For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడనొప్పి (సర్వైకల్ స్పాండిలోసిస్)కి 9 ఎఫెక్టివ్ హోం రెమెడీస్...

|

ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య మెడనొప్పి. దీన్నే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటుంటారు. సర్వైకల్ స్పాండిలోసిస్ సాధారణంగా మెడకు సంబంధించి లక్షణాలు కనిపిస్తాయి. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కొంచెం ఎక్కువగానే ఉంటోంది. మెడనొప్పి ముఖ్యంగా 40 సం॥దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారినపడుతున్నారు.

పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పకోవచ్చు. ఇంకా తరచూ ద్విచక్రవాహనాలు నడిపేవారిలో, కదలకుండా కంప్యూటర్ ముందుగాని, డెస్క్‌లో గాని ఎక్కువగా కూర్చుని ఉండేవారిలో ఈ డిస్క్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కారణాల వల్ల ఇప్పుడు 20-30 సం॥వయస్సు వారిలో కూడా ఈ వ్యాధి చూస్తున్నాము.

ఇక ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ పెద్దగా లేని వారిలో కూడా ఈ సమస్యలు చాలా తరచుగా గమనించవచ్చు. ఈ తరహా సమస్యలు అందరిలో కనిపిస్తున్నా స్త్రీలతో పోలిస్తే ఇవి పురుషుల్లోనే ఎక్కువ. వయసు మీరిన కొద్దీ వృద్ధులలో 90 శాతం పైన వెన్నుపూసలలో మార్పులు చూస్తాము. దీని గురించి 1992లో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం... 40 సంవత్సరాలు దాటిన పురుషులలో ఈ వెన్నుపూసకు సంబంధించిన మార్పులు సర్వసాధారణం.

అయితే ఈ మార్పుల కారణంగా డిస్క్‌ల మధ్యన ఉండే నరాల మీద ఒత్తిడి పెరుగుగుతుంది. దాంతో ఒకవేళ ఇలాంటి మార్పులు మెడ దగ్గర ఉండే వెన్నెముకల మధ్య సంభవించినప్పుడు మెడ పట్టేసినట్లు ఉండటం, తలనొప్పి, కళ్లు తిరగడం, భజాలు, చేతుల నొప్పి, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నరాల మీద ఒత్తిడి వల్ల తలతిరగడం, నడకలో తేడా వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

మెడ ఆకృతి చూస్తే మెడలోని ఏడు వెన్నుపూసలు, కండరాలు, పైన రెండు లిగమెంట్స్ మెడ వెన్నుపూస... మెడ అటు ఇటు తిరగటానికి, మిగిలినవి పటుత్వానికి ఉపయోగపడతాయి. వెన్నుపూసల మధ్యగా వెళ్లే వెన్నుపాము మన శరీరంలో జరిగే సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. మెడకు దెబ్బ తగలడం వలన, వెన్నుపూసలో మార్పుల వలన నరం మీద ఒత్తిడి పెరిగి సమాచారం చేరడంలో లోపం వలన తలతిరగడం, తిమ్మిర్లు, నడకలో తేడా రావచ్చు.

కారణాలు: ఎముకలు అరగడం, ఎముకలలోపల జిగురు పదార్థం (కార్టిలేజ్) తగ్గడం వలన ఎముకల బలం సాంద్రత తగ్గుతుంది. ఎముకలు అరుగుట వలన ఎగుడు, దిగుడు bone spurs తయారవుతాయి. దాంతో కండరాల నొప్పి, మెడ తిప్పడంలో ఇబ్బంది, చేతులు లాగడం, మెడనొప్పి వలన పైకి చూస్తే కళ్ళు తిరగడం, ఛాతి భాగంలో నొప్పి, సూదులు పొడిచినట్లుగా నొప్పి, మంటలు, నడకలో తూలినట్లు కావడం, కండరాల రిఫ్లెక్సెస్‌లో మార్పులు, మలమూత్ర విసర్జనపై అదుపు కోల్పోవడం.

సర్వైకల్ స్పాండిలోసిస్ ఇక భరించలేని పరిస్థితిలో ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పనిసరి. నొప్పితో బాధపడుతన్నా, కొద్దిగా స్ట్రెస్ ఫుల్ గా అలాగే ఉండటం వల్ల, నొప్పి మరింత విపరీతంగా ఉంటుంది. నొప్పి ప్రారంభంలోనే గుర్తించి, తక్కువగా ఉన్నప్పుడు కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తంది. మెడ నొప్పిని మరియు అసౌకర్యాన్ని నివారిస్తాయి. మరి అటువంటి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

1. హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్:

1. హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్:

హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్: మెడనొప్పి నివారించుకోవడానికి మరో సింపుల్ రెమెడీ ఇది. నొప్పి ఉన్న ప్రదేశంలో కోల్డ్ అండ్ హాట్ కంప్రెసర్ ను ఉపయోగించాలి. హాట్ కంప్రెసర్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, సోర్ మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. కోల్డ్ కంప్రెసర్ వాపును మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలను నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ లక్షణాలుండటం వల్ల మెడ, భుజం నొప్పి, వాపు, ఇన్ల్ఫమేషన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. రెగ్యులర్ గా పచ్చి వెల్లుల్లి రెబ్బలను కాలీ పొట్టతో తిని, నీళ్ళు త్రాగాలి. గార్లిక్ క్యాప్సిల్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్సన్ తో తీసుకోవడతో నొప్పి నివారించుకోవచ్చు

3. రెగ్యులర్ ఎక్సర్ సైజ్ :

3. రెగ్యులర్ ఎక్సర్ సైజ్ :

సర్వైకల్ స్పాండిలోసిస్ కు ముఖ్య కారణం వ్యాయామలోపం. కాబట్టి ప్రతి రోజూ కొన్ని సింపుల్ గా ఉండే ఫిజికల్ ఎక్సర్ సైజులు చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. తలను ముందుకు వెనకకు, మరియు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేయడం మంచిది. లెఫ్ షోల్డర్ టు రైట్ షోల్డర్ కు రొటేట్ చేయడం మంచిది. ఇలా ప్రతి రోజూ రెండు, మూడు సార్లు చేస్తే మంచిది . ఇలా చేయడం వల్ల మెడనొప్పి నివారించుకోవచ్చు.

4. ఎప్సమ్ సాల్ట్ బాత్:

4. ఎప్సమ్ సాల్ట్ బాత్:

సర్వైకల్ స్పాడిలైటిస్ సమస్యతో బాధపడే వారు ఎప్సమ్ సాల్ట్ బాత్ ను రెగ్యులర్ గా చేసుకుంటే మంచిది . ఎప్సమ్ సాల్ట్ లో ఉండే మెగ్నీషియం శరీరంలోని పిహెచ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది . ఇది మెడ, మరియు భుజాల యొక్క స్టిప్ నెస్ ను, ఇన్ఫ్లమేషన్, తగ్గిస్తుంది. ఎప్సమ్ సాల్ట్ లో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి తర్వాత స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. వేప:

5. వేప:

వేపలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నొప్పి నివారణ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇది నొప్పిని, ఇన్ఫ్లమేషన్ మరియు వాపును తగ్గిస్తాయి .

6. అల్లం:

6. అల్లం:

అల్లం మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. అల్లం ఒక ఆయుర్వేద మూలిక. ఈ మూలికలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. దాంతో మెడచుట్టు, భుజాల వద్ద నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

7. కేయాన్ పెప్పర్:

7. కేయాన్ పెప్పర్:

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ కేయాన్ పెప్పర్. ఇందులో క్యాప్ససిన్ ఉంటుంది.ఇది అనాల్జిక్ లక్షణాలను, అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీల క్షణాలను కలిగి ఉంటుంది . ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక చెంచా కేయాన్ పెప్పర్ పౌడర్ ను గోరువెచ్చని నూనెలో మిక్స్ చేసి నొప్పి, వాపు ఉన్న ప్రాతంలో అప్లై చేసి బ్యాడేజ్ చుట్టాలి. కొన్ని గంటల తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి.

8. నువ్వుల నూనె:

8. నువ్వుల నూనె:

మరో పాపులర్ ఆయుర్వేదిక్ రెమెడీ, సర్వైకల్ స్పాండిలోసిస్ ను నువ్వులతో నివారించుకోవచ్చు . నువ్వుల్లో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, ఫాస్పరస్ మరియు విటమిన్ కె మరియుడిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మరియు మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . మెడనొప్పిని తగ్గించడానికి నువ్వుల నూనె కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొద్దిగా గోరువెచ్చని నువ్వుల నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 10 నిముషాల తర్వాత హాట్ కంప్రెసర్ తో మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజూ మూడు నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

9. ఆపిల్ సైడర్ వెనిగర్:

9. ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే ఆల్కలైజింగ్ లక్షణాలు వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ ను నివారించడంలో చాలా మేలు చేస్తుంది . ఇది మెడీ మరియు భుజాల వద్ద చాలా ఎఫెక్టివ్ గా నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక కాటన్ టవల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్లో డిప్ చేసి మెడచుట్టు అప్లై చేయాలి . ఇలా రోజూ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

9 Home Remedies For Cervical Spondylosis

Cervical spondylosis, aka neck arthritis, is a condition in which there is a wear and tear in the cervical spine. Though this is an age-related condition, nowadays more and more young people are suffering from it.
Story first published:Friday, May 20, 2016, 11:43 [IST]
Desktop Bottom Promotion