For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొలలతో బాధపడేవాళ్లు ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడని ఆహారాలు.. !

By Swathi
|

మొలల నొప్పి ఉన్నవాళ్లు చాలా తీవ్రమైన నొప్పి ఫేస్ చేస్తుంటారు. మోషన్ కి వెళ్లినప్పుడు రక్తం కారడం వల్ల ఈ నొప్పి మొదలవుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. సమస్య మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మొదట్లోనే గుర్తించి, సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. అయితే మొలల నొప్పితో బాధపడేవాళ్లు కేవలం మందులు ఉపయోగిస్తే సరిపోదు.. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం.

పైల్స్ (మొలలు)నివారణకు 10 సూపర్ ఫుడ్స్...

అనాల్ లో వాపు, ఇరిటేషన్, నొప్పి లేకుండా బ్లీడింగ్ వంటి లక్షణాలు.. మొలలకు కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ పైల్స్ ని డైట్ ద్వారా కూడా నయం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏడు రకాల ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండటం వల్ల చాలావరకు పైల్స్ ని నివారించవచ్చని సూచిస్తున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడే తెలుసుకుందాం..

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్

ఒకవేళ మీరు కాన్స్టిపేషన్, పైల్స్ సమస్యతో బాధపడుతున్నారంటే.. మీ అత్యంత ముఖ్యమైన శత్రువు స్పైసీ ఫుడ్ అని గ్రహించాలి. తక్కువ కారం, హీట్ తక్కువగా ఉండే ఫుడ్, స్పైస్ లేని ఆహారాలను తీసుకునేలా మీ డైట్ మార్చి చూడండి.. మీకున్న సమస్య తగ్గిపోతుంది. అలాగే రోడ్ సైడ్ ఫుడ్స్ కి కూడా దూరంగా ఉండటం మంచిది.

చీజ్

చీజ్

మీరు మీగడను ఎక్కువగా ఇష్టపడుతున్నారా ? అయితే అప్పుడప్పుడు చీజ్ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ.. ఎక్కువగా చీజ్ ఫుడ్, చీజ్ పిజ్జా తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే తీసుకునే జాగ్రత్త పడితే.. పైల్స్ సమస్య కంట్రోల్ లో ఉంటుంది.

రెడ్ మీట్

రెడ్ మీట్

స్పైసీ ఫుడ్ తర్వాత మరీ ఎక్కువగా పైల్స్ కారణమయ్యే వాటిలో మాంసం ఒకటి. ముఖ్యంగా రెడ్ మీట్ జీర్ణమవడం చాలా కష్టం. మీరు ఎక్కువగా కాన్స్టిపేషన్ కి గురవుతున్నారంటే.. ఖచ్చితంగా.. అప్పుడప్పుడు వెజిటేరియన్ డైట్ ఫాలో అవ్వాలి. మాంసాహారానికి కొంచెం దూరంగా ఉండటం మంచిది.

ఆల్కహాల్

ఆల్కహాల్

అప్పుడప్పుడు బీర్ లేదా గ్లాసు వైన్ తాగడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. కానీ.. ప్రతి వీకెండ్ ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఆల్కహాల్ వల్ల డీహైడ్రేషన్, కాన్ట్సిపేషన్ వంటి వాటికి కారణమవుతుంది. ఇవి పైల్స్ కి దారితీస్తాయి. కాబట్టి వీలైనంతవరకు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.

డీప్ ఫ్రైడ్ ఫుడ్

డీప్ ఫ్రైడ్ ఫుడ్

చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. లైఫ్ బిజీగా మారడంతో.. హెల్తీగా, ఇంట్లో వండుకుని ఫుడ్ తీసుకునే టైం ఉండటం లేదు. దీంతో వాళ్ల వంటిల్లు మొత్తం రెడీమేడ్ ఫుడ్ తో నిండిపోతోంది. బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తో డిన్నర్ కానిచ్చేస్తున్నారు. ఇలాంటి ఆహారాల వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది.

కెఫీన్

కెఫీన్

పైల్స్ తో బాధపడేవాళ్లకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే.. కెఫీన్ కూడా పొట్టలో సమస్యలు, డీహైడ్రేషన్ సమస్యలకు కారణమవుతాయి. రోజుకి ఆరు నుంచి ఎనిమిది కప్పుల కాఫీ తాగే అలవాటు మీకు ఉందంటే.. మీరు పైల్స్ నుంచి కోలుకోవడం కష్టం. కాబట్టి.. కాఫీ బదులు గ్రీన్ టీ తాగడం వల్ల తేలికగా జీర్ణమవుతుంది.

విరేచనాల మందు

విరేచనాల మందు

ఇది ఆహారం కాకపోయినా.. పైల్స్ తో బాధపడేవాళ్లు.. విరేచనాలు అయ్యే మందులు వాడటం ఏ మాత్రం సేఫ్ కాదు. వీటిని రెగ్యులర్ గా వాడటం వల్ల.. మున్ముందు పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. న్యాచురల్ గా మోషన్ అవడానికి డైట్ ఫాలో అవడం, జ్యూస్ లు, నీళ్లు ఎక్కువగా తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

7 foods you should avoid if you suffer from piles or hemorrhoids

7 foods you should avoid if you suffer from piles or hemorrhoids. Anyone who is living with piles or hemorrhoids will tell you about the acute discomfort they experience. Piles causes swollen and irritated veins in the patient's anal opening along with painless bleeding.
Story first published:Tuesday, June 7, 2016, 14:43 [IST]
Desktop Bottom Promotion