For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకూడని 7 సర్ ప్రైజింగ్ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు.!

|

బ్రెయిన్ ట్యూమర్ ''సైలెంట్ కిల్లర్''. ఎలాంటి కారణాలు లేకుండానే మెదడులో క్యాన్సర్, నాన్ క్యాన్సర్ కణితులు ఏర్పడుతుంటాయి. మెదడులో క్రమంగా పాతకణజలాలు పోయి కొత్త కణజాల సృష్టి నిరంతరంగా జరుగుతున్నప్పుడు పాత కణజాలు సమసిపోకుండా మిగిపోయినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వస్తుంది.

ఈ వ్యాధిని తెలుగులో 'మెదడు కణిత' అని పిలుస్తారు. ఈ వ్యాధి సంక్రమించడం వల్ల ఏ భాగానికైన దేబ్బతగిలితే అక్కడ పనితీరు మందగిస్తుంది. పిల్లలు, యువకులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి 25 - 35 సం.ల మధ్య వయసులో ఉన్న వాళ్లకి ఎక్కువగా వస్తుంది. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించకపోవడం వల్ల 3 శాతం మంది 5 సం.లకే మరణిస్తారు.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి రెండు రకాలు. మెదడులో స్వతహాగా ఏర్పడే కణితిని ప్రైమరీ ట్యూమర్ అంటారు. శరీరంలోని ఛాతీ, పొట్ట,లివర్, లంగ్‌ల సమస్యల ద్వారా మెదడులో ఏర్పడే కణితిని సెకండరీ ట్యూమర్ అంటారు.

ధూమపానం వల్ల ఊపరితిత్తుల నుంచి మెదడులో కణితి ఏర్పడవచ్చు. అలాగే అధికంగా మద్యం తాగటం వల్ల లివర్ ద్వారా మెదడులో కణితి ఏర్పడే అవకాశాలున్నాయి. సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక కేవలం రెండు సెకండ్లలోనే మెదడులో ఏర్పడిన కణితిని సులభంగా గుర్తిస్తున్నారు.

తరచూ తలనొప్పి:

తరచూ తలనొప్పి:

రెగ్యులర్ హెడ్ ఏక్ మరియు బ్రెయిన్ ట్యూమర్ హెడ్ ఏక్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రొఫషనల్స్ సహాయంతో బ్రెయిన్ ట్యూమర్ సమస్యను తగ్గించుకోవచ్చు.

దృష్టి లోపం:

దృష్టి లోపం:

విజన్ లాస్. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకు ముఖ్య కారణం స్ట్రెస్ లేదా కళ్ల మీద ఎక్కువగా ఒత్తిడి కలగడం. బ్రెయిన్ ట్యూమర్ పేషంట్స్ లో ఈ లక్షణాలను తరచూ గమనిస్తుంటారు.

మాటలు తడబడటం:

మాటలు తడబడటం:

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్స్ లో ఫ్రంటోల్ లోబ్ మీద ప్రభావం చూపడంతో మాట్లాడటానికి చాలా డిఫికల్ట్ గా బావిస్తారు. వారి మాటల్లో స్పష్టత లేకపోవచ్చు. లేదా మాటలు తడబడవచ్చు.

మూడ్ స్వింగ్స్:

మూడ్ స్వింగ్స్:

తరచూ మూడ్ మారుతుంటుంది: . బ్రెయిన్ ట్యూమర్ పేషంట్స్ లో డిప్రెషన్, అగ్రెషన్, యాంక్సైటీ, మరియు బిహేవియర్ లో మార్పులు కనబడుతాయి. ఈ లక్షణాలన్నింటికి కారణం బ్రెయిన్ లో ఉత్పత్తి అయ్యే కెమికల్స్ వల్లే.

వినికిడి లోపం:

వినికిడి లోపం:

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్స్ లో హియరింగ్ సమస్యలు కూడా ఉంటాయి. పూర్తిగా వినపడకపోవడం, లేదా పూర్తిగా వినపడకపోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలను తరచూ నిర్లక్ష్యం చేస్తుంటారు.

ఇన్ ఫెర్టిలిటి:

ఇన్ ఫెర్టిలిటి:

బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారందరిలో ఈ సమస్య ఉండకపోవచ్చు . బ్రెయిన్ ట్యూమర్ పిట్యూటరీ గ్రంథి మీద ప్రభావం చూపుతుంది. ఇది స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫెర్టిలిటీ మీద ప్రభావం చూపుతుంది.

బ్యాలెన్స్ తప్పిపోతుంది:

బ్యాలెన్స్ తప్పిపోతుంది:

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్స్ లో సెరిబెల్లం మీద ప్రభావం చూపుతుంది. దాంతో బాడీలో బ్యాలెన్స్ తప్పుతుంది. కోఆర్డినేషన్ మరియు మూమెంట్స్ కూడా తగ్గుతాయి. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారు నడవడంలో కష్టంగా ఉంటుంది.

English summary

7 Surprising Signs Of Brain Tumour You Must Never Ignore!

There is a popular expression, "silent killer", that is used to describe assassins who kill people before they even realise it, not leaving behind any signs of the crime committed.
Story first published: Tuesday, August 9, 2016, 17:03 [IST]
Desktop Bottom Promotion