For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్..! కిడ్నీ ఫెయిల్యూర్ సూచించే డేంజర్ సంకేతాలు..

By Swathi
|

తాజా అధ్యయనాల ప్రకారం గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ తర్వాత స్థానాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉన్నాయట. ఇటీవల చాలామంది కిడ్నీల ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 90 శాతం మంది ఇండియన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్, అనారోగ్యకర ఆహారపు అలవాట్లేనని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

రక్తంలోని అనవసర పదార్థాలను ఫిల్టర్ చేయడమే కిడ్నీల ప్రధాన ప్రక్రియ. ఫ్యాటీ యాసిడ్స్, హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం ఎక్కువవుతోంది. దీనివల్ల పరిమితికి మించి కిడ్నీలపై ఒత్తిడి పెరగడం వల్ల కిడ్నీల ఫెయిల్యూర్ సమస్యలు పెరుగుతున్నాయి.

kidney damage

కిడ్నీలు బ్లడ్ ప్రెజర్, ఎలక్ట్రోలైట్స్, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి వంటి వాటికి కూడా సహాయపడతాయి. కాబట్టి శరీరంలో కిడ్నీలు చాలా అవసరమైనవి. చాలా ముఖ్యమైన అవయవాలు. కాబట్టి ఇండియన్స్ ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని.. నీళ్లు బాగా తాగలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్యాట్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్ దూరంగా ఉండటం వల్ల కిడ్నీల పనితీరు సజావుగా సాగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కిడ్నీలకు సంబంధించి ఏ మాత్రం చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే అలర్ట్ అవడం చాలా అవసరం. కాబట్టి కిడ్నీల డ్యామేజ్ సూచించే డేంజర్ సంకేతాల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవడం చాలా అవసరం. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

యూరిన్ ప్రాబ్లమ్స్

యూరిన్ ప్రాబ్లమ్స్

యూరిన్ తక్కువగా వెళ్తున్నారు అంటే.. మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నారని గ్రహించాలి. అలాగే రాత్రి పూట ఎక్కువగా యూరిన్ కి వెళ్తున్నారంటే.. కూడా కిడ్నీలకు సంబంధించిన వ్యాధికి సంకేతం. సాధారణంగా కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది.

MOST READ: డెంగ్యూ వచ్చిందా? ఇవి తినండి చాలు!

యూరిన్

యూరిన్

యూరిన్ క్లియర్ గా ఉండి.. యూరిన్ కి వెళ్లినప్పుడు నొప్పిగా ఉంది అంటే.. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి సంకేతంగా గుర్తించాలి. యూరిన్ తోపాటు రక్తం కూడా వెళ్తుంటే.. ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఇది కూడా కిడ్నీ డ్యామేజ్ ని సూచించే లక్షణం.

వాపు

వాపు

పాదం, మడిమలు చాలా ఎక్కువగా వాపు వచ్చాయంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. కొన్ని సందర్భాల్లో పాదాల వాపులు కిడ్నీల ప్రక్రియ తగ్గిపోయిందని సూచిస్తుంది.

తినాలనిపించకపోవడం

తినాలనిపించకపోవడం

ఆకలి చాలా తక్కువగా ఉండటం, వికారం, వాంతులు ఉండటం వంటి లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో టాక్సిన్స్ ఎక్కువైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది.

కళ్లు

కళ్లు

కిడ్నీల ద్వారా ఎక్కువ మోతాదులో ప్రొటీన్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్లినప్పుడు కళ్లు వాపులు వస్తాయి. ఇలాంటి లక్షణం కనిపించగానే డాక్టర్ ని సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అలాగే కిడ్నీ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం.

కండరాలు

కండరాలు

ఎలక్ట్రోసైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కిడ్నీ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఒకవేళ మీరు రోజంతా కండరాల నొప్పులతో బాధపడుతుంటే.. కిడ్నీలపై దుష్ర్పభావం చూపుతోందని గ్రహించాలి.

MOST READ: కడుపు ఉబ్బరమా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి !

యూరిన్ కలర్

యూరిన్ కలర్

మీ ఆరోగ్యం గురించి మీ యూరిన్ చాలా విషయాలు చెబుతుంది. మీరు యూరిన్ కి వెళ్లినప్పుడు నురుగు ఎక్కువగా వస్తుంది అంటే.. అది కిడ్నీ ఫెయిల్యూర్ కి సంకేతమని గుర్తించండి. అలాగే కొంచెం దుర్వాసన కూడా ఉందంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి.

చర్మంపై దురద

చర్మంపై దురద

మీ రక్తంలో మినరల్స్, ప్రొటీన్స్ ని సరైన మోతాదులో కిడ్నీలు బ్యాలెన్స్ చేయలేకపోతే.. చర్మంపై దురద మొదలవుతుంది. దురద ఎక్కువగా ఉన్నప్పుడు క్రీములు, మందులు వాడటం కంటే.. ఒకసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

English summary

8 Scary Signs That Show Your Kidneys Are Shutting Down

8 Scary Signs That Show Your Kidneys Are Shutting Down. According to recent studies, kidney failure ranks third on the list of common health problems after heart diseases and cancer.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more