For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగించే 7 హెర్బ్స్

By Super
|

దంతాలు, చిగుళ్ళ నొప్పికి ఉపశమనం కలిగించే కొన్ని సీక్రెట్ హెర్బ్స్ ఉన్నాయి . నిజానికి ఈ హెర్బ్స్ మనకు బాగా వాడుకలో ఉన్నా..తెలిసినవే అయినా.. చాలా మందికి వీటి ప్రభావం గురించి తెలియదు .

దంతాల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మన వంటగదిలోని మూలికలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని, మనలో చాలా మందికి తెలియదు. ఉదాహరణకు లవంగాలు లేదా దాల్చిన చెక్క. దంతాల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఏ ఒక్క హెర్బల్ రెమెడీనీ అప్లై చేయాలన్నా... ముందుగా దంతాల నొప్పికి ముఖ్యకారణం తెలుసుకోవాలి. దంతాల నొప్పికి వివిధ రకాల కారణాలున్నాయి . దంతక్షయం, విరిగిన దంతాలు, గమ్ ఇన్ఫెక్షన్, సైనస్ మొదలగు కారణాల వల్ల దంతాల నొప్పులను గుర్తించాలి.

దంతాల నొప్పికి మరో కారణం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, రోజూ వివిధ రకాల ఆహారాలను తింటుండటం. కాబట్టి, రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం చాలా అవసరం . అలాగే బోజనం చేసిన ప్రతి సారి నోట్లో నీరు పోసుకొని పుక్కలించడం కూడా చాలా ముఖ్యం.

అలాగే నెలకొకసారి డెంటిస్ట్ ను కలవడం, చెక్ చేయించుకోవడం మంచిది. పిల్లలు స్వీట్స్ ఎక్కువగా తింటుంటారు. దాని వల్ల ఈ స్వీట్స్ చిగుళ్ళు, దంతా మద్య చేరడం వల్ల వారి దంతాలకు ఇన్ఫెక్షన్ మరియు వాపుకు దారితీస్తుంది.

ఏదైనా ప్రమాద స్థితి ఏర్పడినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అయితే ప్రారంభంలో నొప్పి నివారించడానికి కొన్ని సీక్రెట్ హెర్బ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ ఉపయోగించవచ్చు. కాబట్టి, ఇప్పటి నుండి మీ దంత ఆరోగ్యం మరియు శరీర ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా, నవ్వుతూ జీవించండి. దంతాల నొప్పి నుండి ఉపశమనం కలిగించే హెర్బ్స్ ఏంటో తెలుసుకుందాం...

1. పెప్పర్ మింట్ లీఫ్:

1. పెప్పర్ మింట్ లీఫ్:

దంతాల నొప్పిని నివారించడంలో పెప్పర్ మింట్ లీవ్స్ ఎంతగానో సహాయపడుతాయని కొన్ని వైద్యపరిశోధనల ద్వారా వెల్లడించారు . దంతాల నొప్పిని నివారించడానికి పెప్పర్ మింట్ లీవ్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . పెప్పర్ మింట్ ఆయిల్ మరో మంచి ఎంపిక. కాబట్టి, దంతాల నొప్పి ఉన్నప్పుడు రెండు నుండి నాలుగ పుదీనా ఆకులను శుభ్రం చేసి, నోట్లో వేసుకొని నమలాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీరు మరియు ఉప్పు తో నోటిని శుభ్రం చేసుకోవాలి.

2. లవంగాలు:

2. లవంగాలు:

పూర్వకాలం నుండి దంతాల నొప్పిని నివారించుకోవడం కోసం ఒక ఉత్తమ ఔషదంగా లవంగాలను ఉపయోగిస్తున్నారు. దంతాల నొప్పిని నివారిండానికి సహాయపడే యూజినోల్ అనే గుణాలు ఇందులో అదికంగా ఉన్నాయి . కొన్ని లవంగానలు మొత్తగా పౌడర్ చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లైచేయాలి . ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షనాలు దంతాల నొప్పి మరియు ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది .

3.క్యాబేస్ :

3.క్యాబేస్ :

దంతాల నొప్పినుండి ఉపశమనం కలిగించడంలో ఇది ఒక సీక్రెట్ హెర్బ్ అని మీకు తెలుసా ? క్యాబేజ్ దంతాల చీవర్లో మరియు చిగుళ్ల మద్య డిటాక్సిఫై చేస్తుంది .. క్యాబేజ్ ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, కొద్దిగా ఆ పేస్ట్ తీసుకొని నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి .

4. అల్లం:

4. అల్లం:

అల్లం ఇంట్లో ఉంటే చాలు దంతాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మరే ఔషదం అవసరముండదు . అల్లంశుభ్రంగా కడిగి పొట్టు తొలగించి సన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొన్ని పీసులను నోట్లో వేసుకొని బాగా మలలానలి . ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు.

5. థైమ్స్ :

5. థైమ్స్ :

దంతచిగుళ్ల ఇన్ఫెక్షన్ మరియు దంత క్షయంతో బాధపడేవారు, ఈ హెర్బల్ రెమెడీని ఖచ్చితంగా ఉపయోగించాలి . ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, మరియు ఔషధ గుణాలు దంతాలనొప్పిని నివారించడంలో గ్రేట్ ఉత్తమ హెర్బల్ రెమెడీ . పెప్పర్ మింట్ ఆయిల్ తో కలిపి తీసుకుంటే త్వరిత ఉపశమనం కలుగుతుంది.

6. యారో :

6. యారో :

దంతాల నొప్పి తో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లైతే కొన్ని ఫ్రెష్ గా ఉండే యారో ఆకులను నోట్లో వేసుకొని నమలాలి . దంతాలను ఈ ఆకులతో కవర్ చేయాలి . ఇది త్వరా ఉపశమనం కలిగిస్తుంది. దంతాలనొప్పి నివారించడంలో ఇది ఒక ఉత్తమ సీక్రెట్ హెర్బ్.

7. స్పిలాంథస్:

7. స్పిలాంథస్:

ఇది అంత పాపులర్ కాకపోవచ్చు, కానీ దంతాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది . దంత క్షయం మరియు దంతాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది .

English summary

7 Secret Herbs For Tooth Pain Relief

7 Secret Herbs For Tooth Pain Relief. You can say that these are secret herbs for tooth pain relief, but in reality they are secret just because many of you are not aware of their effective impacts on toothache.
Desktop Bottom Promotion