యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ ఉండటం వల్ల.. అది ఇన్ల్ఫమేషన్ నుంచి, చిగుళ్ల వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి చిటికెడు ఉప్పుకి ఈ నూనెను కలిపి.. వాపు ఉన్న చిగుళ్లకు రాయడం వల్ల.. ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్

హైడ్రోజన్ పెరాక్సైడ్

హైడ్రోజన్ పెరాక్సైడ్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. దీన్ని నీటిలో కలిపి.. వారానికి రెండుసార్లు నోటిని శుభ్రం చేసుకుంటే.. చిగుళ్ల వాపు తగ్గి.. చిగుళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ తో చిగుళ్లను మసాజ్ చేయడం వల్ల.. నొప్పి తగ్గించుకోవచ్చు. వాపును ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

English summary

10 Best Home Remedies To Cure Swollen Gums Naturally

10 Best Home Remedies To Cure Swollen Gums Naturally.
Story first published:Friday, May 6, 2016, 17:04 [IST]
Desktop Bottom Promotion