For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ కి దూరంగా ఉండాలంటే ఈ మార్పులు తప్పనిసరి

By Swathi
|

ప్రస్తుత రోజుల్లో అందరినీ వణికిస్తున్న భూతం క్యాన్సర్ ! ఇది ప్రాణాంతకమైనది కావడమే ఇందుకు కారణం. ఒక్కసారి క్యాన్సర్ చుట్టుముట్టిందంటే.. ఇక ప్రాణాలతో పోరాటమే అన్న భావన అందరిలో ఉంది. అయితే క్యాన్సర్ ఎప్పుడు, ఎవరికి ఎలా వస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి.. ఈ భయంకరమైన క్యాన్సర్ తో పోరాడటం కంటే.. ముందుగానే రాకుండా నిరోధించడం చాలా మంచిది.

ఎక్కువగా మనం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగానే క్యాన్సర్ ఎటాక్ అవుతున్నట్లు అమెరికన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ లో తేలింది. 90 నుంచి 95 శాతం మంది డైట్, లైఫ్ స్టైల్ హ్యాబిట్సే కారణమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. మనలో క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవాలంటే.. కొన్ని రకాల మార్పులు తీసుకురావాలని ఈ స్టడీస్ సూచిస్తున్నాయి. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ రిస్క్ ని కట్ చేసే 10 రకాల మార్పులు ఏంటో తెలుసుకుందాం..

ఆకుకూరలు

ఆకుకూరలు

హెల్తీ డైట్ ఫాలో అవడం వల్ల క్యాన్సర్ నిరోధింవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలి. సరైన పోషక విలువలు అందించే ఆహారాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చు. శరీరంలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటే.. క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశాలు ఉండవు.

నిద్ర

నిద్ర

నిద్రలేమి, తక్కువగా నిద్రపోవడం వంటి సమస్యల కారణంగా హార్మోన్స్ లో మార్పు వచ్చి, ఒత్తిడికి కారణమవుతుంది. నిద్రకు దూరమైతే.. హార్మనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. ఇలా నిద్రలో సమస్యలు ఎక్కువైతే.. క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని స్టడీస్ హెచ్చరిస్తున్నాయి. కాబట్టి.. కంటినిండా నిద్రపోవాలి. పెద్దవాళ్లు 7 నుంచి 9 గంటలపాటు నిద్రపోవడం వల్ల.. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతన్నాయి.

శరీర బరువు

శరీర బరువు

అధిక బరువు, ఒబేసిటీ 20 శాతం క్యాన్సర్ సంబంధిత సమస్యలు తీసుకొస్తుంది. బీఎమ్ఐ 25 కంటే ఎక్కువ ఉన్నవాళ్లలో బ్రెస్ట్, కోలన్, కిడ్నీ, గాల్ బ్లాడర్, ఓవరీ, ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు ఉంటుంది. కాబట్టి.. మీ హైట్ ని బట్టి.. మీ శరీర బరువు అంటే.. హెల్తీ వెయిట్ ఉండేలా జాగ్రత్త పడాలి. ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల.. రకరకాల వ్యాధులతో పాటు క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చట. అయితే ఒత్తిడికి, క్యాన్సర్ కి డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా.. ఒత్తిడి కారణంగా ఇతర సమస్యలు ఎదురవుతాయి. అంటే.. ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు.. క్యాన్సర్ రిస్క్ పెంచుతాయని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

బ్రెస్ట్ ఫీడింగ్

బ్రెస్ట్ ఫీడింగ్

బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించవచ్చు.

ఆల్కహాల్

ఆల్కహాల్

క్యాన్సర్ నిరోధించడనికి ఆల్కహాల్ తగ్గించడం లేదా ఆల్కహాల్ మానేయడం చాలా అవసరమని.. అధ్యయనాలు చెబుతున్నాయి. మగవాళ్లైతే రోజుకి రెండు కంటే.. ఎక్కువ డ్రింక్స్ తీసుకోరాదని, ఆడవాళ్లు ఒక డ్రింక్ మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తల, మెడ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అలాగే లివర్, కొలరెక్టల్, బ్రెస్ట్ క్యాన్సర్స్ రిస్క్ ఉంటుంది.

ఫిజికల్ యాక్టివిటీ

ఫిజికల్ యాక్టివిటీ

పెద్దవాళ్లు రోజుకి కనీసం 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీకి స్పెండ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గించవచ్చు. బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్ వంటి యాక్టివిటీస్ అలవాటు చేసుకోవడం వల్ల బాడీ యాక్టివ్ గా, హెల్తీగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల హార్ట్ డిసీజ్, డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్ వంటి అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

తృణధాన్యాలు, బార్లీ, వంటి ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ నిరోధించవచ్చు. శరీరానికి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ సరైన స్థాయిలో అందడం వల్ల.. క్యాన్సర్ కణాల వృద్ధిని అరికట్టవచ్చు. మీట్స్, రిఫైన్డ్ గ్రెయిన్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్స్, డిజర్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్, క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

ఫ్రూట్స్, వెజిటబుల్స్

ఫ్రూట్స్, వెజిటబుల్స్

ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లలో యాంటీ క్యాన్సర్ బెన్ఫిట్స్ ఉంటాయి. రోజుకి కనీసం రెండు పండ్లు లేదా అరకప్పు ఫ్రూట్స్ లేదా అరకప్పు వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల.. క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. లేదా రోజుకి ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా.. ఆరోగ్యంగా ఉండవచ్చు.

స్మోకింగ్

స్మోకింగ్

స్మోకింగ్ మానేయడం వల్ల.. క్యాన్సర్ రిస్క్ ని వందశాతం తగ్గించుకోవచ్చని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ స్టడీస్ చెబుతున్నాయి. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల.. నోటి క్యాన్సర్ నివారించవచ్చు.

English summary

10 Changes Help Cut Your Cancer Risk

10 Changes Help Cut Your Cancer Risk. According to the American Institute for Cancer Research (AICR), one third of the most common cancers could be prevented by following lifestyle recommendations.
Story first published:Thursday, April 14, 2016, 11:07 [IST]
Desktop Bottom Promotion