For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెదడును కుదించే 10 జీవనశైలి అలవాట్లు

By Super
|

సెరిబ్రల్ క్షీణత అనేది మెదడును ప్రభావితం చేసే అనేక వ్యాధులకు ఒక లక్షణంగా ఉంది. ఈ కణజాలం క్షీణత అనేది కణం పరిమాణంలో తరుగుదల అని అర్థం. సైటోప్లాస్మిక్ ప్రోటీన్లు ప్రగతిశీల నష్టం కారణంగా జరుగుతుంది.

మెదడు కణజాలం ఆట్రోఫి కణము యొక్క నష్టం మరియు వాటి మధ్య సంబంధాలను చెప్పుతుంది. మరోమాటలో చెప్పాలంటే,వయస్సు పెరగటంతో పాటు మెదడు పరిమాణం తగ్గిపోతుంది. మా ప్రస్తుత జీవనశైలిలో కొన్ని అలవాట్ల కారణంగా మెదడు కుదించటం జరుగుతుంది.

కాబట్టి, క్రింద జాబితాలో ఉన్న అలవాట్లు మెదడు మీద ఒక ముఖ్యమైన చర్యను కలిగి ఉంటాయి. సరైన సమయంలో ఆలోచన లేకుండా మెదడు సోమరితనం మరియు క్రియారహితంగా మారుతుంది. మీరు మెదడును వ్యాయామం మరియు ఆరోగ్యంగా ఉంచటం చాలా ముఖ్యం.

కాబట్టి మీరు ఏమైనా అనారోగ్య అలవాట్లను పాటిస్తూ ఉంటే కనుక తక్షణమే మానివేసి మెదడు కుచించుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇప్పుడు మెదడును కుదించే జీవనశైలి అలవాట్ల గురించి తెలుసుకుందాం.

1. బ్రేక్ ఫాస్ట్ లేకపోవటం

1. బ్రేక్ ఫాస్ట్ లేకపోవటం

బ్రేక్ ఫాస్ట్ అలవాటు మెదడు మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మనం తినే ఆహారంలో విడుదల అయ్యే కొన్ని రసాయనాలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. బ్రేక్ ఫాస్ట్ తినటం అలవాటు లేకపోతే మనస్సు నెమ్మదిగా సక్రియం అవుతుంది. అలాగే సోమరితనం పెరిగి మెదడు కుదించుకుపోతుంది.

2. నిద్ర లేకపోవటం

2. నిద్ర లేకపోవటం

నిద్ర లేమి అనేది మెదడు మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది చురుకుదనం మరియు ఏకాగ్రతను తగ్గిస్తుంది. అంతేకాక మనస్సు ఏకాగ్రత మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజు కార్యకలాపాలను నిర్వహించాలి.

3. వ్యాయామం మానివేయుట

3. వ్యాయామం మానివేయుట

సోమరితనం మరియు సక్రియంగా ఉండటం అనేది మొత్తం వ్యవస్థకు మంచిది కాదు. చురుకుగా ఉండటం వలన మెదడులో జ్ఞానపరమైన సామర్ధ్యాలు పెరిగి మెదడు కుచించకుండా నివారిస్తుంది.

4. ఎక్కువగా ఫోన్ మాట్లాడటం

4. ఎక్కువగా ఫోన్ మాట్లాడటం

ప్రతి రోజు చేసే కొన్ని రోజువారీ అలవాట్లు నిజంగా ఆరోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతి రోజు ఫోన్ మాట్లాడటం మెదడుకు మంచిది కాదు. ఫోన్ నుండి ఒక ప్రకాశవంతమైన నీలం కాంతి ప్రసరిస్తుంది. కానీ రాత్రి, మెదడు నీలి కాంతి ద్వారా, సూర్యుని యొక్క కాంతి అనుకరించడం వంటి గందరగోళం ఉంటుంది. మెలటోనిన్ ఉత్పత్తిని ఆపటం వలన నిద్ర భావన కలుగుతుంది.

5. H2O నిరాకరించుట

5. H2O నిరాకరించుట

సంవత్సరం మొత్తం నీరు మీకు ఇష్టమైన పానీయంగా ఉండాలి. నీరు మంచి ప్రసరణ అందించడం ద్వారా శరీరంనకు అనేక ప్రయోజనాలు మరియు శరీరాన్ని క్రియాశీలంగా చేయడానికి సహాయపడుతుంది. మెదడు శరీరంలో ఇతర బాగాల కంటే ఎక్కువ నీటిని ఉపయోగిస్తుంది. బ్రెయిన్ కణాలలో సుమారు 85 శాతం నీరు ఉంటుంది.

6. ఆల్కహాల్

6. ఆల్కహాల్

ఆల్కహాల్ కొంత వరకు పర్వాలేదు. కానీ మోతాదు ఎక్కువైతే మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్ డిప్రెసెంట్ ని కలిగిస్తుంది. దాంతో ఇది మెదడు మీద పనిచేసి వ్యక్తి యొక్క ఆలోచన మరియు ఆలోచన ప్రక్రియ మీద ప్రభావం చూపుతుంది.

7. ఎరోటిక్ డ్రగ్స్

7. ఎరోటిక్ డ్రగ్స్

చట్ట విరుద్ధమైన మందులు మెదడు నరాల కణాలను దెబ్బతిస్తాయి. జ్ఞాపకశక్తిని కోల్పోయేలా ప్రేరేపించి అభిజ్ఞాత్మక శక్తి పనితీరును తగ్గించుట మరియు ప్రవర్తనలపై దీర్ఘ,శాశ్వత ప్రభావాలు ఉంటాయి. ఇది మీ మెదడును కుదించే చెత్త అలవాట్లలో ఒకటి.

8. ఒత్తిడి

8. ఒత్తిడి

ఒత్తిడి ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు. కాబట్టి ఒత్తిడిని నియంత్రించటం చాలా అవసరం. ఒత్తిడి అనేది మెమరీ మరియు నేర్చుకొనే సంబంధం కలిగిన ప్రాంతాల్లోని కణాలను చంపుతుంది. కాబట్టి ఒత్తిడిని తప్పనిసరిగా తగ్గించుకోవాలి.

9. ఎక్కువ ఆహారం తీసుకొనుట

9. ఎక్కువ ఆహారం తీసుకొనుట

ఊబకాయం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఒక మిలియన్ కంటే ఎక్కువ మందిని కబళించిన వ్యాది. ఊబకాయం అనేది గుండె మరియు మెదడును నాశనం చేస్తుంది. తక్కువ ఆహారం లేదా సరైన మొత్తంలో ఆహారం తీసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి నివారించవచ్చని కొన్ని నివేదకలు చెప్పుతున్నాయి.

10. ధూమపానం

10. ధూమపానం

ధూమపానం సరదాగా అలవాటు అవుతుంది. అయితే ధూమపానం అనేది మనల్ని చంపుతుంది. ఇది మెదడు, ఊపిరితిత్తుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం వలన మెదడులో కీలకమైన కణజాలంనకు నష్టం జరుగుతుంది. దాంతో నిదానంగా మెదడు కుచించుకుపోతుంది.

English summary

10 Lifestyle Habits That Shrink Your Brain

Cerebral atrophy is a common feature of many of the diseases that affect the brain. Atrophy of any tissue means a decrement in the size of the cell, which can be due to progressive loss of cytoplasmic proteins. In brain tissue, atrophy describes a loss of neurons and the connections between them.
Story first published: Tuesday, March 15, 2016, 17:04 [IST]
Desktop Bottom Promotion